23 November 2017 Written by 

ప్రభాకరుని ప్రాభవం... ఏ పార్టీకో వైభవం..!?

vprవిపిఆర్‌... అంటే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. జిల్లాలోనే కాదు, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ప్రస్తుతం ఆయన టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌. ఆయన రాజకీయవేత్త కాదు, ఆయనది రాజకీయ కుటుం బమూ కాదు, అసలు ఆలోచిస్తే నేటి రాజకీయాలకు సరిపడే మనస్తత్వమూ కాదు. కాని, ఇప్పుడు అన్ని పార్టీల చూపు ఆయన వైపే వుంది. అందుకు కారణం... ఆయన సేవా ప్రభాకరుడు. ఆపదలో వున్న వారిని ఆదుకోవ డమే ఆయనకు తెలిసింది. కష్టాలలో వున్న వారి కన్నీళ్ళు తుడవడమే ఆయన నేర్చుకుంది. అనాధలకు ఆయన ఆపద్భందువు, పేదోళ్ళకు ఆయన కనిపించే దైవం. ఆథ్యాత్మిక రంగంలో ఆయన ఓ మణిదీపం. ఆయన లక్ష్యాలను, లక్షణాలను గమనిస్తే ఆయన ఓ అరుదైన వ్యక్తిత్వం కూడిన మానవతావాది. సున్నిత మనస్తత్వం కలిగిన మహామనీషి.

అందుకే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆయన వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇటు అధికారపక్షం తెలుగుదేశం, అటు ప్రతిపక్షం వై.సి.పి లు రాజ్యసభ కిరీటంతో ఆయనను సత్కరించాలనుకుంటుంటే... పిల్లి పిల్లి తగవు కోతి తీర్చినట్లుగా బీజేపీ కూడా ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆయనను ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

రాష్ట్రం నుండి త్వరలో ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య బట్టి తెలుగుదేశంకు రెండు, వైసిపికి ఒకటి రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. వైసిపి నుండి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గోడదూకితే మూడో స్థానం కూడా టీడీపీకే పోవచ్చు. కాకపోతే గుజరాత్‌లో ఇటీవల నిర్వహించిన రాజ్యసభ ఎలక్షన్‌లో అది సాధ్యం కాలేదు. ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే దానిపై తక్షణ చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించింది. కాబట్టే మొన్న గుజరాత్‌లో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ను రాజ్యసభకు పోకుండా అడ్డుకోవాలని చూసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రయత్నాలు ఫలించలేదు. కాబట్టి ఇదే పద్ధతి ఏ.పిలోనూ ఉంటుంది. వైసిపికి ఒక రాజ్యసభ సీటుకు వచ్చే ఢోకా ఏమీ లేదు. తమ కొచ్చే ఒక్క రాజ్యసభ సీటును వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వడానికి వైసిపి నాయకత్వం సిద్ధంగా ఉంది. ఈమేరకు పార్టీలో చేరమని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ లాంటిది జరిగి ఊహించని పరిణామాలు ఏవైనా జరిగినా 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ ఇస్తామని హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. విపిఆర్‌ వైసిపిలో చేరితే జిల్లాలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని ఊహించిన తెలుగుదేశం నాయత్వం ఆయనను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశంకు గ్యారంటీగా రెండు రాజ్యసభ స్థానాలు వస్తాయి. మూడోదానికి పోటీ పెట్టి వైసిపి ఎమ్మెల్యేలను కొనాల్సి వుంటుంది. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయే పరిస్థితిని వేమిరెడ్డి కోరుకోడు. వేమిరెడ్డి అంగీకారం తెలిపితే మొదటి ఇద్దరు అభ్యర్థులలోనే ఆయనను పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. తమ తమ పార్టీలలో చేరమని రెండు పార్టీలు కూడా ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో విపిఆర్‌ లాంటి సేవా తపస్వి తమ పార్టీలో వుంటే జాతీయ స్థాయిలో సైతం తమ పార్టీకి కూడా ఓ ఇమేజ్‌ వుంటుందన్న ఆలోచనలో భారతీయ జనతాపార్టీ వున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పెద్దలనుకుంటే దేశంలో ఎక్కడినుండైనా విపిఆర్‌ని రాజ్యసభకు పంపొచ్చు. ఆ దిశగా కూడా బీజేపీ శ్రేణులు రంగంలో దిగినట్లు సమాచారం.

కాని, నిర్ణయం తీసుకోవాల్సింది, తన ఆశయాల సాధనకు సరైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాల్సింది ఆయనే! ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేస్తున్న పార్టీ ఏది, అవినీతి, అక్రమాలు చేస్తున్న పార్టీ ఏది అన్నది కూడా చూడాలి. ఏ పార్టీ పట్ల, ఏ నాయకుడి పట్ల జనం అభిమానంతో వున్నారు, లేదా వ్యతిరేకతతో వున్నారు అన్నది కూడా చూడాలి. మరీ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లాంటి నిస్వార్ధ సేవకులను రాజ్యసభకు పంపాలని ప్రజలు కోరుకోవడం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయాలని, తమ మధ్యే వుండాలని, తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. పార్టీ ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఆయన రావాలన్నది జన వాక్కు. మరి ఆయన ఎవరి నిర్ణయాన్ని గౌరవిస్తాడో, ఏ పార్టీ ఆహ్వానాన్ని ఆదరిస్తాడో... ఇక రోజులు లేదా నెలల్లోనే తేలిపోతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter