vidya vydyamజూన్‌ 10వ తేదీ నెల్లూరుజిల్లాలో ఓ అరుదైన రోజుగా నిలిచిపోతుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కాళయకాగొల్లు గ్రామంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్క రించబడి జిల్లా చరిత్రలో ఇది ఓ చిరస్మరణీయ సంఘటనగా మిగిలి పోయింది.

ప్రియా సిమెంట్‌ రాధయ్యగా అందరూ పిలుచుకునే నెల్లూరు రాధాకృష్ణారెడ్డి తనకు జన్మనిచ్చిన ఊరిని ఊపిరి పోసిన అమ్మా నాన్నలను స్మరించుకుంటూ అత్యాధునిక విద్యా వైద్యాలయాలను ఈ మారుమూల గ్రామంలో నిర్మించి ప్రారంభించాడు.

జూన్‌ 10వ తేదీ సాయంత్రం కాళయకాగొల్లు గ్రామ ప్రజలంతా ముస్తా బయ్యారు. తమ ఊర్లో ''ప్రజ్ఞ్యప్రియ ఫౌండేషన్‌'' ఆధ్వర్యంలో నెల్లూరు రాధా కృష్ణారెడ్డి, ఆయన శ్రీమతి ఇందిరమ్మ, కుమారులు జగన్‌మోహన్‌రెడ్డి, సుజిత్‌రెడ్డి చేపట్టిన మహత్కార్యం ప్రారంభోత్సవానికి హాజరుకావడానికి, ఆ ఆనందక్షణాలను వీక్షించడానికి గ్రామం మొత్తం తరలి వచ్చింది.

తాను పుట్టిన ఊరికి ఊరి జనానికి తన వంతు సేవ చేయాలనే తపనతో 5 యకరాల విస్తీర్ణంలో నెల్లూరు లక్ష్మీ దేవమ్మ ఉచిత ఆసుపత్రిని, నెల్లూరు చంద్రారెడ్డి హైస్కూల్‌, ఇంగ్లీషు మీడియం & డిజిటల్‌ క్లాసెస్‌ ప్రాంగణాలను అత్యంత ఆధు నికంగా అందంగా తీర్చిదిద్ది రెండింటినీ ఒకేసారి ప్రారంభించారు.

రాధాకృష్ణారెడ్డి ఏ పని చేసినా ప్రత్యేకతను చాటుకుంటాడు. మనం చేసే పనిలో అంకితభావం, చిత్తశుద్ధి, నాణ్యత వుంటే విజయం తప్పక లభిస్తుందని భావించే తత్వం ఆయనది. తన స్వగ్రా మంలో చేపట్టిన సేవా కార్యక్రమాలలో సైతం ఆయన ఎక్కడా రాజీపడలేదు. ప్రతి అంగుళంలోనూ కొత్తదనాన్ని ఆధునీకతని కనపరచాడు. రెండు ప్రాంగణాలనూ కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాడు.

10వ తేదీ సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో సైతం వైవిద్యాన్ని చూపించాడు. సరిగ్గా 6 గంటల 5 నిము షాలకు వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేసి భవనాల ప్రారంభోత్సవం జరిపించాడు. ఎలాంటి అతిథుల ప్రసంగాలు లేకుండా తన చిన్న కుమారుడు సుజిత్‌రెడ్డి ప్రారంభోపన్యా సంతో చెప్పాల్సిందంతా చెప్పించేసి ''ఆరభి'' సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు అశోక్‌గురజాలి ఆధ్వర్యంలో సుమారు 100మందికి పైగా కళాకారులను రప్పించి వీనులవిందైన సుమధుర సంగీతాన్ని వినిపింపజేశారు.

తన గ్రామ ప్రజలే అతిథులుగా తమ ఊరి పిల్లలే అతిరథులుగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించి అందరి ప్రశంసలూ అందుకున్న రాధాకృష్ణారెడ్డికి వారి కుటుంబసభ్యులకు 'లాయర్‌' అభి నందనలు.

anam ramఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మంత్రి నారాయణ స్వయంగా ఫోన్‌ చేసి ఆత్మకూరులో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని కోరినా రామనారాయణ రెడ్డి వినలేదు. నేనుండడం లేదు, మీ పాటికి మీరు చేసుకోండని చెప్పినట్లు తెలుస్తోంది. 8వ తేదీ చంద్రబాబు పర్యటనకు హాజరు కావాలని కోరినా తాను ఆరోజు నెల్లూరులో ఉండడం లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీని వీడనున్నాడనే విషయం అర్ధమైపోయింది. ఆయనను పార్టీలో నిలబెట్టాలని నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫల మయ్యాయి. అయితే ఆత్మకూరులో జరిగిన రాజకీయ పరిణామాలను చూసి స్థానికంగా వున్న ఓ వర్గం వాళ్ళు మాత్రం తెలుగు దేశం పార్టీ వాళ్ళకు ఇలా జరగాల్సిందేలే అని చంకలు గుద్దుకుంటున్నారు.

ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత అప్పటి వరకు ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రించిన గూటూరు కన్నబాబును పక్కనపెట్టారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నబాబు అప్పుడప్పుడే ఆత్మకూరులో వర్గాన్ని పెంచుకుంటున్నాడు. 2014 ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇన్‌ఛార్జ్‌గా వుంటూనే పార్టీ అధికారంలో వుంది కాబట్టి అన్ని శాఖలపై అజమాయిషీ చేసాడు. అనుచరులకు పనులు చేసిపెట్టాడు. కొంతవరకు వర్గాన్ని కూడగట్టాడు. సడెన్‌గా ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించడంతో కన్నబాబు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

ఇప్పుడు ఆత్మకూరులో తెలుగుదేశం బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే ప్రశ్న వస్తోంది. కన్నబాబుకు బాధ్యతలు ఇచ్చినా మళ్ళీ మొదటి నుండి పరుగు మొదలుపెట్టాలి. మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును రంగంలోకి దించినా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. ఆయన ఆత్మకూరుకు దూరమై పదేళ్ళు కావస్తోంది. ఇక్కడ మునుపటి హవా వుండకపోవచ్చు. మొత్తానికి ఆనం వెళితే ఆత్మకూరు టీడీపీలో రాజకీయ శూన్యత ఖాయం.

3ఆనం రామనారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశలు వదులుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనను ఇక పార్టీలో నిలబెట్టలేమని వారికి అర్ధమై పోయింది. ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్న నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి! అది కూడా ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే! ఆయనే లేకుంటే గట్టిపోటీ ఇవ్వడం కష్టం. ఆయనే అవతల వైసిపి అభ్యర్థి అయితే పోటీ ఇంకా కష్టం.

ఏ నియోజకవర్గంలో ఎవరు మేటి అభ్యర్థి కాగలరు? అని నియోజకవర్గాల వారీగా తెలుగుదేశంపార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను ముగ్గురు నాయకుల మీదే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కాగా, ఇంకొకరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మూడో నాయకుడు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గూటూరు కన్నబాబు! ఆనం రామనారాయణరెడ్డి నూటికి నూరు శాతం తెలుగుదేశంలోనే ఉంటా డనుకుంటే అసలు ఇక్కడ సర్వేనే అవసరం లేదు. ఆనం రామనారాయణరెడ్డి పేరు తప్ప ఇంకో పేరుతో పనేలేదు. ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతాడనే నమ్మకంతోనే ఆత్మకూరుకు ప్రత్యామ్నాయ అభ్యర్థి అన్వేషణ మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ కోణంలోనే నాలుగేళ్ళ నుండి రాజకీయాలకు దూరంగా వుంటున్న కొమ్మి లక్ష్మయ్యను మళ్ళీ తెరమీదకు తెచ్చారు. ఈయన ఆత్మకూరులో ఒకప్పుడు గట్టి నాయకుడే! పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచి సత్తా చాటుకున్న నాయకుడు. కాకపోతే నియోజకవర్గంలో అప్పుడున్నంత క్రేజ్‌ ఇప్పుడు లేదు. గతంలో సహకరించిన 'రెడ్డి' వర్గం ఇప్పుడు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. గూటూరు కన్నబాబు కూడా సరిపోడని 2014 ఎన్నికల్లోనే తేలింది. ఎన్నికల తర్వాత ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వుంటూ కొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుండగానే కన్నబాబును చంద్రబాబే పక్కన పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా పెట్టినా పుంజుకోవడం కష్టం. వీళ్ళిద్దరిదీ ఒకే సామాజికవర్గం. అభ్యర్థి ఏ వర్గం వాళ్ళయినా కమ్మ సామాజిక వర్గీయుల ఓట్లు 90శాతం తెలుగుదేశంకే పడతాయి. ఇక్కడ 'రెడ్ల'లో చీలిక ముఖ్యం. ఈ కోణంలోనే ఆ సామాజికవర్గానికి చెందిన మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరుకు ఫ్రెష్‌ క్యాండేట్‌, ఆర్ధికంగా నిలబడగలడు, స్థానికుడు, వివాద రహితుడు. ఇరు పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి. కొంతవరకైనా 'రెడ్ల' ఓట్లను తెచ్చుకోగలడు. కాబట్టి ఈ ముగ్గురిలో మెట్టుకూరువైపే మొగ్గు కనపడవచ్చు. అయితే వైసిపి అభ్యర్థి ఎవరనేదానిని బట్టే ఈ ముగ్గురిలో ఎవరు బెటర్‌ అనేది ఫైనల్‌గా తేలుతుంది.

Page 1 of 53

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter