Friday, 20 April 2018 08:10

రాహుల్‌ను ప్రధానిని చేయడమే మోడీ లక్ష్యం భేతాళకథ

Written by 
Rate this item
(0 votes)

galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్రలేచాడు. కాలకృత్యాలు ముగించుకుని మురళీకృష్ణ హోటల్‌ కొచ్చాడు. రెండు ఇడ్లీల్లో రెండు బకెట్ల సాంబార్‌ కలుపుకుని తిని కూరగాయల మార్కెట్‌ వద్ద రోడ్డు పై నిలబడ్డాడు. వెంటనే అతని ముందు పది ఆటోలు రాకెట్‌వేగంతో దూసుకొచ్చి ఆగాయి. ఒకరు చేయి, ఒకరు కాలు పట్టుకుని లాగుతూ ఆటోవాలాలు తమ ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేసారు. విక్రమార్కుడు వారి నుండి బలవంతంగా బయటపడి చివరకు ఒక ఆటోలో కూలబడ్డాడు. ఆయన ఆ వెంపర్లాట నుండి హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకునేలోపే పెద్దాసుపత్రి గేటు ముందు ఆటో ఆగింది. విక్రమార్కుడు మనసులో... నెల్లూరు ఆటోవాలాలు ఇంతకుముందు విమానాలు తోలేవాళ్ళ లాగున్నారు. ఆటోలను విమానాలు లాగే తోలుతున్నారను కుంటూ ఆటోవాలాకు 10రూపాయలిచ్చి పెద్దాసుపత్రిలోకి పోయాడు. మార్చురీ లోపలకు వెళ్ళి అప్పుడే రోడ్డు ప్రమా దంలో మరణించిన ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని జిఎన్‌టి రోడ్డు పైకి వచ్చి నడవసాగాడు. యం.జి మాల్‌ వద్దకొచ్చే సరికి కాస్తున్న ఎండ దెబ్బకు విక్రమార్కుడికి చెమటలు కారసాగాయి. ఇంత దూరం వచ్చినా ఈ భేతాళుడిలో

ఉలుకుపలుకు లేదేంటబ్బా అనుకుంటూ... భేతాళ, భేతాళ అంటూ బాడీని తట్టాడు. అప్పుడు బాడీలోని భేతాళుడు... ఆ... విక్రమార్క, చెప్పు ఈ ఎండదెబ్బకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు తట్టడంతో స్పృహ వచ్చింది. అయినా మనుషులు రోడ్లమీద తిరగడానికి భయపడుతున్న ఈ ఎండల్లో నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు జాలే స్తుంది. నీకు శ్రమ తెలియకుండా వుండేందుకు 'అక్క కల నెరవేర్చిన తమ్ముడు' స్టోరీని చెబుతాను. అలా మినర్వా బ్లూ ఫాక్స్‌ బార్‌లోకి వెళ్ళి బీర్‌ కొడుతూ మాట్లాడుకుందాం పద అని బార్‌లోకి తీసుకెళ్లాడు. బీర్లు ఆర్డర్‌ చేసి అవి వచ్చాక తాగుతూ... భేతాళుడు స్టోరీ మొదలుపెట్టాడు. కేంద్రంలో పదేళ్ళ మన్మోహన్‌సింగ్‌ పాలనపై వ్యతిరేకతతో 2014లో దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఎన్డీఏను అధికారంలో కూర్చోబెట్టారు. నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసారు. అభివృద్ధిలో గుజరాత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపిన మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుం దని ఆశించారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు వస్తాయి, జాతీయ రహదారులు అభివృద్ధి చెందుతాయి, నదుల అనుసంధానం జరుగుతుంది, కుంభకోణాలు ఆగుతాయి, ఉగ్రవాదం ఆగిపోతుంది, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అంతమవుతుంది, ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశా లొస్తాయని ప్రజలు ఆశపడ్డారు. నిజాయితీపరుడైన నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం వెలిగిపోతుందని భావించారు. కాని ప్రజలు ఆశించింది వేరు... మోడీ ప్రధాని అయ్యాక జరుగుతున్నది వేరు. ప్రధాని అయ్యాక ఆయన స్వదేశంలో కంటే విదేశాలలో వున్నది ఎక్కువ. ఒక్క శాశ్వతమైన అభివృద్ధి ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టలేదు. అంతేకాదు, నోట్ల రద్దు, జిఎస్టీ వంటివి తెచ్చి తన మీద తన ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ప్రజలను వివిధ రకాల పన్నుల రూపంలో భయపెడుతున్నాడు. ఈ బీజేపీని ఎందుకు గెలిపించాంరా బాబు అనే పరిస్థితి కల్పిస్తున్నాడు. మోడీ తలచుకుంటే దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు సంతోషించేలా అనేక కార్యక్రమాలు చేయవచ్చు. దేశంలో తన పాలన మీద అసంతృప్తి పెరుగుతుందని తెలిసి కూడా నరేంద్ర మోడీ ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు ఎందుకు తీసుకుంటున్నట్లు... దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నారా లోకేష్‌కు తెలుగు పాఠాలు చెప్పే మాస్టార్‌వై పత్రికలకెక్కుతావని హెచ్చరించాడు.

దానికి విక్రమార్కుడు... దీనికి సమాధానం చెప్పను, చూపిస్తాను అంటూ తన ఐ ఫోన్‌ తీసి ఒక వీడియో ఆన్‌ చేసాడు. అది ప్రధానమంత్రి కార్యాలయం. మోడీ కొత్తగా ప్రధాని అయ్యున్నాడు. కొత్త ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెప్పడానికి సోనియాగాంధీ వచ్చింది. ఖర్మకాలి అదేరోజు రక్షాబంధన్‌ కూడా! ఆమె మోడీ చేతికి పూలబొకే ఇచ్చి, ఆ వెంటనే తన చేతిలో వున్న రాఖీని మోడీ చేతికి కట్టింది. దాంతో మోడీ ఆమెతో ఆప్యాయంగా... నువ్వు ఇండియాలో జన్మించకపోయినా ఇటలీలో పుట్టినా నాకు అక్కలాంటి దానివే... సొంత తమ్ముడిలా భావించి రాఖీ కట్టావు. శత్రురాజు భార్య వచ్చి చేతికి రాఖీ కడితే ప్రాణభిక్ష ప్రసాధించిన పురుషోత్తముడి వారసుడిని, నీకేం కావాలో కోరుకో అక్కా... అని అడిగాడు. అప్పుడు సోనియా, నా బొందిలో ప్రాణముండగానే నా బిడ్డ రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వుంది. మీరు సక్రమంగా పరిపాలన సాగించి ప్రజల ఆదరాభిమానాలు పొందితే నా బిడ్డ ఈ జన్మకు ఈ దేశ ప్రధాని కాలేడు. నా బిడ్డ ప్రధాని కావా లన్న కోరిక తీరుస్తావో, లేక ఈ అక్కకు ఇచ్చిన హామీని మరు స్తావో నీ ఇష్టం అంటూ సోనియా పమిట చెంగు నోట్లో కుక్కుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఐ ఫోన్‌లో వీడియో అక్కడితో ఆగి పోయింది. తర్వాత విక్రమా ర్కుడే... ఈ సీన్‌ చూసాక నీకు అర్ధమై వుంటుంది. తాను సక్రమంగా పరిపాలిస్తే తర్వాత కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందని, సోనియా హయాంలో రాహుల్‌ ప్రధాని కావడం కష్టమని భావించిన మోడీ ఇలా అడ్డదిడ్డంగా పరిపాలిస్తూ... వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడానికి పరోక్ష సహకార మందిస్తున్నాడని చెప్పాడు. ఆ జవాబుతో సంతృప్తి చెందిన భేతాళుడు... మరో రెండు బీరు బాటిళ్ళు చేత పట్టుకుని బాడీని అక్కడే వదిలేసి సమీపాన వున్న సెల్‌టవర్‌ ఎక్కేసాడు.

Read 40 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter