07 July 2017 Written by 

మద్యానికి కటకట

bar katakataమండు వేసవిలో జనం మంచినీళ్ళ కోసం కటకటలాడుతున్నారంటే అర్ధ ముంది. బోర్ల ముందు, ట్యాంకర్ల ముందు బిందెలతో క్యూ కట్టారంటే అర్ధముంది. మరి టీ షాపుల కంటే బెల్టు షాపులు, ఫ్యాన్సీ షాపుల కంటే వైన్‌షాపులు ఎక్కు వుగా వున్న ఈ రాష్ట్రంలో మందుబాబులు మద్యానికి కటకటలాడడమేమిటి? ఈ సందేహం అందరికీ రావచ్చు. కాని ఈ నెల 1, 2, 3తేదీలలో మందుబాబులు మద్యం కోసం అలాగే కటకటలాడిపోయారు.

జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలులోకి రావడం జరిగింది. జిల్లాలో 349 వైన్‌షాపులు, 43 బార్‌లు వున్నాయి. మూడు నెలల క్రితమే మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించడం జరిగింది. అయితే కొత్త వైన్‌షాపులు, బార్లకు సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రతిబంధకంగా మారాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు అరకిలోమీటరు దూరంలో వైన్‌షాపులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గుడి, బడి, ఆసుపత్రుల విషయంలోనూ నిబంధనలు పాటించాలని సుప్రీం గట్టిగానే చెప్పింది. సుప్రీంకోర్టు నిబంధనలను తూ.చ తప్పకుండా పాటిస్తే మద్యం వ్యాపారులు ఎత్తిపోతారని భావించి, వారిపట్ల జాలి చూపించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 42కిలోమీటర్లు జాతీయ, రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారిగా డీనోటిఫై చేసింది. అయినా లాటరీ తగిలిన వాళ్లెవరూ 1వ తేదీ దుకాణాలు తెరవలేదు. జిల్లా వ్యాప్తంగా వైన్‌షాపులు మూత పడడంతో మద్యం కోసం మందుబాబులు అర్రులుచాచారు. ఫలానాచోట మద్యం అమ్ముతున్నారని ఎవరన్నా అంటే చాలు... అటువైపు పరుగులు తీసారు. ఈ రెండురోజులు మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మద్యాన్ని స్టాక్‌ పెట్టుకున్న వాళ్లు వాటిని రెండింతల ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter