16 September 2017 Written by 

దుగరాజపట్నం పోర్టు... చించేసిన చీటీకి పాకులాట!

dugrajమొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని, దుగరాజపట్నం పోర్టు అన్నది కేంద్రప్రభుత్వం చించేసిన చీటీ! ఈ ఫైల్‌ను పక్కనపడేసింది. ఇస్రో, పర్యాటక శాఖ అభ్యంతరాలతో పాటు ఇక్కడ పోర్టు పెట్టినా పెద్దగా లాభముండదని సర్వే నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోర్టు ఫైల్‌ను అటకెక్కించారు.

జిల్లాలో కృష్ణపట్నం పోర్టు వుంది. మొత్తం 41 బెర్త్‌ల నిర్మాణం లక్ష్యం. ఇప్పటికి 13 బెర్త్‌లు పూర్తయ్యాయి. ఆ పూర్తయిన బెర్త్‌లకే సరిగా వ్యాపారం లేదు. బళ్లారి, అనంతపురంల నుండి ముడి ఇనుపఖనిజం రవాణా ఆగిపోవడం పోర్టుకు పెద్ద షాక్‌. ఇటీవల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు కూడా అంతంత మాత్రంగా వున్నాయి. విదేశాల నుండి బొగ్గు దిగుమతులు కష్టంగా వున్నాయి. పోర్టుకు ఈ రెండూ ప్రధాన ఆధారం. ఆ రెండూ ఆగిపోయాయి. ఇటీవల గ్రానైట్‌, యూరియా, కంటైనర్‌ వ్యాపారం పెరగబట్టి సరిపోయింది. లేకుంటే పోర్టులో కట్టి వున్న ఆ బెర్త్‌లు కూడా ఖాళీగానే వుండేవి. జిల్లాలోకి కొత్తగా భారీ పరిశ్రమలు వస్తే పోర్టుకు వ్యాపారం ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. పరిశ్రమలు పెద్దసంఖ్యలో వచ్చి ఎగుమతులు, దిగుమతులు ఎక్కువై ఇప్పుడున్న పోర్టు సరిపోకపోతే జిల్లాలో ఇంకో పోర్టుకు అవకాశముంటుంది. జిల్లాలో గత 5ఏళ్ల నుండి ఒక్క పరిశ్రమ లేదు. పారిశ్రామికంగా ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటప్పుడు పోర్టులు కట్టుకొని ఏం లాభం. బస్సులు రాని ఊరిలో బస్టాండ్‌ కట్టినట్లుగా వుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter