09 February 2018 Written by 

09-02-2018 రాశిఫలాలు

rasi 09

1Ariesమేషం

అభినందనలు తెలియజేయడం, విందు వినోదము లలో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించండి. అనవసర సంఘర్షణలు వద్దు. విలువైన వస్తువులను సమకూర్చు కొంటారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు రావడం ప్రారంభ మవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాగలవు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయ వృద్ధి బాగుంటుంది.

 

2Taurusవృషభం

క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, బాకీల సమస్యలు కొంతవరకు పరిష్కారం కాగలవు. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం ఆశించినంత ఉండదు. ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజన కంగా ఉంటుంది. వృత్తి జీవనం కలవారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది.

 

3Geminiమిధునం

ఉద్యోగులు తమ పైఅధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని దూరప్రయాణాలుంటాయి. శరీరానికి గాయాలు తగలవచ్చును. ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరకగలవు. సంప్రదింపులు, అగ్రిమెంట్‌ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తాలలో పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు చేయొద్దు.

 

4Cancerకర్కాటకం

కుటుంబసభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలుండ వచ్చును. నిర్మాణాలు, కార్మిక కాంట్రాక్టుదారులు వర్క్‌ లతో ఇబ్బందిపడతారు. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగార్ధులకు అవ కాశాలు లభించగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుం టాయి. బంధువులతో, సోదరులతో సమస్యలు సర్ధుబాటు చేసికొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

 

5Leoసింహం

స్థిరాస్థుల లావాదేవీలు ప్రస్తుతం చేయవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. షేర్లు నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపార రంగాలలో ఆదాయం సామాన్యం. ఖర్చులు పెరగకుండా చూచుకొనాలి. వ్యాపార అవకాశాలు సరైనవి లభించవు. అవసరాలకు ఋణం చేయవలసిరావచ్చును.

 

6Virgoకన్య

శుభకార్యాల ప్రయత్నాలలో అనుకూలత ఉం టుంది. రావలసిన బాకీలు కొంత లభించడం, మంచి వార్తను వినడం జరుగుతుంది. కుటుంబసౌఖ్యముం టుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. అనుకున్న పనులకు చిన్న ఆటంకాలు కలిగి టెన్షన్‌ పెడుతుంటాయి. దూరప్రయాణాలుంటాయి.

 

7Libraతుల

కొత్త విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. స్థిరాస్తుల లావాదేవీలందు అనుకూల పరిస్థితులుంటాయి. బంధుముఖ్యులు ప్రముఖులను కలుసుకొంటారు. విద్యా వృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులను జరుపుతారు. అవసరాలకు రావలసిన డబ్బు లందుతాయి. వ్యవసాయ, పారిశ్రామిక వర్గాలు కొత్త పథకాలతో అభివృద్ధి చెందుతాయి.

 

8Scorpioవృశ్చికం

చేపట్టిన పనులు సానుకూలం కాగలవు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతలతో సామర్ధ్యము, స్థాన మార్పులుంటాయి. ముఖ్య విషయా లలో పెద్దల సలహాలను స్వీకరిస్తే మేలు జరుగుతుంది. రావలసిన బాకీలు పరిష్కారం కావడం, కోర్టు కేసులందు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యో గార్ధులకు ఆహ్వానాలు లభిస్తాయి.

 

9Sagittariusధనుస్సు

యజమానులకు వర్కర్లతో సమస్యలు రావచ్చును. స్థిరాస్తుల లావాదేవీలు ప్రక్కన పెట్టండి. సభలు సమా వేశాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు మంచి అవకా శాలు లభిస్తాయి. షేర్‌మార్కెట్‌ ప్రోత్సాహకరంగా ఉం టుంది. ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం. అనుకోని ఆదాయం కొంత లభిస్తుంది. వృత్తి వ్యాపారా లలో ఆర్ధికస్థితి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. అను కున్న పనులు జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగయత్నాలలో అనుకూ లత బాగుంటుంది. కొత్త వస్తువులు సమకూర్చుకొంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. వృత్తి పరంగా సామాన్య ఆదాయం ఉంటుంది. వ్యాపార వర్గాలు ఆటంకాలను అధిగమించుతారు. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది.

 

11Aquariusకుంభం

దైవ, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అను కున్న పనులు కార్యక్రమాలు తొందర తొందరగా పూర్తి చేయగలరు. ఉద్యోగులకు పనిభారం శ్రమ పెరుగు తుంది. వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. అనవసర వ్యవహారాలలో తలదూర్చకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికపరమైన ఇబ్బందులుంటాయి. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు లభించగలవు. అనుకోని ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో ప్రముఖపాత్ర నిర్వహిస్తారు. పనులు సక్రమంగా జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల మీద కొంత ఆదాయం లభిస్తుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండి అభివృద్ధి బాగుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter