09 March 2018 Written by 

జగన్‌ జోరు.. బాబు బేజారు

chandra'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు. ఇదే సీన్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంది. కేంద్రంలోని బీజేపీ వాళ్ళు చంద్రబాబును దూరంగా వుంచారు. దాంతో ఆయన వారికి దూరం కావాల్సివచ్చింది.

''అత్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు...'' అనే పాత సామెత అందరికీ తెలిసిందే! కేంద్ర కేబినెట్‌ నుండి తెలుగుదేశం మంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలు బయటకొచ్చేసారు. వారు తమ పదవులకు రాజీనామాలు చేసారు. ఏపి విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు కేంద్ర కేబినెట్‌ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ కూడా రాష్ట్ర కేబినెట్‌ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాల రావు కేంద్రమంత్రుల కంటే ముందే తమ పదవులకు రాజీనామాలు చేసేసారు.

చంద్రబాబు ఇంత సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం జగన్‌! ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అతను ఉధృతం చేసాడు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది జగనేనని, ఈ విషయంలో చంద్రబాబు, ఆయన ఎంపీలు డ్రామాలాడుతున్నారన్న విషయం ప్రజలకు అర్ధమైపోయింది. జగన్‌ ప్రత్యేకహోదా

ఉద్యమాన్ని డైవర్ట్‌ చేయడం కోసం మధ్యలో జేఏసీ పేరుతో పవన్‌ కళ్యాణ్‌ను పంపిం చినా అది సక్సెస్‌ కాలేదు. ప్రత్యేక హోదా ఉద్యమం ఢిల్లీ స్థాయికి చేరకుండా, రాష్ట్రంలో చప్పబడిపోయుంటే చంద్రబాబు బీజేపీతో ఎలాంటి పేచీలు పెట్టుకుని వుండేవాడు కాదు. కేంద్ర కేబినెట్‌ నుండి మంత్రులను బయటకు రప్పించేవాడూ కాదు. ఎందుకంటే కేంద్రం ప్రత్యేకహోదా లేదు ప్రత్యేకప్యాకేజీ ఇస్తామన్నప్పుడు చప్పట్లు కొట్టి స్వాగతించింది చంద్రబాబే! ఆ ప్రత్యేకప్యాకేజీ క్రిందే వాళ్ళు నిధులిస్తు న్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగు తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు సమ ర్పిస్తే మళ్ళీ నిధులు ఇస్తామంటున్నారు. కాని కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు వద్ద లెక్కలు లేవు. ఆ నిధులన్నింటిని చంద్రబాబు ప్రభుత్వం తమ ఆర్భాటాల కోసం మళ్ళించింది. వాళ్ళకు లెక్కలు చెప్పాలంటే ఇక్కడ బొక్కలు బయట పడ తాయి. ఈ లెక్కలు ఇవ్వకనే కేంద్రంతో నిధుల పేచీ వచ్చింది. ప్రత్యేకప్యాకేజీ చంద్రబాబు ఒప్పుకున్న సబ్జెక్టే కాబట్టి దీనిని సాకుగా చూపి ఆయన కేంద్ర కేబినెట్‌ నుండి బయటకు రావాల్సిన పనిలేదు.

కేవలం ప్రత్యేకహోదా పోరు క్రెడిట్‌ అంతా కూడా జగన్‌ తన్నుకుపోతున్నాడని, తాను ప్రజల దృష్టిలో విలన్‌ను అవుతున్నా నని గమనించే చంద్రబాబు ఈ మంత్రుల ఉపసంహరణ అంశానికి తెరతీసాడు. అప్పటికీ బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. ఓ పక్క కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అవసరం వున్నా లేకున్నా ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెబుతున్నాడు. చంద్రబాబు మంత్రులు కేబినెట్‌ నుండి వైదొలిగినంత మాత్రాన కేంద్రంలో కదలిక వచ్చి ప్రత్యేకహోదా ఇస్తామని ముందుకొచ్చేదేమీ లేదు. కాబట్టి బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకో వచ్చు. కాని, చంద్రబాబు ఆ సాహసం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మెడపై ఓటు-నోటు కత్తి వేలాడుతోంది. దానిని మళ్ళీ కోర్టు మెట్లెక్కించారంటే చంద్రబాబు పరువు, ప్రతిష్ట పాతాళానికి పోతాయి.

జగన్‌ దెబ్బకు తట్టుకోలేకే మంత్రు లనన్నా ఉపసంహరింపజేసాడు. జగన్‌ అసలు ఉద్యమమే చేయకుంటే చంద్ర బాబుకు అసలు ఈ సమస్యలన్నీ ఉండేవి కావు. కేంద్రం ఇచ్చినవి తీసుకుంటూ, ఆ దేశం ఈ దేశం తిరుగుతూ అమరావతి కథలు చెప్పుకుంటూ హాయిగా ఉండేవాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter