గ్రామసమాచారం


మద్యం ధరలకు రెక్కలొచ్చాయ్‌... ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం విక్రయాలు సాగించాలన్న నిబంధనకు సిండికేట్లు మంగళం పాడారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.5 నుంచి రూ.10వరకు పెంచి మందుబాబులకు ఇంకాస్త నిషా ఎక్కించారు. ఎక్సైజ్‌ అధికారులతో సిండికేట్లు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఎంఆర్‌పికి తిలోదకాలు ఇచ్చారు. ఇందుకు ఎక్సైజ్‌ అధికారులకు భారీమొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్‌ పరిధిలో 313 ప్రైవేటు, 35 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. 2015-17 సంవత్సరానికి…

Read more...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌, 'నీరు చెట్టు' వంటి పథకాలను ప్రవేశపెట్టి, ఆ పథకాలు సక్రమంగా అమలు చేయా లని, ఎక్కడా దుర్గంధపూరిత వాతావరణం లేకుండా పరిశుభ్రతతో వుండాలని నిత్యం మొత్తుకుంటూనే వున్నా, జిల్లా అధికారుల్లో కానీ, నగరంలోని అధికారుల్లో కానీ ఏమాత్రం చలనం వుండడం లేదు. నెల్లూరు నగరం మురుగుగబ్బుతో నిండిపోతున్నా, వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, దోమలు ప్రబలుతున్నా అటు జిల్లా ఉన్నతాధికారులు కానీ, ఇటు నగరపాలక సంస్థ…

Read more...

జిల్లాలో ఒకవైపు ఎండలు మిడిమేలంగా కాస్తూనే వున్నా, మరోవైపు నేనున్నానంటూ చిరుజల్లుల వాన కూడా వచ్చి ప్రజలకు ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా అప్పుడప్పుడూ కురుస్తున్న వానజల్లులు రైతాంగానికి సంతోషం కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వాన చుక్క లేకపోవడంతో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఎంతో విలపిస్తున్నారు. పచ్చిమేత కూడా దొరక్క, పశుగ్రాసం లేక పశువులు, మూగజీవాలు అవస్తలు పడుతుంటే చూసి బాధపడుతున్న రైతుల…

Read more...

జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి(విజయ డెయిరీ) ఛైర్మెన్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు కొండ్రెడ్డి రంగారెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ నెలా ఖరుతో ఆయన తొలివిడత ఛైర్మెన్‌ పదవీకాలం ముగి యడంతో డైరెక్టర్‌గా తిరిగి ఎన్నిక కావాల్సి వచ్చింది. సెప్టెంబర్‌ 26వ తేదీన ఒక డైరక్టర్‌ పదవికి ఎన్నిక నిర్వహించగా అల్లూరు మండలం నార్త్‌మోపూరు సొసైటీ నుండి కొండ్రెడ్డి రంగారెడ్డి, టిపి గూడూరు మండలం పోట్లపూడి…

Read more...

జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార లిమి టెడ్‌(విజయ డెయిరీ)లో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు ప్రకటించారు. వీటిలో రేగడిచెలిక సొసైటీ నుండి నామినేషన్‌ వేసిన గుర్రం నాగేశ్వరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాంబపురం నుండి నామినేషన్‌ వేసిన దామా శ్యామలమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి పోటీగా ఎవరూ నామినేషన్లు వేయలేదు. మరో డైరెక్టర్‌ పదవి కోసం అల్లూరు మండలం నార్త్‌మోపూరు నుండి నామినేషన్‌ వేసిన ప్రస్తుత…

Read more...

వర్షం లేకపోతే, ఏరు పారకపోతే, చెరువు నిండక పోతే, బావి ఎండిపోతే బ్రతు ంతా కరువే. కరువు రాకాసి జడలు విప్పి వికటాట్టహాసం చేస్తే మొదట నష్టపోయేది రైతే. కాని అదే కరువు కరాళనృత్యం కొనసాగితే రైతే కాదు, చివరకు రాజు కూడా నష్టపోవాల్సిందే! కష్టాల పాలుకావాల్సిందే. అం దుకే అంటారు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని. నెల్లూరుజిల్లాను కరువు కమ్మేసింది. గత కొన్నేళ్ల కాలాన్ని తీసుకుంటే ఎప్పుడూ లేనంత…

Read more...

కృష్ణపట్నంపోర్టు పుణ్యమా అని నెల్లూరు, ముత్తుకూరురోడ్డు అత్యంత ట్రాఫిక్‌ రద్దీతో ఉంటుంది. జిల్లాలో జాతీయ రహదారి తర్వాత ఎక్కువ ట్రాఫిక్‌ ఉంటున్న రోడ్డు ఇదే! ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటాయి. దీనికి కారణం పోర్టుతో పాటు, విద్యుత్‌ కేంద్రాలు, పరి శ్రమలు, పేరొందిన విద్య, వైద్య సంస్థలు ఈ రోడ్డు పక్కనే ఉండడం. కాబట్టి ట్రాఫిక్‌ బాగా పెరిగింది. అయితే ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్డు…

Read more...


కావలి మార్కెటింగ్‌ యార్డ్‌లో అధికా రులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తున్నారని నూతనంగా ఏర్పడిన మార్కెటింగ్‌ కమిటి డైరెక్టర్లు కొందరు ఛైర్మెన్‌ దేవరాల సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. గడచిన 4సంవత్సరాల కాలంలో పాలకవర్గం లేక పోవడంతో అధికారులకు అడ్డు లేకుండా పోయిందని, ప్రస్తుతం పాలకవర్గం ఏర్ప డినా గతంలో మాదిరిగా వ్యవహరిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనం మొదట…

Read more...

కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్సకారుల జీవితాలు చిందరవందరగా మారాయి. సముద్రంలోకి వేటకు వెళ్తున్న కడలిపుత్రుల జీవితం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది. నాటు పడవలలో వేకువజామున మూడుగంటలకే వేటకు వెళ్లే మత్స్యకారులు వలలోకి చేపలు పడక నిరాశగా ఒడ్డుకు చేరుతున్నారు. తమ భార్యాపిల్లలను పోషించేందుకు గంపెడు ఆశలతో సముద్రంలోకి చేపలు వేటకు వెళ్ళి ప్రమాదాలలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న జాలర్లు వున్నారు. వీరిని ఆదుకున్న నాధుడే కరువయ్యాడు. వీరు…

Read more...


Page 10 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter