07 September 2017 Written by 

ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌

pipesచేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు.

కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై జరుగుతున్న పనులను చూస్తే రైతులకు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారనిపిస్తోంది. సంగం ఆనకట్ట వద్ద నుండి మొదలయ్యే కనుపూరు కాలువ నెల్లూరురూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ నుండీ వెళుతుంది. శ్రామికనగర్‌లో కాలువకు అటు ఇటు నివాసాలున్నాయి. ఇటీవల పదేసి లక్షల వ్యయంతో కాలువపై అటు ఇటు పోవడానికి వీలుగా రెండు వంతెనలు నిర్మించారు. వీటివల్ల కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బందేమీ లేదు. ఇటీవల శ్రామికనగర్‌లోనే ఓపెన్‌ ఎయిర్‌ జైలుకు వెళ్ళే మార్గంలో కాలువకు పైపులైన్‌లు వేసి దారి ఏర్పాటు చేస్తున్నారు. పైపు లైన్‌ల వల్ల నీళ్ళు బ్లాకయ్యే పరిస్థితి వుంది. నెల్లూరురూరల్‌ పరిధిలోని అంబాపురంలోని మూడు చెరువులకు అక్కపాడు చెరువుకు కనుపూరు కాలువ ద్వారానే నీళ్లందుతాయి. ఈ నాలుగు చెరువుల క్రింద 600 ఎకరాల ఆయకట్టు వుంది. ఈ పైప్‌లైన్ల వద్ద నీళ్లు బ్లాక్‌ అయితే చెరువులకు నీళ్లు రాక ఆయకట్టు రైతులు ఇబ్బందిపడే పరిస్థితి వుంది.

కాబట్టి పైప్‌లైన్ల బదులుగా కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter