Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 15

1Ariesమేషం

స్థిరాస్తుల మీద, షేర్ల మీద ఆదాయం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవహారాలలో వ్యతిరేకత పోతుంది. ఉద్యో గులకు కొత్త బాధ్యతలు, పనిభారం ఉంటుంది. పనులు నిదానంగా అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుం టుంది. ఖర్చులు ఎక్కువైనా వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది.

 

2Taurusవృషభం

ప్రతిభా పాటవాలు, గుర్తింపు గౌరవాలు బాగుం టాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పని భారం, అధికారుల సహకారం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపకాలు పెరుగు తాయి. ఆర్ధిక పరిస్థితి బాగుండి, వ్యాపారాలలో వృద్ధి, ఆదాయం బాగుంటుంది. వృత్తిపరంగా పెరుగుదల, తీరిక లేకపోవడం ఉంటుంది.

 

3Geminiమిధునం

ఉద్యోగులకు పనిభారం, స్థాన మార్పులుండ వచ్చును. అనుకోని ఖర్చులు కొన్ని పైనబడగలవు. బంధు వులతో విభేదాలు, చికాకులుంటాయి. బిడ్డల విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకున్న పనులు ధైర్యంగా నిర్వహించుతారు. వృత్తి వ్యాపారాలలో సామాన్యవృద్ధి, రాబడి ఉంటుంది. మీ సలహాలు, సూచనలు ఇతరులు ఆమోదిస్తారు.

 

4Cancerకర్కాటకం

దైవక్షేత్ర సందర్శన, విదేశీ ప్రయాణాలకు అను మతులు దొరుకుతాయి. అనుకున్న పనులు ప్రశాంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెట్ట వచ్చును. పెట్టుబడులకు అవకాశాలుంటాయి. వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం పెరుగు తుంది. వృత్తిపరంగా అవకాశాలు బాగుంటాయి. అయితే కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

 

5Leoసింహం

సన్నిహితుల వల్ల సమస్యలు రావచ్చును. స్థిరాస్తు లపై పెట్టుబడులపై ఆదాయముంటుంది. కొత్త కాంట్రా క్టులు, నిర్మాణాలు లభించి ముందుకు సాగుతారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపా రాలు సామాన్యంగా జరుగుతాయి. స్వల్ప విషయాలపై బంధువర్గంతో విభేదాలు రావచ్చును.

 

6Virgoకన్య

కొత్త విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సౌఖ్యం, మీ ఆరోగ్యం బాగుంటుంది. దూరప్రయాణా లుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూ లత, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగానే ఉంటాయి. పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

7Libraతుల

కొత్త పరిచయాలు, దూర ప్రయాణాలుండవచ్చును. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు. కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. ప్రభుత్వ అనుమ తులు లభించడం, వస్తు వాహన రిపేర్లుండగలవు. ఆర్ధికంగా బలపడే ప్రయత్నాలలో అనుకూలత కలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతుంటాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

అనుకోని ఖర్చులు పైనబడగలవు. బంధుమిత్రుల సహకారంతో ఒక సమస్య నుండి బయటపడతారు. సభలు, సమావేశాలలో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. పను లందు టెన్షన్‌ ఉంటుంది. అనవసర వ్యవహారాలో తల దూర్చవద్దు. ఉద్యోగులు బాధ్యతలందు నిర్లక్ష్యము చూప వద్దు. పనులు నిదానంగా జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. ఉద్యోగ సౌఖ్యం, అధికార వర్గ సహకారం బాగుంటుంది. ఉద్యోగార్ధులకు అవకాశాలు ఉన్నాయి. అనుకోని దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మాటలలోను, చేతులలోను తొందరపాటు ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వనరులు, ఆదాయం బాగుండినా ఖర్చుల భారం పెరుగుతుంది.

 

10Capricornమకరం

అనుకున్న పనులను లౌక్యంగా జరుపుకొనాలి. అధి కారులకు ఉద్యోగులకు పనిభారం, వత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ఉన్నత విద్యావ కాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల లావాదేవీలు, పెట్టుబడుల ప్రయత్నాలు వాయిదా వేసికొనడం మంచిది. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం జరుగుతుంది. వృత్తి వ్యాపా రాలు సామాన్యంగా జరుగుతాయి.

 

11Aquariusకుంభం

ఆర్ధిక వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవ సరం. దూరప్రయాణాలుంటాయి. ఉద్యోగవర్గాలకు పని భారం, శ్రమ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. వివాదాలు పరిష్కారానికి రావచ్చును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. స్థిరాస్తులపై రాబడి, షేర్ల మీద లాభాలుంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరుకు తాయి. ఆదాయ విషయంలో అసంతృప్తి ఉంటుంది.

 

12Piscesమీనం

బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు దొరకడం, శుభ కార్య నిర్ణయాలు జరగడం ఉంటుంది. ఉద్యోగులకు పనులు సాఫీగా జరగడం, మీ సలహాలు ఆమోదం పొం దడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులను కలుసుకొంటారు. కొత్త ఆర్ధిక ప్రయత్నాలందు అనుకూలత, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.

america abbaiమనుక్రాంత్‌రెడ్డి... పుట్టింది పెరిగింది చదివింది అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే. ఆ తరువాత

ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళి అక్కడ తానే స్వంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత కాలంలో హైదరాబాదులోనూ మరో సంస్థను స్థాపించి ఎంతోకొంత మందికి జీవనోపాధి కల్పిస్తూ సంతృప్తి పొందుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

అయితే ఇప్పుడు మనుకి ఓ ఆలోచన పుట్టింది. మనకి జన్మనిచ్చిన భూమికి మనమేం చేస్తున్నామన్న తపన ఆ అబ్బా యిలో మొదలయ్యింది. అంతే అనుకున్న వెంటనే హైదరాబాద్‌లో వున్న తన మాష్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థని నెల్లూరుకు తరలించేశాడు. మొత్తం కంపెనీ చిరునామాని హైదరాబాద్‌ నుండి నెల్లూరుకు బదిలీ చేసేశాడు. అక్కడితో ఆగలేదు, తన ఊరికి తాను ఏదో ఒకటి చేయాలని బలంగా సంకల్పించాడు.

గురువారం మీడియా ముందు కొచ్చాడు. తాను మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి బిడ్డగా, మంచి సోదరుడి గానే కాకుండా మంచి పౌరుడిగా ఎదగా లనుకుంటున్నానని, అనాధగా వున్న నవ్యాంధ్ర ప్రగతికి తానూ భాగస్వామిని కావాలనే ఉద్దేశ్యంతో తన స్వంత గడ్డ నెల్లూరుని వేదికగా ఎంచుకున్నానని ప్రకటించాడు.

తెలంగాణ నుండి తన సంస్థను తర లించడమే కాకుండా, ఇంకా ఇతర సంస్థలకు కూడా ప్రోద్భలాన్ని ఇస్తానని, తన విజయంతో వారికి స్ఫూర్తి కలిగించి వారి సంస్థలను కూడా నెల్లూరుకు తర లింపజేస్తానని ప్రతిజ్ఞపూనాడు. తనకున్న బంధాలు సంబంధాలతో నెల్లూరును కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా చేయడానికి ప్రయత్నిస్తానని వాగ్ధానం చేశాడు. ఇక్కడితో ఆ అబ్బాయి ఆగలేదండోయ్‌... ''మన మను ఆర్గనైజేషన్‌'' అంటూ ఓ సేవాసంస్థని ప్రారంభించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు కూడా తాను శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించాడు.

శుభం... మంచి ఆలోచన.

మనుక్రాంత్‌ నాన్న చెన్నారెడ్డి సుబ్బారెడ్డి, అమ్మ పెనుమల్లి మస్తానమ్మ ఇద్దరూ జిల్లా న్యాయమూర్తులుగా పనిచేసి పదవీ విరమణ పొందినవారే. వీరిద్దరి పెంపకంలో జన్మభూమి పట్ల మమకా రాన్ని, సొంత ఊరి పట్ల అనురాగాన్ని పెంచుకుని జై జన్మభూమి అంటున్న మనుక్రాంత్‌కి ఆల్‌ ది బెస్ట్‌!

vprనార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) ప్రతీ ద్వైవార్షిక వేడుకలలో అందజేసే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు ఈసారి ప్రముఖ దాత, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు, నెల్లూరీయుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అందుకోనున్నారు.

ఈ అవార్డు అందుకుంటున్న నెల్లూరీయు లలో ఈయన 4వ వాడు. 2012లో తొలి సారిగా 'నాటా' ఆవిర్భావ సభలో సుప్ర సిద్ధ శాస్త్రవేత్త ''చీస్‌'' రెడ్డిగా విఖ్యాతి గాంచిన మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ అవార్డు అందుకోగా, 2014లో రెండవ అవార్డు భారతీయ సినిమా గాయకుడు యస్‌.పి.బాలసుబ్ర హ్మణ్యంకు లభించింది. 2016లో మూడవ అవార్డు ''ఖైదీ'' సినిమా ద్వారా చిరంజీవికి సినీ భవిష్యత్తును ప్రసాదిం చిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని వరించింది. ఇప్పటివరకు అవార్డులు అందుకున్న ముగ్గురూ నెల్లూరీయులే కాగా, ఈసారి 2018కి గాను అవార్డు అందుకోబోతున్నది కూడా మన నెల్లూరీ యుడే కావడం గమనార్హం, గర్వకారణం కూడా. 2018 జూలై 6, 7, 8వ తేదీలలో అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రం, ఫిలడల్‌ఫియా నగరంలో జరగనున్న ''నాటా'' 'ద్వైవార్షిక మహాసభ'లలో మూడవరోజు జూలై 8వ తేదీ జరగబోయే ముగింపు సభ వేదికపై నుండి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ అవార్డును అందు కోనున్నారు.

మొదటి నుండి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి అంటే చాలా ఇష్టం. వై.యస్‌. కూడా ప్రభాకర్‌రెడ్డిని అంతే అభిమానించేవాడు. యాదృచ్ఛికమో లేక భగవత్‌ సంకల్పమో తెలియదు కాని వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపిక కావడం, అదే యేడాది ''నాటా జీవిత సాఫల్య పురస్కారానికి'' ఆయన ఎంపిక కావడం ఆ అవార్డుని జూలై 8న డా|| వై.యస్‌. రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున అందుకోబోవడం నిజంగా ప్రభాకర్‌ రెడ్డికి వై.యస్‌.తో వున్న అనుబంధానికి చిహ్నంగా నిలుస్తుంది. అపరిమితమైన సేవా కార్యక్రమాలతో సేవకేదీ కాదు అనర్హం అన్నట్లుగా అన్ని రంగాలలో తన సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పిస్తూ నెల్లూరీయుల మనసుల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నాటా' ''లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు'' అందుకుంటున్న తరుణంలో 'లాయర్‌' అభినందనలు.

Page 1 of 1060

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter