Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

mlcsవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వుండే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ జిల్లాలో వైసిపి టిక్కెట్లకు డిమాండ్‌ వుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లున్నారు. కొన్ని నియోజకవర్గాల టిక్కెట్ల కోసం సీనియర్‌ నాయకులతో పాటు కొత్తగా పార్టీలో చేరుతారనే ప్రచారం వున్న నాయకులు కూడా పోటీ పడే అవకాశం వుంది.

భిన్నంగా టీడీపీ పరిస్థితి

వైసిపిలో ఈ పరిస్థితి వుంటే టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా వుంది. ఆ పార్టీకి సమర్ధులైన అభ్యర్థుల కొరత వుంది. ప్రస్తుతం పార్టీలో వున్న ఇద్దరు ముగ్గురు గట్టి నాయకులు వైసిపిలో చేరుతారనే ప్రచారం వుంది. ఇది జరిగితే అభ్యర్థులను వెదుక్కోవడం వారికి ఇంకా కష్టం కావచ్చు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఈసారి తెలుగుదేశంలోనే వుంటే అసెంబ్లీ సీటును అడగొచ్చు. అప్పుడు లోక్‌సభకు బీద మస్తాన్‌రావును దించాల్సి రావచ్చు. బిఎంఆర్‌ను లోక్‌సభకు పెడితే ఎమ్మెల్సీగా వున్న బీద రవిచంద్రను కావలి నుండి రంగంలోకి దించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎన్నికల నాటికి ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ళ దాకా వుంటుంది. అయినా కూడా సర్వేపల్లి బరిలో ఆయననే దించాల్సిన పరిస్థితి. సర్వేపల్లిలో ఆయన అయితే తప్పితే ఇంకెవరూ పోటీలో నిలవలేరు. మరో మంత్రి నారాయణ సైతం ఈసారి ఎన్నికల్లో ఎక్కడో చోట పోటీకి దిగక తప్పేటట్లు లేదు. ఎందుకంటే పార్టీలో గట్టి అభ్యర్థులు వీళ్లే. ఎన్నికల్లో వీళ్లను పక్కన పెట్టి పార్టీకి నష్టం చేసుకోలేరుగా!

childఏదో అనుకుంటే.. ఇంకేదేదో అయిపోతున్నట్లుగా ఉంది మన దేశం పరిస్థితి. ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉంటుందనుకున్న దేశం కాస్తా..అరాచక భారత్‌గా తయారవుతోంది. ఇన్నాళ్ళకైనా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తే అది కూడా ఆశాభంగమైపోతోంది. చివరికి అడ్డూ అదుపు లేకుండా అరాచకాల దారిలో సాగిపోతోంది. దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాలు సంచరిస్తున్నాయి. ప్రతిరోజూ అరాచకాలు, అకృత్యాలు ప్రబలిపోతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

దేశంలో మహిళలకు, బాలబాలికల రక్షణకు ఎన్నో చట్టాలున్నా, మానవమృగాలు మాత్రం వాటిని కనీసం ఖాతరుచేయకుండా బరితెగింపు ధోరణితో అబలలపై తమ దౌష్ట్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చట్టాలు కొరడా ఝళిపించి కఠిన శిక్షలు విధించకుంటే మాత్రం.. దేశంలో అబలల ఆర్త నాదాలు తప్ప ఇక శాంతినాదాలు వినిపించవు. దేశంలో.. ప్రతి రాష్ట్రంలోనూ ఈ అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కనీసం మానవత్వం కూడా లేని నరరూప రాక్షసులు అమాయకులైన చిన్నారులు, మహిళలను తమ అఘాయిత్యాలకు గురి చేస్తూ విక టాట్టహాసాలు చేస్తూనే ఉన్నారు. అయినా, పాలకులు మాత్రం ఎన్నికలని, రాజకీయాలని ఇంకా మరిన్ని పదవుల కోసం అర్రులు చాస్తూనే ఉంటున్నారే తప్ప దేశంలో జరుగుతున్న ఈ అకృత్యాలను నిరోధిం చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఎక్కడబట్టినా రోజూ ఏదో ఒకచోట అఘాయి త్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే

ఉన్నాయి. ఇటీవల కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో బాలికలపై జరిగిన అత్యాచారాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్ర హోదగ్రులను చేస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగింది. అక్కడి రసానా అనే చిన్న గ్రామంలో గుర్రాలను మేపుకునే ఒక సంచారతెగకు చెందిన బాలికపై మానవమృగాలు సామూహిక అత్యా చారానికి పాల్పడి, ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా చంపివేశాయి. ఆ బాలిక కుటుంబానికి సన్నిహితులైన కొందరు బంధువులే ఈ పైశాచికత్వానికిి పాల్పడ్డారట!..ఎంత ఘోరం!...ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులు లంచం తీసుకుని కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించడం మరెంతో దారుణం. ఆ బాలికపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్ని కంటతడిపెట్టించింది. కశ్మీర్‌నే కాక దేశవ్యాప్తంగా అది తీవ్ర ప్రకంపనలు పుట్టించింది. అయినా, ప్రధాని మోడీ ఆశించిన స్థాయిలో ఆ ఘటనపౖౖె స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేవిధంగా, లక్నో-కాన్పూర్‌ మధ్య 'ఉన్నవ్‌' అనే నగరంలో ఓ అబలపై జరిగిన పాశవిక సంఘటన దేశప్రజల్ని కలచివేస్తోంది.

ఉద్యోగం కోసం అక్కడి బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ నివాసానికి వెళ్తే, తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక యువతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ఆమెకు న్యాయం జరిగేది తర్వాత సంగతి, ఆ తర్వాత ఆమె తండ్రి అనుమానాస్పద మృతి ఘటనతో బాధితురాలు మరింత తల్లడిల్లిపోయింది. ఈ సంఘటనలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా మరింత సంచలనమైంది. న్యాయం చేయమని మొరపెట్టుకుంటున్నా న్యాయం జరగని ఘోర పరిపాలనలో మనం ఉన్నామన్నమాట!..బాధితులను మరింతగా బాధపెట్టే విధంగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ పాలన నిరంకుశపాలనగా ప్రజల్లో ముద్రవేసుకుం టోంది. దీంతో, మొత్తంగా బిజెపి పాలనపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో రాజనీతిజ్ఞులైన మోడీ, అమిత్‌షా వంటి అనుభవజ్ఞులకు తెలియనిది కాదు. కానీ, వారు కూడా ఇలాంటివాటిని చాలా తేలిగ్గా తీసుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదు. మోడీ ఈ దేశాన్ని 'అత్యాచార దేశం'గా మార్చాడంటూ కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా బిజెపి పాలకులు పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తామే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఎవరికి వారు వ్యూహాలు రచించు కుంటున్నారే తప్ప, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఘోరాలను, నేరాలను, ముఖ్యంగా బాలికల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను అణచి వేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో బిజెపి పాలనా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇలాంటి అఘాయిత్యాలే నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సవాల్‌ విసురుతున్నాయి. కశ్మీర్‌లో ఒక బాలికపై మానవమృగాలు అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనతో దేశం అల్లకల్లోలంగా ఉంటే, తాజాగా మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఏడేళ్ళ చిన్నారిపై జరిగిన మరో ఘోరం దేశప్రజలను కలచి వేస్తోంది. పెళ్లి పందిరిలోంచి ఓ చిన్నారిని ఎత్తుకెళ్ళిన ఓ దుండగుడు..మద్యం మత్తులో అత్యాచారం చేసి ఆ చిన్నారిని హతమార్చిన ఘటన కలకలం రేకెత్తిస్తోంది. ఈ అత్యాచారాలతో దేశం అట్టుడికినట్లు

ఉడుకుతోంది. దేశంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైన సమయంలో ఆ మానవమృగాలను కఠినంగా శిక్షించకుండా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం మరింత ఘోరం. ప్రధాని మోడీ ఇలాంటి ఘటనల పట్ల వెంటనే స్పందించకపోవడం దేశప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.

మనదేశంలో మోడీ రాకతో హీరో పాలన వచ్చిందనుకున్నాం. అబలలు, మహిళలు, చిన్నారులు..ఎందరో ఇలా నరరూపరాక్షసుల అకృత్యాలకు బలైపోతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఎలా?..మోడీ వెంటనే మౌనం వీడాలి. ఆ మానవమృగాల అంతుచూడాలి.. అబలలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు జనం. అయినా, పాలకులంటే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలేగానీ.. ఏమి జరుగుతున్నా పట్టించుకోకుంటే అది హీరో పాలన కాదు.. 'నీరో' పాలనే అవుతుంది. ఇకనైనా కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగాలి!.. దేశంలో ఇలాంటి అకృత్యాలకు, అత్యాచారాలకు వెంటనే చరమగీతం పాడాలి!..

anam adalaఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ.

జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి ప్రతిచోటా ఓ బృందం

ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని తన హస్త గతం చేసుకుని పాలించిన ఘనత ఆనం వివేకా నందరెడ్డిది. అన్న నగర రాజకీయాలతో కథ నడుపుతుంటే తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర స్థాయిలో తమ ఉనికిని చాటుకుంటూ అటు తెలుగుదేశంలోనూ ఇటు కాంగ్రెస్‌లోనూ మంత్రిగా కూడా ఆనం హవా కొనసాగించాడు.

ముఖ్యంగా వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ పాల నలో ఆనం కుటుంబ రూపురేఖలే మారిపోయాయి. నెల్లూరుజిల్లాలో నేదురుమల్లి హవా తగ్గించే ప్రక్రి యలో భాగంగా ఆనం వారిని వై.యస్‌. నెత్తినెక్కించు కున్నాడు. వారికి అగ్రతాంబూలం ఇచ్చి జిల్లా రాజ కీయాలలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఆనం వారికి అనూహ్య గుర్తింపు లభించేలా చేశాడు. ఒక దశలో రామనారాయణరెడ్డి మంత్రివర్గంలో అత్యంత కీలకంగా వ్యవహరించే స్థాయిలో వారికి ప్రాధాన్యత కల్పించాడు.

వై.యస్‌. మరణానంతరం ఆయన చేసిన సహాయాన్ని వీళ్ళు మర్చిపోయారు

2009 సెప్టెంబర్‌ 2న వై.యస్‌.రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలవడం అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాలతో ఆనం సోదరులు వై.యస్‌. వారసుడు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా అడుగు వేయడం అప్పట్లోనే కాదు, ఇప్పటికి కూడా పెద్ద చర్చనీయాంశమే. జగన్‌ను వ్యతిరేకించినా, కాంగ్రెస్‌ లోనే కొనసాగి వుండినా పెద్ద తప్పై వుండేది కాదు. తెలుగుదేశంలో చేరి చంద్రబాబుకు జైకొట్టి అటు విజయమ్మని తమ్ముడు, జగన్‌ని అన్న తీవ్రస్థాయి పదజాలంతో విమర్శించడం దూషించడం ''ఆనం'' అభిమానులకే మింగుడు పడలేదు. ఆనంకి అగ్రస్థాన మిచ్చి చేరదీసి ఆదరించిన వై.యస్‌ సతీమణిని ఆయన కుమారుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. రాజకీయంగా విశేష అనుభవం, చాణుక్యత కలిగిన ఆనం సోదరులు ఈ విధంగా ప్రవర్తించడం ఎవ్వరికీ ఇష్టం లేదు.

రావద్దన్నా వచ్చిన ముఖ్యమంత్రి

మొహం చాటేసిన ఆనం కుటుంబసభ్యులు

తమనేదో పొడిచేస్తాడని చంద్రబాబు పంచన చేరిన వారికి చేదు అనుభవాలే మిగిలాయి. తన సహజ ప్రవర్తనతో బాబు వీరికి మొండిచేయి చూపిం చాడు. ఆనం వివేకానందరెడ్డి గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కనీసం చూడడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదు. వివేకా పరిస్థితి రోజురోజుకీ విషమిస్తుందని తెలిసి గత గురువారం ఆయన స్టార్‌ ఆసుపత్రిలో వివేకాను పలకరించడానికి వెళ్తే పాపం వివేకా ముఖ్య మంత్రిని గుర్తుపట్టే స్థితిలో కూడా లేడని సమా చారం. ముఖ్యమంత్రిని రావద్దని ఆనం కుటుంబీకులు చెప్పినా వినకుండా ఆసుపత్రికి వెళ్ళిన బాబుకి ఆనం కుటుంబ సభ్యులందరూ ముఖం చాటేసి నిరసన తెలిపారు.

ఆనం ఆగమనంపై

పార్టీలో భిన్నాభిప్రాయాలు

ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త ఒక్కసారిగా రాష్ట్రమంతా గుప్పుమంది. ఆయన ఆత్మకూరు లేదా వెంకటగిరి నుండి పోటీ చేస్తారని కూడా ప్రచారంలోకి వచ్చింది. దీనికి తగ్గట్లుగా రామనారాయణరెడ్డి బాహాటంగానే తెలుగుదేశాన్ని, పార్టీ అధ్యక్షుడిని విమర్శించడంతో వైసిపి ప్రవేశం ఖాయం అనే నిర్ణయానికి ఆనం అభిమానులు వచ్చేశారు. ఆయన ఏ పార్టీలో చేరినా పరవాలేదు ముందు తెలుగుదేశం నుండి బయటకు వస్తే చాలను కుంటున్న ఆయన అభిమానులు, వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనుకుంటుండిన ఆయన అనుయాయులు సంబరాలు కూడా చేసు కున్నారు. అయితే రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ముఖ్యంగా ఆయన శ్రీమతి విజయమ్మని, కుమారుడు జగన్‌ని అంతటి తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళని ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ వైసిపిలోని ఓ వర్గం వాపోతోంది. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమ ర్శలు, దూషణలు సహజమే కానీ ఆనం సోదరులు ఓ అడుగు ముందుకు వేసి చాలా ఎక్కువ స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా విజయమ్మను రామనారా యణరెడ్డి కించపరచే విధంగా మాట్లాడితే జగన్‌ని వివేకానందరెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడాడు. వీరికా ఇప్పుడు వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ స్థానం కల్పించేదన్న అసంతృప్తి చాలామందిలో కనిపిస్తోంది. అయితే ఆనం వారికి కొద్దోగొప్పో వర్గం వుంది కాబట్టి, వారి రాక పార్టీకి అదనపు బలమే తప్ప నష్టం మాత్రం కాదన్న వాదన కూడా వినపడుతోంది.

బహుశా తమకి ఇంతటి పరిస్థితి వస్తుందని ఆనం వాళ్ళు కలలో కూడా ఊహించి వుండరేమో..! రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలతో పాటు పార్టీ ఫిరాయింపులు కూడా సహజమే. కాని, జిల్లాలో అతిపెద్ద రాజకీయ కుటుంబమైన ''ఆనం'' వారికి ఇలాంటి సంకట స్థితి రావడం నిజంగా విధివైప రీత్యమే. ఒకప్పుడు వారి కోర్కెలతో, వారి కండిషన్స్‌తో వాళ్ళు పార్టీలో చేరేవాళ్ళు, కానీ ఇప్పుడు పార్టీ నిబంధనల మేరకే పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న వారి దీన స్థితి చూస్తుంటే... ఔరా! పాలిటిక్స్‌ & పాలిట్రిక్స్‌ అనిపిస్తుంది.

ఆదాల రాకపై వైసిపి శ్రేణుల ఆసక్తి..!

ఇదే సమయంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా వైసిపి వర్గాల్లో తీవ్ర చర్చకు వస్తోంది. ఆదాల అజాతశత్రువు. ఆయన వల్ల ఎదుటివారికి లాభమే తప్ప ఎదుటి వారి దగ్గర నుండి తానేమీ ఆశించడన్న పేరు కూడా ప్రభాకర్‌రెడ్డికి వుంది. ముఖ్యంగా వై.యస్‌. గురించి గాని, జగన్‌ గురించి గాని ఆయన ఎక్కడా తీవ్రస్థాయి విమర్శలు చేయలేదు. తన పని తాను చేసుకుపోతాడు తప్ప వివాదాల జోలికి వెళ్ళడు. ఒక పర్యాయం మంత్రిగా, మూడు పర్యాయాలు, ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఏ పార్టీలో చేరినా తన ప్రభావాన్ని ప్రభంజనంలా చూపించగలడన్న ధీమా అందరిలోనూ ఉంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన ప్రస్తుతం వున్నప్పటికీ తెలుగుదేశంలో కొనసాగడం ఆయన అనుచరులకే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి రాజకీయ అనుభవంతో పాటు అనుచరగణం కూడా ఎక్కువే. ఆయనకంటూ ఓ వర్గాన్ని ఆయనదంటూ బృందాన్ని ఎప్పుడూ దగ్గర పెట్టుకుని వుంటాడు. కుళ్ళు, కుట్ర కుతంత్రం అంటే ఆయనకు తెలియదు. తాను గెలవడం తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే ధ్యేయంగా పని చేస్తాడు. ఎప్పుడు పార్టీ పక్షపాతిగానే వుంటాడు తప్ప వ్యక్తిత్వ శత్రుత్వం చూపించడు. తానెక్కడుంటే అక్కడే కమిట్‌మెంట్‌తో పనిచేస్తాడనే పేరుంది. ఇప్పుడు ఆదాల పేరు కూడా వైసిపి శ్రేణుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఏ సీటులో పోటీ చేసినా గెలుపు గ్యారంటీ అనే పేరుంది. ఆనంతో పాటు ఆదాల కూడా వచ్చేస్తే ఇక జిల్లాలో వైసిపికి తిరుగుండదన్నది వారి అభిప్రాయం.

జిల్లాకు చెందిన నాయకులు ఇప్పటికే ఆదాలతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. ఏది ఏమైనా జగన్‌ పాదయాత్ర ముగిసేవరకూ ఈ అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Page 2 of 1029

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter