జాతీయ వార్తలు


బెంగుళూరులోని ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ ఈనెల 5వ తేది రాత్రి హత్యకు గురయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటిబయట నిల్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ఆమెకు అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి దుర్మరణం పాలయ్యారు. ఈ హత్యోదంతం బెంగు ళూరులో సంచలనం సృష్టించింది. బెంగు ళూరు మహానగరంలో ఇలా ఒక మహిళా జర్నలిస్ట్‌ను అత్యంత దారుణంగా…

Read more...

చాలా ఏళ్ళ తర్వాత రాకెట్‌ ప్రయోగాల పరంపరలో ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి-సి39 రూపంలో పరాజయం ఎదురైంది. ఆగస్టు 31వ తేదీ శ్రీహరికోట లోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి39 విఫలమైంది. రాకెట్‌ మూడు దశలను విజయవంతంగా అధిగమించి 4వ దశ జరుగుతున్న సమయంలో రాకెట్‌ నుండి ఉపగ్రహం విడిపోక పోవడంతో ప్రయోగం విఫలమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.…

Read more...

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వెలుగులు కళ్ళు జిగేల్‌ మనిపించాయి. తెలుగు పంచెకట్టు ఆకట్టుకుంది. తెలుగు భాషకు, తెలుగు యాసకు వెలుగులిచ్చిన తెలుగు తల్లి వరపుత్రుడు, నెల్లూరు ముద్దుబిడ్డ మన ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతిగా కొలువుదీరారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10.45గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, వెంకయ్య నాయుడు చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు భారత ప్రధానమంత్రి నరేంద్ర…

Read more...

ఆయన ఎమ్మెల్యేగా నెల్లూరుకొచ్చాడు, ఎంపీగా ఎన్నోసార్లొ చ్చాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాడు, జాతీయ అధ్యక్షుడిగా కూడా వచ్చాడు... ఆఖరకు కేంద్రమంత్రిగా నెల్లూరులో ఎన్నిసార్లు అడుగుపెట్టాడో లెక్కేలేదు. అవన్నీకూడా ఒక పార్టీకి పరిమితమైన పర్యటనలే! అవన్నీ కూడా రాజకీయ పరమైన కార్యక్రమాలే! ఇంత కాలం రాజకీయాలలో వున్న ఒక కోణం అభిమానాన్నే ఆయన చవి చూసారు. కాని, తొలిసారిగా రాజ్యాంగాధిపతి హోదాలో అన్ని కోణాల నుండి ప్రజల అభిమానాన్ని ఆస్వాదించారాయన!…

Read more...

ఆరడుగుల ఆజానుబాహుడు.. అడ్డ పంచెకట్టుతో అలరించే తెలుగువాడు... ఆంధ్రనాట విరిసిన కమలనాథుడు... అసెంబ్లీ టైగర్‌గా ప్రసిద్ధింగాంచినవాడు... అందరూ అభిమానించే నాయకుడు... అద్భుతమన్పించే మాటల మాంత్రికుడు... ఎవరు... ఎవరు... ఇంకెవరు... మన నెల్లూరు ముద్దుబిడ్డడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆధునిక భారత రాజకీయ రంగాన మెరుస్తున్న నెల్లూరు ధృవతార వెంకయ్యనాయుడు. నెల్లూరీయులు మా వెంకయ్య అని చెప్పుకుని గర్వించే స్థాయికి ఎదిగిన నాయకుడు. వెంకయ్య ఉన్నతిని చూసి, ఆయన ప్రస్థానాన్ని చూసి నెల్లూరీయులు…

Read more...

భారత్‌ 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. ఆయనకు 7,02,044 విలువ ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి యూపిఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 విలువ ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి పదవికి ఈ నెల 17వ తేదీ ఎన్నిక జరిగింది. పోలైన ఓట్లలో రామ్‌నాథ్‌ కోవింద్‌కు 2,930 ఓట్లు రాగా, మీరాకుమార్‌కు 1844 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి మొత్తం ఓట్లన్నీ ఎన్డీఏ అభ్యర్థి…

Read more...


విజయవంతమైన ఉపగ్రహాల ప్రయోగానికి 'ఇస్రో' కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇటీవల కాలంలో ఇస్రో వరుసబెట్టి వదులుతున్న రాకెట్లన్నీ కూడా సూపర్‌హిట్లే! అంతరిక్ష ప్రయో గాలలో ఒక్కో రాకెట్‌ ఒక్కో మలుపుగా ఉంటోంది. ఈమధ్య వరుస రాకెట్ల ప్రయోగాలతో నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) సందడిగా ఉంటోంది. మొన్నటికి మొన్న జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ సక్సెస్‌ మరుగున పడక ముందే తాజాగా జూన్‌ 23వ తేదీ పిఎస్‌ఎల్‌వి-సి38ను ప్రయోగించి విజయపరంపరను…

Read more...


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ38 రాకెట్‌ ప్రయోగం విజయవంతైమంది. 28 గంటల నిరంతర కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఉదయం 9.29 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్‌ మిషన్‌తో చేసిన 17వ ప్రయోగం కావడం విశేషం. ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా…

Read more...


అద్వానీ... సుష్మాస్వరాజ్‌... మురళీమనోహర్‌ జోషి... రతన్‌ టాటా... ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి... అమితాబ్‌బచ్చన్‌... మోహన్‌ భాగవత్‌... రాష్ట్రపతి రేసులో చక్కర్లు కొట్టిన పేర్లు. వీరిలో ఎవరో ఒకరి పేరు ఖాయమనుకున్నారు. తీరా చూస్తే ఎవరూ వూహించని పేరు వెలువడింది. ప్రతిపక్షాలకు ఎలాంటి పోబిడి ఇవ్వకుండా, వేలెత్తి వంక చూపే వీలు లేకుండా దళిత వర్గాలకు చెందిన బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో…

Read more...


Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • దుగరాజపట్నం పోర్టు... చించేసిన చీటీకి పాకులాట!
    మొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని,…
  • 'దేశం'ను వెంటాడుతున్న... గెలుపుగుర్రాల కొరత
    నంద్యాల, కాకినాడలలో గెలుపుతో తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో మాత్రం గెలుపుగుర్రాల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. వైసిపికి బలమైన జిల్లా ఇది. వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే గెలుపుగుర్రాల ఎంపికపై పెద్ద ఎత్తునే కసరత్తు చేయాల్సివుంది.…
  • 'కిమ్‌'ను దారికి తెచ్చిన నెల్లూరోళ్ళు
    దూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు…
  • కాంగ్రెస్‌లోనే ఉంటారా?
    రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేందుకు పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పట్టిన దుస్థితి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీని ఆదుకున్న రాష్ట్రమిది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టే ముందువరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురన్నది లేదు. కాంగ్రెస్‌ను, ఇందిరాగాంధీ కుటుంబాన్ని…

Newsletter