23 November 2017 Written by 

అభివృద్ధీ... నీ అడ్రస్‌ ఏదీ?..

abhivrudhiఅధికారపార్టీ నాయకుల మాటలేమో కోటలు దాటుతున్నాయి. అభివృద్ధి మాత్రం ఇంటి గుమ్మం కూడా దాటటం లేదు. అభివృద్ధి గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప ఆచరణలో సాధించింది శూన్యం.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో అభివృద్ధి నిరాశాజన కంగా వుంది. వివిధ రంగాలను అభివృద్ధి పరిచే దిశగా ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా దివంగత నేత వై.యస్‌.రాజ శేఖరరెడ్డి హయాంలో జిల్లాలో పారి శ్రామిక ప్రగతికి పునాది వేశారు. అంతకు ముందు జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ ఉండేది కాదు. కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్‌ మిల్లు వంటివి మూతే యడం తెలిసిందే! వై.యస్‌. వచ్చాక మొదట నిస్తేజంగా వున్న కృష్ణపట్నం పోర్టుకు ప్రాణం పోశాడు. పోర్టును నత్తనడకతో చేస్తున్న నాట్కో కంపెనీ నుండి తీసి నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి అప్పగించడంతో పరుగులు పెట్టింది. 2009కల్లా ప్రారంభమైంది. మాంబట్టు సెజ్‌, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌, అంకుల పాటూరు, రాచర్లపాడు ఇఫ్కోసెజ్‌ వంటివి శరవేగంగా రూపుదిద్దుకున్నాయి. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వీటి ద్వారానే ఉపాధి అవకాశాలు లభిం చాయి. తెలుగుదేశం వచ్చాక అభివృద్ధిలో ఎలాంటి ఊపు లేకపోగా, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు కూడా లేవు. ఈ మూడున్నరేళ్లలో ఇఫ్కో సెజ్‌లో పవన విద్యుత్‌ పరికరాల సంస్థ రావడం తప్పితే జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ రాలేదు. కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా ఈ జిల్లాకు ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చే అవకాశం వున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపిన దాఖలాలు లేవు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక ఇండస్ట్రియల్‌ పాలసీని తీసుకురాలేదు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాక పోవడం కూడా జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బ్రేకులు వేసిందని చెప్పవచ్చు.

పరిశ్రమల పరంగా జరిగిన అభివృద్ధి నామమాత్రం. ఇరిగేషన్‌లో ఏమన్నా పొడి చారా అంటే... నెల్లూరు, సంగం బ్యారేజీ లను ఇంతవరకు పూర్తి చేయలేదు. ఈమధ్య కండలేరు ఎత్తిపోతలను ప్రారం భించి కొంత బెటరనిపించారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వపరంగా జిల్లాలో ఈ అభివృద్ధి పని జరిగింది అని చెప్పు కోవడానికి ఒక్కటీ లేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter