సంపాదకీయం


మయన్మార్‌... ఇప్పుడొక పెద్ద సమస్య. ప్రపంచాన్నే కుదిపేస్తున్న జఠిల సమస్య. జాతి విద్వేషాలు పరాకాష్టకు చేరుకుంటే అక్కడ ఎంతటి విధ్వంసాలైనా జరుగుతాయని, చివరికి సామాన్య ప్రజలు తలదాచుకునేందుకు చోటు దొరకడం కూడా ఎంతో కష్టమవుతుందని చెప్పేందుకు..మయన్మార్‌ ఒక తాజా ఉదాహరణ. ఒకరిపట్ల ఒకరిపై విశ్వాసం, పరమత సహనం, శాంతి సామరస్యాలతో సహజీవనం వంటి మానవీయ భావనలు లోపిస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలుసుకునేందుకు.. మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లిమ్‌లు ఇప్పుడెదుర్కొంటున్న…

Read more...

ఇదెంతో శుభపరిణామం. గత కొన్ని రోజులుగా భారత్‌-చైనాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లామ్‌ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇరుదేశాలు ఆ మేరకు నిర్ణయించుకోవడంతో డోక్లామ్‌ సమస్య ఇక దూరమైనట్లే భావించవచ్చు. రెండు నెలల కిందట డోక్లామ్‌ వద్ద భారత్‌-చైనాల మధ్య తలెత్తిన వివాదం ఏ పరిణామాలకి దారితీస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు ఈ రెండు దేశాలకి మరింత కీలకమైనదే అయినప్పటికీ, భారత్‌-చైనాల మైత్రికి ఎలాంటి…

Read more...

జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి బలహీనతలను అలుసగా తీసుకుని గుర్మీత్‌సింగ్‌ అలియాస్‌ డేరాబాబా వంటి కిరాతక బాబాలు వస్తూనే ఉంటారు. ప్రజలను అడుగడుగునా వంచించే మోసగాళ్ళు, నయవంచన చేసే మాయగాళ్ళు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా, మనదేశంలో ఇలాంటి దొంగబాబాలకు కొదవే లేదు. నమ్మే అమాయకులుండగా, నమ్మించి నట్టేట ముంచడానికి ఎల్లవేళలా అలాంటి బాబాలు సిద్ధంగా తయారై ఉంటారు. ఇక కొంతమంది నాయకులైతే అలాంటి వంచక బాబాలకే సాష్టాంగపడుతుండడం…

Read more...

గత కొద్దిరోజులుగా మలుపులు తిరుగుతూ సంచలనాలు సృష్టిస్తున్న తమిళ'నాటకానికి' తెరపడింది. 'అమ్మ' జయలలిత మరణానంతరం తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల్లో మరో ప్రధానఘట్టం..కీలక దశలో విలీనరాజకీయాలకు స్వాగతం పలికింది. ఇప్పటిదాకా తమిళ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్న అన్నా డిఎంకె పార్టీలోని రెండు వర్గాలు ఏకం కావడంతో ఎట్టకేలకు ఒక అధ్యాయం ముగిసినట్లయింది. అయితే, ఈ తాజా విలీనం వెనుక ఢిల్లీలోని కమలనాధుల కీలకపాత్ర కూడా ఉందనే ప్రచారమూ జోరుగా ఉంది. దీంతో…

Read more...

''ఈ స్వాతంత్య్రదినం మనకెంతో ప్రత్యేకమైనది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సంవత్సరమిది. సబర్మతీ ఆశ్రమం, చంపారన్‌ సత్యాగ్రహాలకు 75 ఏళ్ళు, లోకమాన్య బాలగంగాధర తిలక్‌ 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని పిలుపునిచ్చి ఈ ఏడాదికి వందేళ్ళయ్యాయి. దేశప్రజలను ఒకటిచేసిన గణపతి ఉత్సవాలు మొదలై ఈ ఏడాదికి 125 ఏళ్ళయ్యాయి.1942-47 మధ్య దేశవ్యాప్తంగా ఐకమత్యం వెల్లివిరిసింది. ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తిని కనపరచాలి. 2022లో ఆ స్ఫూర్తిదీప్తిని…

Read more...

నిర్లక్ష్యానికి పుట్టినిల్లు..నిర్వేదానికి మెట్టినిల్లు ఏదైనా ఉందంటే.. అది మనదేశమేనని అనిపిస్తోంటుంది అప్పుడప్పుడూ. అదేమి దురదృష్టమో తెలియదు కానీ, మనదేశంలో అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అన్నం కరువవుతుంటుంది. వస్త్రం నేసిచ్చే నేతన్నకు చింకిపాతే మిగులుతుంటుంది. అటు దేశానికి వెన్నెముక అయిన రైతుల సమస్యలను కానీ, అనాదిగా చేనేతనే నమ్ముకున్న నేతకారుల దయనీయ పరిస్థితులు కానీ అనాదిగా పాలకులు పట్టించుకోకపోవడం ఎంతైనా విచారకరం. ముఖ్యంగా నేతన్నల పరిస్థితి రానురాను మరింత దిగజారిపోతోంది.…

Read more...

మన దేశంలో అన్నీ సమస్యలే. సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. దానిలోనూ సమస్యలే. చెప్పేది మంచిదే అయినా దానిని ఆచరణలోకి తేవడానికి తలప్రాణం తోకకి వస్తుంటుంది. ఏదీ ఒక పట్టాన తెగదు. ఒకటి పోయిందనుకుంటే మరో సమస్య నేనున్నానంటూ ముందుకు వస్తుంటుంది. అయినా, దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలంటే అంత సులభమైన పనేమీ కాదు. ఎంతో ప్రయాసపడితే తప్ప అది ఒక కొలిక్కి రాదు. ఈ లోగా లేనిపోని…

Read more...


పూర్వకాలంలో ప్లేగు వ్యాధి అంటే ప్రపంచమే గడగడ వణికింది. ఇటీవలి కాలంలో ఎయిడ్స్‌ అంటే సమాజమే భయపడి పోయింది. ఇప్పుడు డ్రగ్స్‌ వాటిని మించిపోయింది. టాలీవుడ్‌కు సైతం అది వెన్నులో వణుకుపుట్టిస్తోంది. నిజమే!... మొన్నమొన్నటిదాకా మాదకద్రవ్యాలు (డ్రగ్స్‌) కేవలం మత్తునే కలిగిస్తుండేవి. అడిగేవారు, అదుపు చేసేవారూ లేకపోవడంతో మత్తుప్రియులదే ఇష్టారాజ్యంగా ఉండేది. ఇప్పుడా మత్తు దిగే రోజులొచ్చాయి. మత్తు ఎంతో గమ్మత్తు అంటూ హాయిగా ఆ మత్తులో మునిగితేలేవారు ఇప్పుడు…

Read more...

గోరక్షణ పేరుతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోతున్న హింసాత్మక రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల రాజ్యసభలోనూ ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. గోసంరక్షణ పేరుతో కొన్నివర్గాలపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్షాలు తీవ్రస్వరంతో గళమెత్తడంతో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో, గత కొద్దిరోజుల ముందుగానే ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావిస్తూ, దళితులపై దాడులు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిం చాలని రాష్ట్రాలను హెచ్చరించారు. అంతేకాదు, ఆ మేరకు…

Read more...


Page 1 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • దుగరాజపట్నం పోర్టు... చించేసిన చీటీకి పాకులాట!
  మొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని,…
 • 'దేశం'ను వెంటాడుతున్న... గెలుపుగుర్రాల కొరత
  నంద్యాల, కాకినాడలలో గెలుపుతో తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో మాత్రం గెలుపుగుర్రాల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. వైసిపికి బలమైన జిల్లా ఇది. వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే గెలుపుగుర్రాల ఎంపికపై పెద్ద ఎత్తునే కసరత్తు చేయాల్సివుంది.…
 • 'కిమ్‌'ను దారికి తెచ్చిన నెల్లూరోళ్ళు
  దూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు…
 • కాంగ్రెస్‌లోనే ఉంటారా?
  రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేందుకు పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పట్టిన దుస్థితి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీని ఆదుకున్న రాష్ట్రమిది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టే ముందువరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురన్నది లేదు. కాంగ్రెస్‌ను, ఇందిరాగాంధీ కుటుంబాన్ని…

Newsletter