ycpజిల్లాలో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయ వంతమైంది. 20రోజుల పాదయాత్రలో ఆయన జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌చేశాడు. జగన్‌ తన పాద యాత్రలో కర్నూలు జిల్లాలో ఇద్దరికే సీట్లు కన్‌ఫర్మ్‌ చేసాడు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఏ సీటు ఎవరికీ కన్‌ఫర్మ్‌ చేయలేదు. ఇప్పుడు నెల్లూరుజిల్లాలోనూ అదే జరిగింది. ఫలానా సీటు ఫలానా నాయకుడికే అని ఆయన చెప్పలేదు.

సూళ్లూరుపేట సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజీవయ్యకు చెప్పాడని, నెల్లూరు నగరం సీటు అనిల్‌కే అని చెప్పాడని, దీంతో మిగిలిన నాయకులు అసంతృప్తితో వున్నారనే దుష్ప్రచారం జరుగుతోంది. నెల్లూరురూరల్‌లో నిర్వహించిన ఆర్యవైశ్యుల సమావేశంలో కొందరు ముక్కాల ద్వారకానాథ్‌కు సీటివ్వాలని కోరినప్పుడు అక్కడ ఆల్‌రెడీ అనిల్‌ వున్నాడని, అతను కూడా మీవాడేనని, ద్వారకాకు ఏం చేయాలో తాను చూసుకుంటానని చెప్పాడు. అలాగే నాయుడుపేట సభలో సంజీవయ్య గురించి పాజిటివ్‌గా చెప్పాడు. నెల్లూరురూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గట్టి నాయకుడే! అంతకుమించిన అభ్యర్థి లేడు. అయినా కూడా శ్రీధర్‌రెడ్డే ఇక్కడ అభ్యర్థి అని జగన్‌ చెప్పలేదు. కావలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డినే అభ్యర్థి అని జగన్‌ చేత చెప్పించాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎక్కడా జగన్‌ నోరు జారలేదు. ఆఖరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా తిరిగి సర్వేపల్లి నుండి ఆయనే పోటీ చేస్తాడని చెప్పలేదు.

ఈసారి టిక్కెట్లన్నీ కూడా ప్రశాంత్‌కిషోర్‌ సర్వే ప్రకారమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పి.కె. టీమ్‌ ఇప్పటికే రంగంలోకి దిగింది. నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గానికి ఎవరైతే కరెక్ట్‌ అని సర్వే చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో వున్న నాయకు లనే కాకుండా పార్టీలో చేరే సూచనలున్న నాయకులను కూడా పరిగణనలోకి తీసుకుని పి.కె టీమ్‌ సర్వే చేస్తున్నట్లు వినికిడి. జగన్‌ కూడా ఈ సర్వే నివేదికల ఆధారంగానే సీట్లు కేటాయిం చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇలా చేయకుండా ఎవరికంటే వాళ్ళకు సీట్లు ఇచ్చేసి చాలా చోట్ల ఓడిపోయారు. పార్టీ ప్రభావం ఎంతున్నా అభ్యర్థుల ప్రభావం కూడా కొంతుంటేనే గెలుపుకు దగ్గరవుతారు. సర్వే ద్వారా అలాంటి అభ్యర్థులనే రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది.

inlu gadapaరాష్ట్రంలో దాదాపు ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైందనే చెప్పొచ్చు. గట్టిగా పోరాడితేగాని వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే పరిస్థితి అటు తెలుగుదేశం నాయకులకు, ఇటు వైకాపా నాయకులకు అర్ధమైపోయింది. నంద్యాలలో ఓటమితో ప్రభంజనం, ప్రభుత్వ వ్యతిరేకత భ్రమల నుండి వైకాపా నాయకులు బయటకొచ్చారు. ఈ రెండింటిని మాత్రమే నమ్ముకుంటే అధికారం దక్కదనే విషయాన్ని గ్రహించారు. అదే సమయంలో నంద్యాలలో 27 వేలఓట్ల తేడాతో గెలిచామనే ఆనందం కన్నా ఇంతగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇన్ని వందలకోట్లు ఖర్చు చేసినా వైకాపాకు 70వేల ఓట్లు రావడం కూడా తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే ఉపఎన్నికల్లో పని చేసినట్లుగా సాధారణ ఎన్నికల్లో ప్రలోభాలు పనిచేయవనే విషయం వారికి తెలుసు.

అందుకే ఇరు పార్టీల వాళ్ళు కూడా అప్రమత్తమై నాయకులను కార్యకర్తలను జనం మీదకు, ఇళ్ల మీదకు తరిమే కార్యక్రమాలు పెట్టుకున్నారు. అధికార తెలుగుదేశం ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ప్రతిపక్ష వైకాపా ఇంతకుముందు నుండే గడపగడపకు వైసిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నెల్లూరుజిల్లాలో ఈ రెండు కార్యక్రమాలను తెలుగుదేశం, వైయస్సార్సీపీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఇరుపార్టీల కార్యక్ర మాలలో నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల రేసులో నిలవాలంటే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మార్కులు తెచ్చుకోవాల్సి వుంది. కాబట్టే నాయకులు ఈ కార్యక్రమాలలో లీనమైపోయి పని చేస్తున్నారు.

ysr leadersరాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ రోజు నాయకుల మధ్య సమన్వయం లేక మూడు అసెంబ్లీ సీట్లలో ఓడిపోవాల్సి వచ్చింది.

జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు జాస్తిగా వున్నాయి. అధికారపార్టీ కాబట్టి ఆ మాత్రం విభేదాలు సహజమే! జిల్లాలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఆ స్థాయిలో వర్గపోరు లేకున్నా కొద్దిమంది నాయకుల మధ్య వున్న మనస్పర్ధలు పార్టీకే చేటుగా మారే అవకాశాలున్నాయి.

కావలి నియోజకవర్గంలో పార్టీలో మూడు గ్రూపులయ్యాయి. 2014 ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం గట్టిగా పనిచేసిన మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి రేపు కావలి సీటు కోసం పోటీలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి కూడా కావలి సీటును ఆశిస్తున్నాడు. ఎవరి ప్రమేయం లేకుండానే ఇటీవల ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వచ్చే ఎన్నిక ల్లోనూ కావలి సీటు ప్రతాప్‌కే అని ప్రకటించడం ఇక్కడ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. 2014 ఎన్నికలప్పుడు కూడా నెల్లూరు నగరం, రూరల్‌, గూడూరు సీట్లకు తన అనుచరులను అభ్యర్థులుగా చేసుకోవాలని చెప్పి మేకపాటి ఇలాంటి తలనొప్పినే తెచ్చిపెట్టాడు. అభ్యర్థుల విషయంలో అధిష్టానం ముందుగా మేకపాటి నోటికి తాళం వేయాలి. గత ఎన్నికల్లో వెంకటగిరిలోనూ పార్టీ నాయకుల మధ్య సమన్వయం కుదరకపోవడం వల్లే అక్కడ అభ్యర్థిగా వున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఓడిపోయాడు. ఉదయగిరిలోనూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోకడలు నచ్చక మండల స్థాయి నాయకులు చాలామంది దూరమయ్యారు. ఈసారన్నా వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిలతోనూ పార్టీలో కొందరు నాయకులకు పడడం లేదు. వచ్చే ఎన్నికల లోపు నేతల మధ్య కలతలను రూపు మాపి, కేడర్‌ను ఒకేతాటిపై నడిచే విధంగా అధిష్టానం దృష్టి పెట్టాల్సి వుంది.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter