Friday, 02 February 2018 14:08

రిపబ్లిక్‌ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నెల్లూరు టెర్రర్స్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని ఎర్రకోట మైదానం. రిపబ్లిక్‌డే వేడుకలు మొదలు కాబో తున్నాయి. అతిథులందరూ చేరుకుం టున్నారు. అలవాటులో పొరపా టుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విఐపి బ్లాక్‌లో మొదటి వరుస కుర్చీలలో కూర్చున్నాడు. అంతలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆసి యాన్‌ దేశాలైన సింగపూర్‌, మలే షియా, ఇండోనేషియా, థాయ్‌ లాండ్‌, మయన్మార్‌, తదితర దేశాల అధినేతలు వచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెంటనే రాహుల్‌ వద్దకొచ్చి... సార్‌, ఈ వరుస ఆసియాన్‌ దేశాల ప్రతినిధు లకు కేటాయించాం, వాళ్ళను గౌర వించడం మన ధర్మం, మీరు వెనుక వరుసలో కూర్చోండి అని చెప్పాడు. రాహుల్‌ ఏమీ మాట్లాడకుండా రెండో వరుసలో కూర్చున్నాడు. కొద్దిసేపటికి మాజీప్రధానులు, మాజీ ఉపరాష్ట్ర పతులు, మాజీప్రధాన న్యాయమూ ర్తులు వచ్చారు. రాజ్‌నాథ్‌సింగ్‌ రాహుల్‌ వద్దకెళ్ళి సీనియర్లను గౌర వించడం మన ధర్మం, మీరు మూడో వరుసలో కూర్చోమన్నాడు. రాహుల్‌ అలాగే చేసాడు. కొద్దిసేపటికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, చీఫ్‌ విజి లెన్స్‌ కమిషనర్‌ తదితరులొచ్చారు. రాజ్‌నాథ్‌సింగ్‌ రాహుల్‌ వద్దకు వస్తుం డగా ఆయనే లేచి... మీకేం శ్రమక్కర లేదు, నేను వెళ్ళి చివర వరుసలో కూర్చుంటాను. అక్కడకూడా ఎవ రన్నా వున్నారంటే చెప్పండి విజిటర్స్‌ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చుంటాన న్నాడు. ఇప్పుడు కరెక్ట్‌గా లైన్‌లోకి వచ్చారు. చివరి వరుసలో మాకెటు వంటి ఇబ్బంది లేదు. అక్కడ నుండి మిమ్మల్ని లేపం, కావాలంటే రాసి స్తాను అని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చాడు. దాంతో రాహుల్‌ వెళ్ళి చివరి వరు సలో కూర్చున్నాడు. అంతలో రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వచ్చారు. సైనిక గౌరవవందనాల మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆసియాన్‌ దేశాల ప్రతినిధులు ఆ వేడుకలను తిలకి స్తూనే తలలు అటు ఇటు తిప్పుతూ ఎవరి కోసమో చూడసాగారు. సాం స్కృతిక కార్యక్రమాల అనంతరం... సైనిక పాటవ ప్రదర్శన మొదలైంది. ఒకే బైక్‌ మీద 30మంది మహిళా సైనికుల విన్యాసం, అగ్ని, పృధ్వి క్షిప ణుల ప్రదర్శన, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకుల ప్రదర్శన, ఎన్‌ఎస్‌జి కమాండోల ప్రదర్శన, వైమానిక దళ ప్రదర్శన, ఇలా ఒక్కొ క్కటిగా సాగాయి. అన్నింటిని చూసి ఆసియాన్‌ దేశాల ప్రతినిధులు చప్పట్లుకొట్టారు. అలా కొడుతూ కూడా వాళ్ళు తలలు అటు ఇటూ తిప్పుతూ ఎవరి కోసమో చూడసా గారు. మోడీ దానిని గమనించాడు. అయినా ఎందుకోలే అని ఊరుకు న్నాడు. అంతలో మైక్‌ అనౌన్స్‌ మెంట్‌... మీరు ఇంతవరకు చూసిన సైనిక విన్యాసాలు, ఆయుధ సంపత్తి ఒక ఎత్తు... ఇప్పుడు చూడబోయే భారత జీవాయుధ దళం శక్తి సామ ర్ధ్యాలు మరోఎత్తు. కళ్ళార్పకుండా చూడండి... ఒక్క క్షణం కన్నార్పినా ఒక అద్భుతాన్ని మిస్‌ అవుతారు. రెడీ వన్‌... టూ... త్రీ అనగానే అందరి కళ్ళ ముందు నుండి 'జుమ్‌' అంటూ పెద్ద సౌండ్‌తో రాకెట్‌ కన్నా వేగంతో గాల్లోనే ఒక దళం దూసుకుపో యింది. అది ఏమైంది ఎవరికీ అర్ధం కాలేదు. ఆసియాన్‌ దేశాల ప్రతినిధుల కైతే తల తిరిగినంత పనైంది. తమ కళ్ళముందే అరసెకండ్‌ కూడా కని పించకుండా పోయిన ఆ దళం ఏంటి? ఇంత శక్తివంతమైన దళం శత్రుదేశాల మీద దాడి చేస్తే ఇంకే మైనా ఉందా? అసలు ఈ దళం కథా కమామిషు ఏంటి? తెలుసుకోవాలను కున్నారు. ఆ విషయాన్నే మోడీని అడిగారు. దానికాయన బదులిస్తూ... ఈ దళాన్ని మేము ఐఆర్‌ 20-420 నెల్లూరు టెర్రర్స్‌గా పిలుస్తాం. ఇవి భూమ్మీద రాక్షస బల్లులు తిరిగిన కాలం నాటి దోమలు. అప్పట్లో రాక్షసబల్లులు అంతరించిపోవడానికి ఈ దోమలే కారణమని జీవశాస్త్ర నిపు ణులు తమ పరిశోధనలలో తేల్చారు. అంతరించిపోయిన ఇలాంటి జీవ రాశి ఆచూకీ మళ్ళీ నెల్లూరు నగ రంలో లభించింది. అక్కడి కార్పొ రేషన్‌ పుణ్యమా అని ఈ జీవరాశిని అభివృద్ధి చేసి మేము ఒక దళంగా ట్రైనింగ్‌ ఇచ్చాం. ఈ దళాన్ని ఏ దేశం మీదకు వదిలినా సరే... ఏడా దిలో ఆ దేశాన్ని నాశనం చేయగ లవు. ఆ దేశ ప్రజలు నిత్యం రోగా లతో ఛస్తూ బ్రతకాల్సిందే అని చెప్పాడు. మరి ఇంత శక్తివంతమైన దళాన్ని పెట్టుకుని మీరు చైనా, పాకి స్థాన్‌లను ఎందుకు ఉపేక్షిస్తున్నారని సింగపూర్‌ ప్రధాని లీ సెన్‌ లూంగ్‌ అడిగాడు. దానికి మోడీ... మేం అహింసావాదులం, మహాత్ముడు, గౌతమబుద్ధుడి వారసులం. అందుకే జాలి, దయతో వారిని వదిలేస్తున్నాం. అది సరేగాని మీరు చాలాసేపటి నుండి అటు ఇటు చూస్తున్నారు, ఎవరి కోసం అని అడిగాడు. దానికి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ వుండి... చంద్రబాబు గారి కోసం. ఆయన అమరావతి పేరుతో మూడే ళ్ళలోనే అద్భుత నగరాన్ని నిర్మించా డట కదా! ఆయన ఇక్కడకు వస్తా డేమో, ఆయనతో పాటు వెళ్ళి అమరావతిని చూడాలనుకుంటు న్నామని చెప్పాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అమిత్‌షా... ఓహో! అమరా వతి టీజర్‌ మీక్కూడా చూపించాడన్న మాట. మేం నాలుగేళ్ళ నుండి ఆ టీజర్‌నే చూస్తున్నాం, టీజర్‌ తప్ప అక్కడ సినిమా లేదు. ఇదిగో ఈ సి.డి తీసుకెళ్ళి చూసుకోండి... అమరావతి అంతా దీనిలో వుందని చెప్పాడు. ఈ సిడిలో ఏముందని థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయూట్‌ చాన్‌ ఓ చా అడిగాడు. ఈ సి.డిలోనే అమరావతి రాజధాని గ్రాఫిక్స్‌ వున్నాయని చెప్పి అమిత్‌షా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

Read 28 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter