police stationనెల్లూరు నగరంలో మొత్తం ఏడు పోలీస్‌స్టేషన్‌లున్నాయి. 1, 2, 3, 4, 5 నగర పోలీస్‌స్టేషన్‌లతో పాటు బాలాజీ నగర్‌, నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌లు ప్రత్యేకంగా వున్నాయి. కొన్ని పోలీసుస్టేషన్‌లు వున్న ప్రాంతానికి, వాటికి కేటాయించిన

పరిధి ప్రాంతానికి సంబంధం వుండేది కాదు. ఉదాహరణకు నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌నే తీసుకుందాం. స్టేషన్‌ వుండేది రైల్వేస్టేషన్‌ రోడ్డులో, నగరం చుట్టుపక్కల గ్రామాలు ఈ స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. స్టేషన్‌ నుండి ఒక్కో ఊరికి పది నుండి పాతిక కిలోమీటర్ల దాకా దూరం ఉంటుంది. అది కూడా ఒక దిక్కయితే ఫరవాలేదు. నాలుగు దిక్కులా వుంటాయి. రాఘవ సినీ కాం ప్లెక్స్‌ ఏరియా నాలుగో నగరస్టేషన్‌కు దగ్గర. ఇది వన్‌టౌన్‌ పరిధిలో వుంటుంది. ఏదన్నా సంఘటన జరిగితే పోలీసులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకునేలా ఆయా పోలీస్‌స్టేషన్‌లు పరిధిలోని ప్రాంతాలుండాలి.

ఈ దిశగానే కొంత కసరత్తు జరిపి నగరంలోని పోలీసు స్టేషన్లను పునర్విభజన చేసాడు జిల్లా ఎస్పీ రామకృష్ణ. ముందు పోలీసుస్టేషన్‌లకు నెంబర్లు తీసేసాడు. వన్‌టౌన్‌ను చిన్నబజారు పోలీసుస్టేషన్‌గా, టూటౌన్‌ను నవాబుపేట పోలీసుస్టేషన్‌గా, త్రీ టౌన్‌ను సంతపేట పోలీసుస్టేషన్‌గా, ఫోర్త్‌టౌన్‌ను దర్గామిట్ట పోలీసు స్టేషన్‌గా, ఐదోటౌన్‌ను వేదాయపాలెం పోలీసుస్టేషన్‌గా, ఆరో నగర పిఎస్‌ను బాలాజీ నగర్‌ పోలీసుస్టేషన్‌గా మార్చారు. ఆయా ప్రాంతాల పరిధిలలో కూడా మార్పులు చేసి ఈ స్టేషన్‌లకు కలిపారు.

swamijiఒక నాగార్జున ఫైనాన్స్‌... ఒక సిటీ ఫైనాన్స్‌... ఒక అగ్రిగోల్డ్‌... ఒక ఆర్‌బిఎఫ్‌... ఒక సీప్‌ఫార్మ్‌... ఒక చైన్‌ లింక్‌ స్కీం... ఇప్పుడు మంత్ర పీఠికల మాయా జాలం... కంపెనీలు వేరైనా కాన్సెప్ట్‌ ఒక్కటే... అమాయకుల నుండి దండుకోవడం, టోపీ పెట్టి పరారవ్వడం.

రాష్ట్రంలోనే నెల్లూరుజిల్లాకు ఒక ప్రత్యేకతవుంది. ఈ జిల్లాలో ఫ్యాక్షన్‌ లేదు, రౌడీయిజం లేదు, రాజకీయ నాయకుల దందాలు లేవు. పద్ధతిగా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుని పోయే వాళ్ళకు ఎంతో అనువైన జిల్లా.

ఇలాంటి జిల్లాలో అంతుబట్టని నేరాలేంటంటే వైట్‌కాలర్‌ నేరాలే. ఫైనాన్స్‌ మోసాలు ఎక్కువుగా ఈ జిల్లాలో జరుగు తున్నాయి. ఒక చైన్‌ స్నాచింగ్‌ జరిగితే ఒక మహిళ నష్టపోతుంది. ఓ ఇంట్లో దోపిడీ జరిగితే ఆ కుటుంబంలో సభ్యులు నష్టపోతారు. కాని ఫైనాన్స్‌ నేరాలలో ఒక వ్యక్తి మోసం చేస్తే బాధితులు వందలు, వేల సంఖ్యలో వుంటారు. నష్టం కోట్లలో వుంటుంది. ఇది సున్నితంగా కనిపించే తీవ్ర నేరం.

గత పాతికేళ్లలో నెల్లూరు కేంద్రంగా జరిగిన ఫైనాన్స్‌ నేరా లన్నింటిని లెక్కకడితే బాధితులు పోగొట్టుకున్న సొమ్ము వందల కోట్లలో కాదు వేల కోట్లకు చేరుతుంది.

పాతికేళ్ల క్రితం నెల్లూరు నగరంలో ఫైనాన్స్‌ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. 10I10 అడుగుల గదిలో కూడా ఒక ఫైనాన్స్‌ ఆఫీసు ఉండేది. ఇలా దాదాపు 600 ఫైనాన్స్‌ కంపెనీలు వెలసి స్కీంల పేరుతో, ఐదేళ్లకు కట్టిన మొత్తానికి రెట్టింపు ఇస్తామనే ఎరతో అమాయకుల నుండి కోట్లు దండు కున్నాయి. ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఐదేళ్ళ పాటూ ఉం డింది లేదు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చింది లేదు. ఆ తర్వాత నెల్లూరు కేంద్రంగా ఎన్నో ఫైనాన్స్‌ కంపెనీలు వెలిసాయి. ప్రజల నుండి ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు కట్టించుకున్నాయి. ముఖ్యంగా ఏజంట్లు ఈ మోసాలకు వారధులుగా వుంటూవచ్చారు. కమిషన్లకు ఆశపడి వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళ చేత, మిత్రుల చేత మొహమాటపెట్టి డిపాజిట్లు కట్టించేవాళ్ళు. కొద్దికాలంలోనే ఈ కంపెనీలు బోర్డులు తిప్పేసేవి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లకు పరుగులు తీసేవాళ్ళు. ఈ ఫైనాన్స్‌ కంపెనీలను జనం ఎంత అమాయకంగా నమ్మారంటే... ఒకడు రామ్మూర్తినగర్‌లో ఆఫీసు పెట్టి మీరు కట్టిన డబ్బుకు 28రోజుల్లో రెట్టింపు ఇస్తామంటే వాళ్ళకు కోట్లు కోట్లు కట్టారు. 28 రోజుల్లో డబ్బు రెట్టింపు కావాలంటే వాళ్ళు కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏదన్నా పెట్టుకుని వుండాలి. కనీసం జనం 28రోజుల్లో డబ్బులు ఎలా డబుల్‌ అవుతాయనే ఆలోచన కూడా చేయలేదు. మూడేళ్ల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించిన మనీ సర్క్యులేషన్‌ స్కీం ద్వారా ప్రజలు వందల కోట్లలో నష్టపోవడం చూసాం. తాజాగా నెల్లూరు కిసాన్‌ నగర్‌లో సుధాకర్‌ మహరాజ్‌ బురిడీబాబా ఉదంతం... భక్తి ముసుగులో ఫైనాన్స్‌ చీటింగ్‌. మంత్రపీఠికలు వ్రాస్తే నెలలో డబ్బులు రెట్టింపు ఎలా అవుతాయనే ఆలోచన కూడా లేకుండా పోయింది.

ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకే ఈ రోజుల్లో దిక్కు లేకుండా పోతోంది. అలాంటిది ప్రైవేట్‌ కంపెనీలను, ప్రైవేట్‌ వ్యక్తులను నమ్మి ఎలా డిపాజిట్లు కడతారు. ఈ ఫైనాన్స్‌ మోసా లలో బాధితులుగా మిగులుతున్నది మధ్యతరగతి ప్రజలే! వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టి ఒక పూట తిని ఒక పూట తినక కష్టంతో వచ్చిన డబ్బును ఇలాంటి పాపాత్ముల పరం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. ప్రభుత్వాలు, పోలీసులను అనుకుని లాభం లేదు. ఒకడు ఇలా వ్యాపారం మొదలుపెడితే... ప్రజలు వచ్చి వారి వద్ద డబ్బులు డిపాజిట్‌ చేస్తుంటే ప్రభుత్వమేమీ ఆపలేదు. కాని అలా ఎవరినంటే వారిని నమ్మి డబ్బులు కట్టేటప్పుడు ప్రజలే ఆలోచించాలి... వారి గురించి తెలుసుకుని వుండాలి. ప్రజలు చైతన్యవంతులైతే తప్ప ఇలాంటి ఫైనాన్స్‌ మోసాలకు కళ్ళెం వేయలేము.

hordingsనెల్లూరు నగరంలో కుప్పలు తెప్పలుగా హోర్డింగ్‌లు వున్నాయి. గతంలో రోడ్ల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను కార్పొరేషన్‌ అధికారులు తొలగించారు. నగరంలో చాలా భవనాల మీద భారీ హోర్డింగ్‌లు పెట్టివున్నారు. మామూలు రోజులలో అయితే పెద్ద ఇబ్బంది వుండదు. ఇప్పుడు వర్షాలు, గాలుల సీజన్‌. ఈదురుగాలులు వీచినప్పుడు ఇవి కూలి రోడ్డునపోయే వారిమీద పడే అవకాశముంది. మొన్న రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఇలాగే ఒక హోర్డింగ్‌ కూలి నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హోర్డింగ్‌లను పటిష్టంగా, ఈదురుగాలులకు తట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలి. కాని, అన్ని హోర్డింగ్‌లను అలా ఏర్పాటు చేసి వుండరు. ప్రమాద కరంగా వున్న హోర్డింగ్‌లను తొలగించడానికి కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter