Thursday, 23 November 2017 17:20

విదేశాలలో ఉన్నా... మేయరేనా?

Written by 
Rate this item
(0 votes)

mayor mukkalaఒక జిల్లా కలెక్టర్‌ రెండు వారాల పాటు సెలవుపై వెళుతుంటే జాయింట్‌ కలెక్టర్‌కు ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ బాధ్యతలు అప్పగిస్తారు. ఒక డి.ఇ.ఓ 15రోజులకుపైగా సెలవుపెడితే డిప్యూటీ డిఇఓకు బాధ్యతలు ఇస్తారు. ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యరీత్యానో, న్యాయ వివాదాల కారణంగానో ఆ కుర్చీకి దూరంగా ఉండాల్సి వస్తే ఉప ముఖ్యమంత్రికో లే ఎవరో ఒక మంత్రికి ఇన్‌ఛార్జ్‌ సీఎం పనులు అప్పజెబుతారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు కూడా ఇంతే.

నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్‌కు ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. అనుకోని పరిస్థితుల్లో మేయర్‌ ఎక్కువ రోజులు అందుబాటులో లేనప్పుడు, లేదా అతను ఇంకో పదవిలోకి పోయి మేయర్‌ పదవికి రాజీనామా చేసినప్పుడు డిప్యూటీ మేయరే ఇన్‌ఛార్జ్‌ మేయర్‌గా వ్యవహ రించాల్సి వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డిప్యూటీ మేయర్‌ను రిజర్వ్‌ మేయర్‌ అనుకోవచ్చు.

నెల్లూరు నగరపాలక సంస్థలో ఆ పద్ధతులను తుంగలో తొక్కుతూ తన ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌. జిహెచ్‌ఎంసి చట్టాల ప్రకారం మేయర్‌ 15రోజులకు పైగా విధులకు దూరంగా వుంటే డిప్యూటీ మేయర్‌కు మేయర్‌ అధికారాలు సంక్ర మిస్తాయి. డిప్యూటీ మేయరే కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయొచ్చు. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈనెల 1 నుండి నెల్లూరులో లేడు. వ్యాపారాల రీత్యా లండన్‌కు వెళ్ళినట్లు సమాచారం. అయితే తాను ఇన్నిరోజులు నెల్లూరులో ఉండనని అధికారికంగా ప్రకటించలేదు. అంటే మేయర్‌ కుర్చీలో తానున్నానన్నట్లే కవర్‌ చేస్తూ వచ్చాడు. అయితే మేయర్‌ 20రోజులకు పైగా అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ జిఎంహెచ్‌సి చట్టాన్ని తెరమీదకు తెచ్చాడు. మేయర్‌ అందుబాటులో లేనందున తనకు అధికారాలు అప్పగించాలని కమిషనర్‌కు లేఖ వ్రాసారు. మేయర్‌ అజీజ్‌ తాను ఎక్కడకు పోతున్నదీ, ఎన్నిరోజులు కార్పొరేషన్‌ ఆఫీసుకు రాకుండా ఉండేది కమిషనర్‌కు చెప్పలేదు. దీనికితోడు మేయర్‌ అజీజ్‌ అమెరికాలో తన మిత్రులతో కలిసి వున్న ఫోటోలను డిప్యూటీ మేయర్‌ ద్వారకానాథ్‌ మనుషులే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, సెల్‌ఫోన్‌లలో ఆ ఫోటోలు వైసిపి నాయకులకు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయ్యింది. మేయర్‌ ఇండియాలో లేడన్న పక్కా సమాచారం అందడంతో, ఈ నెల 30న డిప్యూటీమేయర్‌ ద్వారకానాథ్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి అధికారపార్టీ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. ఇరువర్గాల మధ్య పోరుతో కమిషనర్‌ ఇరకాటంలో పడ్డాడు. ఈ వివాదం పరిష్కారం కోసం ఆయన చట్టం, న్యాయం దారులు వెదుకుతున్నట్లు తెలుస్తోంది.

Read 372 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter