07 July 2017 Written by 

07-07-2017 రాశిఫలాలు

rasi 07

1Ariesమేషం

శుభకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఉద్యో గార్ధులకు అవకాశాలు కలిసివస్తాయి. కొత్త వసతులు సమకూర్చుకుంటారు. రాజకీయవర్గాలకు ఇబ్బందికర దినములివి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి రాబడి పెరుగుతుంది. అవసరాలు ఏదో ఒక విధంగా నెరవేరగలవు. అయితే ఆర్ధిక స్తబ్ధత ఉంటుంది. రావల సిన బాకీలు నిలబడిపోతాయి.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు బాగా శ్రమ, పనిభారం ఉంటుంది. ఉద్యోగావకాశాలు లభించగలవు. కుటుంబ సౌఖ్యము, విద్యాప్రగతి బాగుంటుంది. వస్తు వాహన రిపేర్లుండ గలవు. శుభకార్య ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తారు. ఆరోగ్యం ఫరవాలేదు. ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. పలుకు బడి బాగుండి అనుకున్న పనులు జరిగిపోతాయి.

 

3Geminiమిధునం

దూర ప్రయాణాలు, సామాజిక సేవా కార్యక్రమా లకు వెళ్తారు. ఉద్యోగులు అధికారులతో, పబ్లిక్‌తో జాగ్రత్తగా ఉండాలి. యజమానులు వర్కర్లతో జాగ్రత్త పడండి. విద్యాప్రగతి బాగుంటుంది. రాజకీయ వర్గాల వారు విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఆటంకాలు తొలగి సవ్యంగా జరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది.

 

4Cancerకర్కాటకం

విద్యాప్రగతి బాగుంటుంది. ఇతరుల పనులు చేయబోయి ఇబ్బందుల్లో పడతారు. బిడ్డల వివాహ ఉద్యోగ విషయాలలో శుభవార్త వింటారు. కొత్త కాంట్రాక్టులు, లీజులు లభించగలవు. కోర్టు వ్యవహారాలు, రావలసిన బాకీలు వాయిదా పడతాయి. ఆర్ధిక ఇబ్బందు లుంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పంతాలు పట్టుదలకు పోకుండా పనులు జరుపుకోవాలి.

 

5Leoసింహం

ఋణాలివ్వడం, హామీలివ్వడం చేయవద్దు. కుటుంబ సౌఖ్యము బాగుంటుంది. పనులు నిదానంగా జరుగుతూ టెన్షన్‌ కలిగిస్తాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. అనవసర విషయాలు, కుటుంబ వ్యక్తుల పనులు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ ఖర్చులు సమ తుల్యంగా ఉంటాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువుకై శ్రమిస్తారు.

 

6Virgoకన్య

అనవసర విషయాలలో శ్రద్ద చూపవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకుతాయి. షేర్లు, స్థిరాస్తుల మీద ఆదాయం ఉంటుంది. కుటుంబసౌఖ్యం, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు పని భారం అధికారుల వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్య ఆర్ధిక లావాదేవీలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు అయినవి అనిపిస్తారు.

 

7Libraతుల

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు కేసులు, రావలసిన బాకీలు వాయిదా పడతాయి. ఉద్యో గార్ధులకు అవకాశాలు లభించగలవు. విలువైన వస్తు వులు, పత్రాలు జాగ్రత్త. తొందరపడి అతిగా విశ్వసించి ఇబ్బందులు పడతారు. విద్యా కృషి అవసరం. ఖర్చుల తాకిడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల పనుల వల్ల ఇబ్బందులు పడతారు.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. సామాజిక సేవ, సమావేశాలలో పాల్గొంటారు. ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితులుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవ కాశాలు, అనుకోని దూరప్రయాణాలు కోర్టు వ్యవహా రాలు వాయిదా పడటం ఉంటుంది. వ్యవహారాలు ఇంట బయట స్వయంగా పర్యవేక్షించండి.

 

9Sagittariusధనుస్సు

కుటుంబసభ్యుల సహకారం, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. సమస్యలను రాజీ మార్గంలో పరిష్కరించుకుంటే మంచిది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కొత్త కాంట్రాక్టులు, లీజులకు అను కూలత బాగుంది. ఆర్ధిక ఇబ్బందులుండినా డబ్బులు సర్దుబాటు కాగలవు.

 

10Capricornమకరం

ఉద్యోగులకు పనిభారం, వత్తిడి ఎక్కువగా ఉం టుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వస్తు, వాహన రిపేర్లుంటాయి. శుభకార్యాలు, సమావేశాలలో పాల్గొం టారు. ఆరోగ్యం జాగ్రత్త. కార్యనిర్వహణ సామర్ధ్యం బాగుండినా జరుపదలచిన పనులకు ఆటంకాలుండ గలవు. అందుచే కోపం టెన్షన్‌ ఎక్కువుగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.

 

11Aquariusకుంభం

అనుకున్న పనులు టెన్షన్‌తో జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంది. అనుకోని ప్రయాణా లుండటం, శుభవార్తలు వినడం, పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు అవకాశాలు దొరకడం ఉంటుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆర్ధికంగా పరిస్థితులు సంతృప్తికరం. స్థిరాస్తులు, షేర్ల మీద ఆదాయం ఉం టుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

12Piscesమీనం

ఉద్యోగావకాశాలు లభించగలవు. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యసామర్ధ్యం, అధికారుల ఆదరణ బాగుంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రభుత్వ అనుమతులు లభించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. వృత్తి వ్యాపా రాలలో మంచి అభివృద్ధి, రాబడి ఉంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter