pleanaryఏ పార్టీకైనా జెండాలు మోసే కార్యకర్తలే పునాదులు. కార్యకర్తల బలం వున్నరత కాలమే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలుగుతుంది. అలాంటి కార్యకర్తలను సంపాదించు కోవడానికి, వున్న కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి పార్టీ వేదికలపై జరిగే కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి.

జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన వైసిపి ప్లీనరీ సమావేశాలు పార్టీ కార్యకర్తలలో సమరోత్సాహాన్ని నింపాయి. పది నియోజకవర్గాల ప్లీనరీలతో పాటు జిల్లా స్థాయి ప్లీనరీ కూడా విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. పది నియోజకవర్గాల ప్లీనరీలతో పాటు జిల్లా స్థాయి ప్లీనరీ కూడా విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఇటీవలే జిల్లాలో తెలుగుదేశం పార్టీ మినీమహానాడులు జరిగాయి. ఆ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛంధంగా తరలి వచ్చిన దానికంటే అధికారపార్టీ కాబట్టి బలవంతంగా వచ్చిన బాపతు ఎక్కువ. కాని వైసిపి ప్లీనరీలకు ఎక్కడా జనాన్ని తోలింది లేదు. ప్రలోభాలు పెట్టి పిలిచిందీ లేదు. నెల్లూరు రూరల్‌, నెల్లూరు నగరం, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు ప్లీనరీలన్నీ విజయవంతమయ్యాయి. జిల్లాలో పార్టీ కేడర్‌ చెక్కు చెదరలేదు. గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో పార్టీ బలం ఇంకా పెరిగేవుంది. ఈ ఎన్నికల యుద్ధంలో కార్యకర్తలే సైనికులు, సైన్యాధ్యక్షులు. కాబట్టి నియోజకవర్గాల వారీగా బూత్‌ కమిటీలు, మండల కమిటీ లతో కార్యకర్తలకు ఇప్పటి నుండే బాధ్యతలు అప్పగించి ఎన్నికల నాటికి వారిని సర్వసన్నద్ధం చేయాల్సి వుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter