నెల్లూరులో నేడు (135)

govt hospసర్కార్‌ దవాఖానా అంటే నరకానికి నమూనా అన్న ఒక పేరుంది. నిజమే... ఇంతకాలం మనం చూసిన పెద్దాసుపత్రిలో పరిస్థితి అదే! ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే బోనస్‌గా ఇంకొన్ని రోగాలు తగులుకునేంత దుస్థితి వాతావరణం అక్కడ ఉండేది. అయితే కాలం మారింది. ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చాక పెద్దాసుపత్రి ప్రాంగణం రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాంగణంలో ఎటుచూసినా కార్పొరేట్‌ కంపెనీలులాగా వున్న భవనాలు, విశాలమైన రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పచ్చదనం... కనువిందు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరులో వున్న కార్పొరేట్‌ ఆసుపత్రులకంటే కూడా ఇప్పుడు పెద్దాసుపత్రి ప్రాంగణంలో వాతావరణమే బాగుంది. ఒకప్పుడు మనకు నరకంలా అనిపించిన పెద్దాసుపత్రిని పాత భవనాల నుండి కొత్తగా కట్టిన భవనాలలోకి త్వరలోనే ప్రభుత్వ సర్వజన వైద్యశాలగా తరలించనున్నారు. వందకోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి భవనాలు పూర్తి కావచ్చాయి. మొత్తం 750 పడకలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కంటి, ఆర్థోపెడిక్‌ విభాగాలను అనధికారికంగా ప్రారంభించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే ఈ ఆసుపత్రి ఎంతో బాగుందని ఆనందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అన్ని వైద్య విభాగాలను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిని అందంగా కట్టారు. వైద్యులు కూడా అంతే అందమైన మనస్సుతో వైద్యసేవలందిస్తే చాలామంది పేదరోగులకు జబ్బుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తప్పించిన వాళ్లవుతారు.

co opనెల్లూరుజిల్లాలో లక్షలాదిమంది రైతులున్నారు. తడ నుండి సీతారాంపురం దాకా అన్ని గ్రామాలు, పల్లెటూర్లలో సేద్యంతో స్వేదం చిందిస్తూ పంటలు పండించే అన్నదాతలకు పొలం, హలం, నీళ్ళు, బీళ్ళు, చెరువు, ఎరువుతో తప్ప జిల్లా కేంద్రమైన నెల్లూరుతో పెద్దగా సం బంధాలుండవు. అయినా జిల్లాలో వున్న రైతులందరికీ నెల్లూరు నగరంతో వున్న అనుబంధానికి ఒకే ఒక వేదిక నెల్లూరు నడిబొడ్డున వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. అవును, రైతుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం నెలకొల్పిన బ్యాంకు ఇది. రైతులే ఖాతాదారులు, రైతులే సభ్యులు, రైతులే డిపాజిటర్లు, రైతులే ఋణగ్రహీ తలు, ఈ బ్యాంకుకు రైతులే వెన్నెముక.

మన కుటుంబంలో ఎవరికైనా 60 ఏళ్లు నిండితే షష్టిపూర్తి చేస్తాం. 50ఏళ్ళు వస్తే అర్థశత జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం. అలాంటిది లక్షలాది మంది రైతులతో బంధం, అనుబంధం వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వందేళ్ళు వస్తే... ఆ వేడుకను ఇంకెంత ఘనంగా జరపాలి. అలాంటి వేడుకకే నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వతేదీ మధ్యాహ్నం 3గంటలకు బ్యాంకు ప్రాంగణంలోనే నిర్వహించన్ను శత వసంతాల వేడుకలను రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టు కూరు ధనుంజయరెడ్డి నేతృత్వంలో బ్యాంకు పాలక మండలి కమిటి సభ్యులు ఆహ్వాన కమిటీగా ఏర్పడి శత వసంతోత్సవ సంబ రాలను చరిత్రలో చిరస్మరణీయంగా నిలి చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర సహకార శాఖ మంత్రి సి.ఆదినారా యణరెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ముఖ్యఅతిథులుగా, ఏపి రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ పిన్నమ నేని కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ కె.రవీందర్‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. అలాగే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా సంస్థల ఛైర్మెన్‌లు, మాజీమంత్రులు, మాజీశాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌లు, సహ కార శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరవు తున్నారు. వందేళ్లకాలంలో ఈ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసిన బ్యాంకు మాజీ ఛైర్మెన్‌లను, మాజీ జనరల్‌ మేనేజర్‌లను ఈ వేదికపై సన్మానించాలని పాలకవర్గం నిర్ణయించింది.

నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల ప్రయాణంలో ఎన్నో మలు పులున్నాయి. ప్రగతి పథంలో ఎంతో మంది కృషి వుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1918 సంవత్సరం జనవరి 11వ తేదీన మద్రాసు రాష్ట్ర సహకార చట్టం క్రింద నేటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రిజిష్టర్‌ చేయబడింది. గ్రామీణ రైతులే సభ్యులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రైతులకు వాణిజ్య బ్యాం కుల కంటే మిన్నగా సేవలందించసాగాయి. 1933 అక్టోబర్‌ 17వ తేదీన ఇప్పుడున్న కేంద్ర సహకార బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావు బహుద్దూర్‌ చెంగయ్య పంతులు, రేబాల దశరథరామి రెడ్డి, చుండూరు సుబ్బయ్యశెట్టి, ఏ.సి.సుబ్బా రెడ్డిలు ఒక కమిటీగా ఏర్పడి ఈ భవన నిర్మాణ సన్నాహాలు సాగించారు. 1935 ఏప్రిల్‌ 21వ తేదీన మద్రాసు ప్రొవిన్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ వి.రామదాసు పంతులు చేతుల మీదుగా ఈ బ్యాంకు భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోజుకు బ్యాంకు అధ్యక్షుడుగా రేబాల దశరథరామిరెడ్డి వున్నారు. ఈ బ్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు వేల రూపాయలను షేర్‌ క్యాపిటల్‌గా మంజూరు చేసింది. అప్పటి నుండి ఇప్పటి దాకా బ్యాంకు అంచలంచెలుగా ఎదు గుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది. రావుబహుద్దూర్‌ చెంగయ్య పంతులు బ్యాంకు మొదటి అధ్యక్షులుగా సేవలం దించారు. కె.వి.రాఘవాచార్యులు, రావు సాహెబ్‌ విశ్వనాథరావు పంతులు, రేబాల దశరథరామిరెడ్డి, రేబాల లక్ష్మీనరసారెడ్డి, దువ్వూరు బలరామిరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, వేమా రెడ్డి రామచంద్రారెడ్డి, వేనాటి మునిరెడ్డి, మేకల హజరత్తయ్య, వాకాటి నారాయణ రెడ్డి, వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డిలు ఈ వందేళ్లలో బ్యాంకు ఛైర్మెన్‌లుగా సేవలం దించి బ్యాంకు పురోభివృద్ధిలో భాగస్వాము లయ్యారు.

ఇది నా అదృష్టం - మెట్టుకూరు ధనుంజయరెడ్డి

నేను మెట్ట ప్రాంతంలో పుట్టాను. రైతు సమస్యలు తెలిసిన వాడిని. నిద్రలేస్తే రైతు కష్టం చూసే వాడిని. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా రైతులకు ఈ రూపంలో సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇందులో వున్న సంతృప్తి ఇక ఏ పదవిలోనూ, ఏ బాధ్యతలోనూ వుండదు. రైతు వుంటే ఈ ప్రపంచం వుంటుంది, రైతు తింటేనే మనం తింటాం. కాబట్టి మనం రైతులను గౌరవించాలి. రైతులను ప్రోత్సహించాలి. నేను బ్యాంకు ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాక రైతుల శ్రేయస్సు కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం అహర్నిశలు కృషి చేసా! రాష్ట్ర ప్రభుత్వం మా పాలకవర్గ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టే బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. బ్యాంకు శత వసంతాల వేడుక జరుపుకునే సమయంలో బ్యాంకు ఛైర్మెన్‌గా నేనుండడం నా పూర్వజన్మ సుకృతం. ఈ వందేళ్ల ప్రయాణం ఒక చరిత్ర. ఆ చరిత్రలో నా పేరు నిలబడడం నాకు లభించిన వరం.

Thursday, 24 August 2017 11:24

నరకం చూపిస్తున్నారు

Written by

roadsనెల్లూరులో భూగర్భడ్రైనేజీ మాటేమో గాని దీని కోసం తవ్విన రోడ్లు మాత్రం జనానికి నరకం చూపిస్తున్నాయి. భూగర్భ డ్రైనేజీ కోసం ఇష్టారాజ్యంగా సిమెంట్‌ రోడ్లను తవ్వసి పైపులు వేసిన తర్వాత వాటిని సరిగా పూడ్చకపోవడంతో జనా నికి, వాహనదారులకు ఆ రోడ్ల మీద సినిమా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల అడపాదడపా వానలు పడుతున్నాయి. సిమెంట్‌రోడ్లను పైపు లైన్ల కోసం మధ్యలో తవ్వేసి మట్టితో కప్పేసారు. వానలు పడితే ఈ మట్టి కొట్టుకుపోయి మధ్యలో గుంటలు తేలుతున్నాయి. ఇలాంటి సిమెంట్‌ రోడ్లలో కారు లేదా ఇతర నాలుగుచక్రాల వాహ నాలు పోవాలంటే తవ్విన భాగాన్ని సెంటర్‌ చేసుకుని పోవాలి. ఈ దశలో ఎదురుగా ఏదన్నా వాహనం వచ్చిందంటే పక్కకు జరగడం కూడా కష్టమే! ఏ మాత్రం పక్కకు జరిగినా రోడ్ల మధ్య తవ్విన గోతుల్లో వాహనాలు ఇరుక్కు పోవడం ఖాయం. నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను చేతయ్యి చేతకాని వాళ్లు చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్‌ను ఎల్‌ అండ్‌ టి సంస్థ తీసుకుంది. వాళ్లు ఈ పనుల న్నింటిని సబ్‌ కాంట్రాక్టర్లకిచ్చారు. అను భవం లేని వాళ్ళు కూడా ఈ పనులు చేస్తున్నారు. రోడ్డు తవ్వి పైపులు వేసాక ఆ రోడ్డులో ప్యాచ్‌వర్క్‌ పూర్తి చేయాలి. కాని, కొందరు కాంట్రాక్టర్లు అలా చేయడం లేదు. తవ్విన చోట మట్టితో పూడ్చేసి పోతున్నారు. వానలు పడ్డప్పుడు ఈ మట్టి కొట్టుకు పోతుంది. గోతులు ఏర్పడుతు న్నాయి. నగరంలో ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ పనులు జరుగుతుండడం, చేసిన పనులను సక్రమంగా చేయకపోతుండ డంతో ప్రజలకు నరకం కనిపిస్తోంది.

killerగత ఏడాది జనవరిలో వరుస హత్యలకు పాల్పడి జిల్లాలో భయోత్పాతాన్ని సృష్టించిన సైకో కిల్లర్‌ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు నాల్గవ అదనపు జిల్లా జడ్జి మరణశిక్ష విధిస్తూ 17వతేదీ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే కొండాపురం మండలానికి చెందిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు కావలి పట్టణానికి వలస వచ్చి న్యూడిల్స్‌ బండిని పెట్టుకున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ అతను నేరాల వైపు దృష్టి సారించాడు. ఒంటరిగా వున్న మహిళలను టార్గెట్‌ చేసాడు. కావలిలో ఇంట్లో ఒంటరిగా వున్న ఓ మహిళను తలపై సుత్తితో కొట్టి చంపి ఆమె ఒంటిపై వున్న బంగారు నగలతో ఉడాయించాడు. నెల్లూరు రూరల్‌ మండలం పెద్దచెరుకూరులో వృద్ధ పూజారి దంపతులను హత్య చేసి పరారయ్యాడు. గతేడాది జూలై 9న నెల్లూరు, చిల్డ్రన్స్‌ పార్కు ప్రాంతంలో వున్న ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లోకి కేబుల్‌ టీవీ టెక్నీషియన్‌ లాగా వెళ్లాడు. అక్కడ వున్న నాగేశ్వరరావు భార్య ప్రభావతి మీద, వారి బంధువైన మరో అమ్మాయి మీద సుత్తితో దాడి చేసాడు. ప్రభావతి అక్కడికక్కడే చనిపోగా, ఇంకో యువతి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఇంటికొచ్చిన నాగేశ్వరరావు మీద కూడా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు చేరి వెంకటేశ్వర్లును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత గాయపడ్డ యువతి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వరుస హత్యలు అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించాయి. ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో ఈ సైకో కిల్లర్‌ పట్టుబడకపోయివుంటే జిల్లాలో ఇంకెన్ని ఘోరాలు జరిగి వుండేవో? మొత్తానికి ఈ సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Friday, 11 August 2017 14:54

ప్రజలలో అసహనం

Written by

matti roadభూగర్భ డ్రైనేజీ పనుల మాటేమోగాని నిలువునా ధ్వంసమవుతున్న రోడ్లను చూస్తుంటే జనం గుండె రగిలిపోతోంది. నగరంలో ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా శుద్ధంగా లేదు. అన్ని వీధుల్లో సిమెంట్‌రోడ్లను ధ్వంసం చేశారు. తవ్విన చోట కాంక్రీట్‌తో నింపకుండా మట్టిపోసారు. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు ఈ మట్టి కొట్టుకు పోయి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్ల మీద వాహనాలను నడపడానికే కాదు, జనం నడవ డానికి కూడా ఇబ్బందిగా వుంది. భూగర్భ డ్రైనేజీ పనులంటూ శుద్ధంగా వున్న రోడ్లను పాడు చేయ డంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

venkaనెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుండి నింగిలోకి రాకెట్లు ఎగురుతుంటాయి. ఆ రాకెట్లకు ఎగరడానికి ఒక లాంచ్‌ ప్యాడ్‌ ఉంటుంది. కాని నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం నుండి ఎటువంటి లాంచ్‌ప్యాడ్‌ లేకుండానే ఒక రాకెట్‌ ఎగిరి సాధారణ కార్యకర్త స్థాయి నుండి భారత ఉపరాష్ట్రపతి స్థాయికి దూసుకుపోయింది. ఆ రాకెట్‌ పేరే ముప్పవరపు వెంకయ్యనాయుడు.

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో మనకు చాలాగొప్పగా కనిపించే నాయ కులు బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యలు. అయితే వారికి కూడా సాధ్యం కానటువంటి అత్యున్నత స్థానాన్ని అలంకరించబోతున్న తొలి నెల్లూరీయుడు మన వెంకయ్యనాయుడు.

ఏబివిపి కార్యకర్తగా, విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆరెస్సెస్‌ సేవకుడిగా, జనసంఘ్‌ నేతగా, శాసనసభ్యుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా... ఆయన చూడని పదవులు లేవు... ఆయన ఎరుగని రాజకీయ కోణాలు లేవు. ఎన్ని పదవులు అనుభవించినా ఆయనకు సంతృప్తినిచ్చే పదవి మొదట భారతీయుడు. ఆ తర్వాత నెల్లూరీయుడు. పుట్టినగడ్డపై అంతటి మమకారం ఆయనకు. దేశంలో ఆయన తిరగని రాష్ట్రం, ఆయన కాలు మోపని ప్రాంతం లేదు. ఎక్కడ ప్రసంగి స్తున్నా, ఆయన ప్రసంగంలో 'నెల్లూరు' అనే పదం రాకుండా వుండదు. నెల్లూరుకు ఆయన ఏం చేసాడో అందరికీ తెలిసిందే! చేసిన అభివృద్ధి ఒకెత్తైతే... నెల్లూరును దేశమంతా తెలిసేలా చేసింది కూడా ఆయనే! నెల్లూరుజిల్లాను ఇంతగా ప్రేమించే నాయకుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబో తున్నాడు. 5వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో ఆయన గెలుపు లాంఛనమే! ఈ నెల 11వ తేదీ ఉపరాష్ట్ర పతిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణస్వీకారానికి ముందే తన నెల్లూరుపై అడుగుపెట్టాలని, ఆత్మీయులు, అభిమానులు, ఆప్తులతో కలిసి మాట్లాడా లని ఆయన మనసు పరితపించింది. దీనికోసమే ఆయన 7వ తేదీ ఉదయం తిరుమలలో తన ఇష్టదైవం వెంకన్న దర్శనం చేసుకుని మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరులోని విఆర్‌సి మైదా నంలో వెంకయ్యనాయుడు ఆత్మీయ అభి నందన సభకు భారీ సన్నాహాలు జరుగు తున్నాయి. ప్రముఖదాత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణ, రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి.రత్నం, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జమీన్‌రైతు సంపాదకులు నెల్లూరు డోలేంద్రప్రసాద్‌, అపస్మా నాయకులు బి.మనోహర్‌రెడ్డి, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.చంద్ర శేఖర్‌రెడ్డిలు సభ్యులుగా వున్న కమిటీ ఆధ్వర్యంలో మన వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో పాటు అన్ని పార్టీల నాయకులు, పది నియో జకవర్గాలలో వున్న వెంకయ్య అభిమా నులు, ఆత్మీయులు ఈ సభకు తరలివస్తు న్నారు. వెంకయ్య మీదున్న అభిమానంతో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు చెన్నై, బెంగు ళూరు, హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ వంటి నగరాలలో, ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన నెల్లూరీయులందరు కూడా వెంకయ్య ఆత్మీయ అభినందన సభకు ఎంతో అభిమానంతో విచ్చేస్తున్నారు.

నెల్లూరుజిల్లా నుండి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మొదటి నాయకుడు వెంకయ్యనాయుడు. ఇక్కడ మనం గర్విం చాల్సింది, స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఆయన ఎదిగిన వైనాన్ని చూసి. ఆయన పెద్దపేరున్న రాజకీయ కుటుంబంలో జన్మించి ఆ స్థాయికి చేరుకోలేదు. ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి, రాజ కీయాలలో పాయింట్‌ వన్‌పర్సంట్‌ కూడా క్రమశిక్షణ తప్పకుండా ఒకే సిద్ధాంతాన్ని ఆచరించి దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన నాయకుడు వెంకయ్య. మన పిల్లలకు ఆయన జీవితాన్ని, ఆయన ఆచరించిన సిద్ధాంతాన్ని ఆదర్శప్రాయంగా చూపాలి. ఇది ఒక వ్యక్తికి జరిగే అభినందన కాదు, ఒక పదవికి జరిగే సత్కారం కాదు, క్రమ శిక్షణాయుత జీవితానికి, సిద్ధాంత నిబ ద్ధతకు జరిగే సత్కారం. మన నెల్లూరీ యుడు సాధించిన ఔన్నత్యానికి, ఆయన చూపిన ఆదర్శానికి సన్మానం. కాబట్టి నెల్లూరీయులందరు వెంకయ్య ఆత్మీయ సభకు హాజరై ఆయనను నిండు మనసుతో దీవించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

leaders sandhigఒక రాజకీయ నాయకుడు ఎక్కడ షైన్‌ అవుతాడు... పోలీసుస్టేషన్‌లోకి పోవాలి, ఎస్‌ఐతోనో, సిఐతోనో మాట్లాడి తమ వాళ్ల మీద కేసులు ఎత్తేయించాలి. పెద్దకేసులైతే ఎస్పీకి ఫోన్‌ చేసి చెప్పగలగాలి. మండలాల్లో ఎమ్మార్వోగా విఆర్‌ఓగా తమ అనుచరులకు పనులు చేసేవాళ్లను పెట్టుకోవాలి. సదరు అధికారపార్టీ నాయకుడి నుండి ఫోన్‌ రాగానే ఎమ్మార్వో వద్ద గాని, విఆర్‌ఓ వద్ద గాని పనయ్యేటట్లుండాలి. కార్పొరేషన్‌, మున్సిపాల్టీల పరిధిలో నాయకులకయితే కమిషనర్‌ గాని, సంబంధిత మున్సిపల్‌ అధికారులు గాని చెప్పగానే పని చేసేటట్లుండాలి. సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కువ శాతం మంది అధికారులు అధికార పార్టీ నాయకుల మాటకు విలువిస్తుంటారు. వారు చెప్పిన పనులను చేస్తుంటారు.

కాని, ఇప్పుడు జిల్లాలో అధికారపార్టీ నాయకులకు పెద్ద చిక్కొచ్చిపడింది. జిల్లా కలెక్టర్‌గా వున్న ముత్యాలరాజు ముక్కు సూటిగా పోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొంచడం లేదు. మండల స్థాయిలో అధికారపార్టీ వాళ్లకు ఎమ్మార్వోలు, ఆర్‌ఐలు, విఆర్‌ఓలు, సెక్రటరీల వంటి ఉద్యోగులు చాలా కీలకం. మండల స్థాయి నాయకులు వారిచేత పని చేయించుకోగలిగితేనే వీరి వెనుక కేడర్‌ నిలబడుతుంది. ఆర్‌ఐలు, విఆర్‌ఓల వంటి ఉద్యో గుల బదిలీలను వీళ్లు చేయించగలిగితేనే, స్థానికంగా ఆ నాయ కులకు పట్టున్నట్లు కలరింగ్‌ ఇస్తారు. అయితే కలెక్టర్‌ ముత్యాలరాజు వద్ద అలాంటి పప్పులుడకడం లేదు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల బదిలీలలో ఆయన ఏ రాజకీయ నాయకుడినీ వేలు పెట్టనీయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తాము కోరుకున్న వారికి బదిలీ వేయించడంలో విఫలమయ్యారు.

కలెక్టరే అడ్డనుకుంటే ఇప్పుడొచ్చిన ఎస్పీ ఇంకా మొండిగా వున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు కలెక్టర్‌ దాకా సిఫార్సులన్నా తీసుకెళుతున్నారు. కాని ఏదన్నా పనిమీద ఎస్పీకి ఫోన్‌ చేయడానికి జంకుతున్నారు నాయకులు. ఎస్పీ రామకృష్ణ గురించి జిల్లాలో అందరు నాయకు లకు తెలిసిపోయింది. పద్ధతైన పనయితే ఎవరు ఫోన్‌ చేసినా సానుకూలంగానే స్పందిస్తాడు. అదే అడ్డగోలు పనైతే ఎవరికైనా సమాధానం ఒకే రీతిలో ఉంటుంది. కాబట్టే ఎవరూ నేరుగా ఎస్పీకి ఫోన్‌ చేయడం గాని, ఏదన్నా పని మీద కలవడం గాని చేయడం లేదు. ఎస్పీ దెబ్బకు జడిసి సిఐలు, ఎస్‌ఐలు కూడా అధికారపార్టీ నాయకులు ఏ పని చెబితే ఆ పని చేయడంలేదు. సక్రమమైన పనులంటేనే చేస్తున్నారు. కేసు సక్రమంగా వుంటే అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అడ్డగోలు పనులు చేయడానికే కదా అనుచరులు వాళ్ల వెనుక తిరిగేది! కాని పోలీసుస్టేషన్‌లలో అధికారపార్టీ నాయకుల మాట చెల్లుబాటు కావడం లేదు. స్థానికంగా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నా కూడా... ఎస్‌ఐలు, సిఐలు లెక్కచేయడం లేదు. మేం రూల్స్‌ను అతిక్రమించి ఏ పనీ చేయం. మీకు చేతనైతే ఎస్పీ చేత చేయించుకోండి, మీకు మేం పని చేయడం లేదనుకుంటే మమ్మల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోండని తెగేసి చెబుతున్నారు. అలాగే నెల్లూరు నగరంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ కూడా అధికారపార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. కమిషనర్‌ ఢిల్లీరావు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం లేదు. దీంతో కార్పొరేషన్‌లో అక్రమ మార్గాల్లో పనులు చేసుకుం టున్న అధికారపార్టీ నాయకులకు బ్రేక్‌ పడినట్లయ్యింది. జిల్లాలో గట్టి ఉన్నతాధికారులుండడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకుల ఆటలు సాగడం లేదు.

vivekaఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది. ఆ పార్టీలో అవమానాలను దిగమిం గాల్సివస్తోంది. ఇస్తామన్న పదవి ఇవ్వక, ఆశించిన గౌరవం రాక ఈ పార్టీలో ఎందుకు చేరడం అని ఇప్పుడు తల బాదుకుంటున్నారు.

ఆనం వివేకానందరెడ్డి... వెరైటీ రాజకీయాలకు, వెరైటీ వేషాలకు నెల్లూరుజిల్లాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకూ బ్రాండ్‌ అంబాసిడర్‌! వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణంతో ఈ రాష్ట్రంలో చాలామంది రాజకీయ బ్రతుకు చిత్రాలు తారుమార య్యాయి. వారిలో ఆనం సోదరులు కూడా వున్నారు. వై.యస్‌. ఉన్నప్పుడు వీళ్లు కలలో కూడా అనుకోలేదు... తెలుగుదేశంలో చేరుతామని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని! కాని వై.యస్‌. మరణంతో వారి రాజకీయ జీవితం అనుకోని మలుపులు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేలా చేసింది.

2016లో ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లిద్దరూ తెలుగుదేశంలో చేరడం తెలిసిందే! ఆనం వివేకాకు ఎమ్మెల్సీ, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఇచ్చేటట్లు అప్పట్లో మాటలు జరిగాయి. ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యత ఆనం రామ నారాయణరెడ్డికైతే ఇచ్చారు గాని, ఆనం వివేకాకు మాత్రం ఇంత వరకు ఏ బాధ్యత ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవిపై ఆయన గంపెడాశలు పెట్టుకుని వున్నాడు. త్వరలో తెలుగుదేశంకు గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు రానున్నాయి. నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వాటిని ప్రకటించేసాడు. నంద్యాలకు చెందిన మాజీమంత్రి ఫరూక్‌కు ఒకటి, జమ్మలమడుగు మాజీఎమ్మెల్యే పి.రామసుబ్బారెడ్డికి ఒకటి ఖరారు చేశారు. దీంతో వివేకాకు పూర్తిగా తలుపులు మూసినట్లయ్యింది. ఇక ముందు కూడా ఆయనకు ఏ పదవీ ఇవ్వకపోవచ్చు. తన కొడుకుకు నెల్లూరు నగర ఇన్‌ఛార్జ్‌ పదవి ఇప్పించుకోవాలనుకున్నా అదీ నెరవేరలేదు.

తెలుగుదేశంలో చేరాక వివేకాకు అవమానాలు, నిరాశ తప్ప ఇంకేమీ దక్కలేదు. రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఇంతవరకు జగన్‌ను తిట్టనంతగా వివేకా తిట్టాడు. అయినా చంద్రబాబు దానిని గుర్తించలేదు. కనీసం జిల్లాలో తెలుగుదేశం నాయకులు కూడా ఆయనను గుర్తించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ముఖ్యంగా జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఆయనను లెక్క చేయడం లేదు. పార్టీపరంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలలో కూడా ఆయన పేరు, ఫోటో కనపడ్డం లేదు. నెల్లూరు రాజకీయాలలో పాతికేళ్ల పాటు ధగధగమని వెలిగిన వివేకా, కాంగ్రెస్‌ను వదిలి తెదేపాలోకొచ్చాక కొవ్వొత్తిలా అయ్యాడు.

vivekaఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది. ఆ పార్టీలో అవమానాలను దిగమిం గాల్సివస్తోంది. ఇస్తామన్న పదవి ఇవ్వక, ఆశించిన గౌరవం రాక ఈ పార్టీలో ఎందుకు చేరడం అని ఇప్పుడు తల బాదుకుంటున్నారు.

ఆనం వివేకానందరెడ్డి... వెరైటీ రాజకీయాలకు, వెరైటీ వేషాలకు నెల్లూరుజిల్లాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకూ బ్రాండ్‌ అంబాసిడర్‌! వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణంతో ఈ రాష్ట్రంలో చాలామంది రాజకీయ బ్రతుకు చిత్రాలు తారుమార య్యాయి. వారిలో ఆనం సోదరులు కూడా వున్నారు. వై.యస్‌. ఉన్నప్పుడు వీళ్లు కలలో కూడా అనుకోలేదు... తెలుగుదేశంలో చేరుతామని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని! కాని వై.యస్‌. మరణంతో వారి రాజకీయ జీవితం అనుకోని మలుపులు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేలా చేసింది.

2016లో ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లిద్దరూ తెలుగుదేశంలో చేరడం తెలిసిందే! ఆనం వివేకాకు ఎమ్మెల్సీ, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఇచ్చేటట్లు అప్పట్లో మాటలు జరిగాయి. ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యత ఆనం రామ నారాయణరెడ్డికైతే ఇచ్చారు గాని, ఆనం వివేకాకు మాత్రం ఇంత వరకు ఏ బాధ్యత ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవిపై ఆయన గంపెడాశలు పెట్టుకుని వున్నాడు. త్వరలో తెలుగుదేశంకు గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు రానున్నాయి. నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వాటిని ప్రకటించేసాడు. నంద్యాలకు చెందిన మాజీమంత్రి ఫరూక్‌కు ఒకటి, జమ్మలమడుగు మాజీఎమ్మెల్యే పి.రామసుబ్బారెడ్డికి ఒకటి ఖరారు చేశారు. దీంతో వివేకాకు పూర్తిగా తలుపులు మూసినట్లయ్యింది. ఇక ముందు కూడా ఆయనకు ఏ పదవీ ఇవ్వకపోవచ్చు. తన కొడుకుకు నెల్లూరు నగర ఇన్‌ఛార్జ్‌ పదవి ఇప్పించుకోవాలనుకున్నా అదీ నెరవేరలేదు.

తెలుగుదేశంలో చేరాక వివేకాకు అవమానాలు, నిరాశ తప్ప ఇంకేమీ దక్కలేదు. రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఇంతవరకు జగన్‌ను తిట్టనంతగా వివేకా తిట్టాడు. అయినా చంద్రబాబు దానిని గుర్తించలేదు. కనీసం జిల్లాలో తెలుగుదేశం నాయకులు కూడా ఆయనను గుర్తించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ముఖ్యంగా జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఆయనను లెక్క చేయడం లేదు. పార్టీపరంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలలో కూడా ఆయన పేరు, ఫోటో కనపడ్డం లేదు. నెల్లూరు రాజకీయాలలో పాతికేళ్ల పాటు ధగధగమని వెలిగిన వివేకా, కాంగ్రెస్‌ను వదిలి తెదేపాలోకొచ్చాక కొవ్వొత్తిలా అయ్యాడు.

tdp netaluనిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ ఆశల పల్లకిలో వూరేగుతూనే వున్నారు. మహా అంటే ఇంకో ఆరేడు నెలల దాకా నామినేటెడ్‌ పదవులిస్తారు. ఆ తర్వాత ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలవుతుంది. నామినేటెడ్‌ పదవుల గురించి ఆలోచన చేసే టైం కూడా వుండదు.

నామినేటెడ్‌ పదవుల విషయంలో జిల్లాలోని తెలుగుదేశం నాయకులు ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే బాధ కొందరిలో వుంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జిల్లా పరంగా చూస్తే కిలారి వెంకటస్వామినాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవిని, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి నుడా ఛైర్మెన్‌ పదవిని ఇచ్చారు. ఈ రెండూ జిల్లా పదవులే! వాళ్లకు కాకున్నా ఎవరోఒకరికి ఇవ్వాలి. పార్టీని కనిపెట్టుకుని వున్నారు కాబట్టి వారికివ్వడంలో తప్పులేదు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మెన్‌ పదవిని మంత్రి నారాయణ కోటాలో కాంగ్రెస్‌లో నుండి వచ్చిన చాట్ల నరసింహరావుకు ఇచ్చారు. ఇటీవల ఆఫ్కాప్‌ ఛైర్మెన్‌గా కొండూరు పాల్‌శెట్టిని నియమించడం జరిగింది.

కాని పార్టీని నమ్ముకుని, పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీ కోసం పని చేసిన ఇంకొందరు నాయకులకు ఇంతవరకు ఎటువంటి పదవులు లభించలేదు. మాజీమంత్రి టి.రమేష్‌రెడ్డి, మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అనూరాధ దంపతులను పదవుల విషయంలో పూర్తిగా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. 1983 నుండి పార్టీని కనిపెట్టుకున్నోళ్లు వీళ్లు. 'నుడా' ఛైర్మెన్‌ పదవి ఇస్తారని ఆశించారు. అది రాలేదు. అనూరాధను మహిళా కమిషన్‌ సభ్యురాలిగానో, టిటిడి బోర్డు సభ్యురాలిగానో నియమిస్తారనే ప్రచారం వుంది. అయినా ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు.

2014లో నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం తరఫున మేయర్‌ అభ్యర్థిగా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అన్నీ తానై ముందుకొచ్చిన వ్యక్తి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌. ఆ ఎన్నికల్లో పార్టీ కోసమే రంగంలోకి దిగాడు. నెల్లూరుజిల్లాలో వై.యస్‌. గాలి బాగా తోలడంతో గట్టిగా ఢీకొట్టి కూడా దెబ్బతిన్నాడు. పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు పార్టీ ఉనికిని చాటేలా టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షులుగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలో ఏ పని అప్పగించినా సమర్ధవంతంగా పూర్తి చేస్తున్నాడు. పార్టీ కోసం అన్ని విధాలా నష్టపోయిన జడ్‌.యస్‌.కు పార్టీ నుండి ఇంకా న్యాయం జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండుసార్లు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం ఎమ్మెల్సీగా పోటీచేసి ఆర్ధికంగా దెబ్బతిన్న వ్యక్తి, న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు. పార్టీ బలహీనంగా వున్న రోజుల్లో కూడా అతను పార్టీ కోసం నిలబడ్డాడు. పార్టీ పరంగా అతనికీ ఇంతవరకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్‌ వేనాటి రామచంద్రారెడ్డి. ఆయన పెద్ద పెద్ద నామినేటెడ్‌ పదవులను ఆశించడం లేదు గాని టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కితే చాలనుకుంటున్నాడు. మరి చంద్రబాబు ఆయనకు ఆ అవకాశమిస్తాడో లేదో చూడాలి. 2014 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నుండి పోటీ చేసి పరాజయం పాలైన డా|| బి.జ్యోత్స్నలతకు కూడా నామినేటెడ్‌ పదవి ఆశ చూపించివున్నారు. వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యే పాశం సునీల్‌ తెలుగుదేశంలో చేరడంతో ఆమెకు అప్పటివరకు వున్న గూడూరు ఇన్‌ఛార్జి హోదా కూడా పోయింది. ఇక నామినేటెడ్‌ పదవి రాకుంటే ఆమెకూ అన్యాయం చేసినట్లే!

కాలం వేగంగా కదులుతోంది. వీళ్లకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నామినేటెడ్‌ పదవులు రావు. ఇంకో ఆరేడు నెలల తర్వాత ఇచ్చినా కూడా ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైతే వాటివల్ల ఉపయోగం వుండదు.

Page 1 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • దుగరాజపట్నం పోర్టు... చించేసిన చీటీకి పాకులాట!
  మొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని,…
 • 'దేశం'ను వెంటాడుతున్న... గెలుపుగుర్రాల కొరత
  నంద్యాల, కాకినాడలలో గెలుపుతో తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో మాత్రం గెలుపుగుర్రాల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. వైసిపికి బలమైన జిల్లా ఇది. వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే గెలుపుగుర్రాల ఎంపికపై పెద్ద ఎత్తునే కసరత్తు చేయాల్సివుంది.…
 • 'కిమ్‌'ను దారికి తెచ్చిన నెల్లూరోళ్ళు
  దూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు…
 • కాంగ్రెస్‌లోనే ఉంటారా?
  రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేందుకు పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పట్టిన దుస్థితి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీని ఆదుకున్న రాష్ట్రమిది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టే ముందువరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురన్నది లేదు. కాంగ్రెస్‌ను, ఇందిరాగాంధీ కుటుంబాన్ని…

Newsletter