02 March 2018 Written by 

తెలంగాణ సోన... రైతన్నలకు దిగుబడి వాన

telengana sonaప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏ టీవీలో చూసినా ఆరోగ్య విషయా లపై చర్చలే... ఏ ఆసుపత్రి వారు చూసినా ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించే క్యాంపులే! టీవీ చర్చల్లో అయినా, ఆరోగ్య అవగాహనా శిబిరాల్లో అయినా డాక్టర్లు చెప్పేది ఒక్కటే... రైస్‌ తగ్గించండి. ముఖ్యంగా జిలకరమసూరి బదులు మొలగొలుకుల బియ్యం తినండి... జిలకరమసూరి బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనిషిలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని, వివిధ అనారోగ్యాలకు ఇది కారణమవుతుందనే ప్రచారం ఎక్కువుగా వుంది. మరి ఈ ప్రచారం ఉధృతమై జిలకరమసూరి కొనుగోళ్ళు పడిపోతే దానివల్ల నష్ట పోయేది రైతులే!

అందుకే జిలకరమసూరికి ప్రత్యామ్నా యాన్ని ఆలోచించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సోన 15048 ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరి వంగడాలు విస్తృత ప్రచారంలోకి వచ్చాయి. మన రాష్ట్రంలో వీటిని షుగర్‌లెస్‌ బియ్యంగా పిలుచు కుంటారు. 120రోజుల కాల వ్యవధితో ఈ పంట కోతకొస్తుంది. ఎలాంటి తెగుళ్ళ నైనా తట్టుకోగల శక్తివున్న ఈ పంటకు జిలకరమసూరి, ఇతర రకాలతో పోలిస్తే పెట్టుబడి కూడా తక్కువే! తెగులు పట్టినా కూడా దానంతట అదే వదిలించుకుం టుంది. అగ్గితెగులును ఆశించదు. కాబట్టి పురుగుమందులను వాడాల్సిన అవసరమే రాదు. ఎకరాకు రెండు కట్టల కాంప్లెక్స్‌ ఎరువులు వాడాల్సి వుంటుంది. ప్రస్తుతం మనం వేస్తున్న పైర్లకు ఎకరాకు 25 నుండి 30వేలు దాకా ఖర్చవుతుంది. కాని తెలం గాణ సోనకు ఎకరాకు 15వేల నుండి 16వేలు దాకా మాత్రమే పెట్టుబడి అవసరమవుతుంది. మిగతా పంటలకైతే ఎకరాకు 7 నుండి 8కట్టల దాకా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడాల్సి వుంటుంది. 5 నుండి 6సార్లు పురుగు మందులు పిచికారీ చేయాలి. ఇంత పెట్టుబడి పెట్టి కష్టపడ్డా పుట్టి ధర 12వేల నుండి 14వేల మధ్యే వుంది. అదే తెలంగాణ సోన అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. సాధారణ రకాలతో పోలిస్తే ఎకరాకు 20వేల దాకా అదనపు రాబడి వుంటుంది. రసాయనాలు వాడని పంట కాబట్టి ప్రజలకు వీటి వాడకం వల్ల ఎటువంటి అనారోగ్యం ఉండదు.

రైతుల్లో అవగాహన తేవాలి - కొర్రపాటి మురళీనాయుడు

అటు రైతులకు ఆదాయం, ఇటు ప్రజలకు ఆరోగ్యం అందించే వరి వంగడం తెలంగాణ సోన. ఇది రైతులకు మేలు చేకూర్చే పంట. ఈ పంటపై వ్యవసాయాధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలి. సొసైటీల ద్వారానే రైతులకు విత్తనాలు అందించాలి. ఈ పంటను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసిపి రైతు విభాగం జిల్లా కన్వీనర్‌ కొర్రపాటి మురళీనాయుడు కోరుతున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • అమ్మో... దొంగల ముఠా
    కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter