07 July 2017 Written by 

ఓట్లకు నోట్ల వర్షమే?

cashఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడలేదు. నామినేషన్ల తేదీ, పోలింగ్‌ తేదీలు తెలియదు. కౌంటింగ్‌ తారీఖు చెప్పలేదు. కాని రేపే ఎలక్షన్‌ అన్నంతగా నంద్యాలలో టెన్షన్‌ నెలకొంది. నంద్యాల ఉపఎన్నిక ఆషామాషీగా జరిగేటట్లు లేదు. ఓ పక్క అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలిచి తీరా లన్నట్లు పంతం పట్టింది. మరోపక్క నంద్యాలను గెలిచి రేపటి జైత్రయాత్రను ఇక్కడనుండే ఆరంభించాలని వైకాపా పట్టుదలగా వుంది.

ఇక్కడ ఇరుపార్టీలకు అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. తెలుగుదేశంకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపాకు శిల్పా మోహన్‌రెడ్డి. కాంగ్రెస్‌తో పాటు ఇంకొన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగొచ్చు. ప్రధాన పోటీ మాత్రం వైకాపా, టీడీపీల మధ్యే! ఇక నంద్యాల ఉపఎన్నికలలో ప్రధాన ప్రభావం చూపబోయేది డబ్బేనని తెలు స్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు 5వేలు ఇవ్వగల కెపాసిటీ నాకుంది, అయినా ఇవ్వను అంటూ ఓటు విలువను పరోక్షంగానే 5వేలకు తీసుకెళ్లాడు. చంద్ర బాబు మాటలను బట్టి నంద్యాల ఓటర్లపై డబ్బు కుమ్మరించబోతున్నారని అర్ధమవు తోంది. ఈమధ్యే కడప, కర్నూలు, నెల్లూరుజిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రలోభాలను చూసాం. ఓటర్లను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికలకే అన్ని కోట్లు ధారపోసిన వాళ్ళు, రేపు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లాంటి నంద్యాల ఎన్నికలో ఊరుకుంటారా? అదీగాక అధికారపార్టీ వాళ్ళు... ఈ మూడేళ్లలో బాగానే పోగేసారు. నంద్యాల మీద ఎంత పెట్టినా ఏం పోతుంది. తెలుగుదేశం ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచా రంలో వుండగా, మరో పక్క మున్సిపల్‌ మంత్రి నారాయణ రంగంలోకి దిగి వున్నాడు. ఆయన వున్నాడంటే డబ్బుకు లోటులేదనే! నంద్యాలపై తెలుగుదేశం వాళ్ళు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అవతల చూస్తే వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తక్కువ వాడేం కాదు. నియోజకవర్గంలో పేరున్నోడు. ఆర్ధికంగానూ మోటుకునే వాడు. కాబట్టి పోరు రసవత్తరమే! ఎన్నికల కమిషన్‌ బయట రాష్ట్రాల నుండి బలగాలను తెప్పించి బందోబస్తు పెడితే తప్ప లేకుంటే ఓట్ల కోసం కురిసే నోట్ల వర్షాన్ని ఆపలేరు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter