30 June 2017 Written by 

30-06-2017 రాశిఫలాలు

rasi 30

1Ariesమేషం

ఖర్చులు ఎక్కువైనా వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. సోదరవర్గం నుండి శుభవార్తలు వింటారు. స్థిరాస్తుల మీద, షేర్ల మీద ఆదాయం ఉంటుంది. కుటుంబసౌఖ్యము బాగుంటుంది. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవహారాలలో వ్యతిరేకతపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

 

2Taurusవృషభం

ఆర్ధిక పరిస్థితి బాగుండి, వ్యాపారాలలో వృద్ధి, ఆదాయం బాగుంటుంది. వృత్తి పరంగా పెరుగుదల, తీరికలేకపోవడం ఉంటుంది. దూరప్రయాణాలు తప్పని సరి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. తొందరపాటు మాటలు, నిర్ణయాలు లేకుండా జాగ్రత్తపడాలి. సంతానం వల్ల కలిగిన సమస్యలు సర్దుబాటు కాగలవు.

 

3Geminiమిధునం

అనుకున్న పనులు ధైర్యంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య వృద్ధి, రాబడి ఉంటుంది. మీ సలహాలు సూచనలను ఇతరులు ఆమోదిస్తారు. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. ఇతరులకు హామీలు, అప్పులు ఇవ్వవద్దు. అనుకోని ఖర్చులు పైనబడగలవు. బంధువులతో విభేదాలు, చికాకులుంటాయి. బిడ్డల విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు.

 

4Cancerకర్కాటకం

వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరంగా అవకాశాలు బాగుంటాయి. అయితే కుటుంబఖర్చులు పెరుగుతాయి. వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. బంధుమిత్రు లను కలుసుకుంటారు. ఉన్నతవిద్యావకాశాలు బాగుం టాయి. అనుకున్న పనులు ప్రశాంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. స్వల్ప విషయాలపై బంధువర్గంలో విభేదాలు రావచ్చును. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు సవ్యంగా సాగినా టెన్షన్‌ పడుతుంటారు. సన్ని హితుల వల్ల సమస్యలు రావచ్చును. స్థిరాస్తులపై, పెట్టు బడులపై ఆదాయముంటుంది. కొత్త కాంట్రాక్టులు, నిర్మాణాలు లభించి ముందుకు సాగుతారు.

 

6Virgoకన్య

ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగానే ఉంటాయి. ముఖ్యవిషయాలపై నిర్ణయాలు తీసికొనేటప్పుడు జాగ్రత్త పడండి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారుల సహకారం బాగుం టుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

7Libraతుల

ఆర్ధికంగా బలపడే ప్రయత్నాలలో అనుకూలత కలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతుం టాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. పిల్లల విద్య, వివాహ విషయాలపై కృషి చేస్తారు. కొన్ని పనులు అనుకో కుండా పూర్తి కాగలవు. కొత్త పరిచయాలు, దూర ప్రయాణాలుండవచ్చును. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు.

 

8Scorpioవృశ్చికం

అనవసరపు వ్యవహారాలలో తల దూర్చ వద్దు. ఉద్యోగులు బాధ్యతలందు నిర్లక్ష్యము చూపవద్దు. పనులు నిదానంగా జరుగుతాయి. వృత్తి జీవనము సంతృప్తి నిచ్చినా, వ్యాపార వర్గాలకు అవకాశాలు తగ్గుతాయి. అనుకోని ఖర్చులుపైనబడగలవు. బంధుమిత్రుల సహకారంతో ఒక సమస్య నుండి బయటపడతారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

మాటలలోనూ, చేతలలోను తొందరపాటు ఉం టుంది. వృత్తి వ్యాపారాలలో వనరులు, ఆదాయము బాగుండినా ఖర్చుల భారం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. శుభకార్య ప్రయత్నా లలో అనుకూలత తక్కువ. ఉద్యోగసౌఖ్యం, అధికార వర్గ సహకారం బాగుంటుంది. ఉద్యోగార్ధులకు అవకాశా లున్నాయి. అనుకోని దూరప్రయాణాలుంటాయి.

 

10Capricornమకరం

స్థిరాస్తుల లావాదేవీలు, పెట్టుబడుల ప్రయత్నాలు వాయిదా వేసికొనడం మంచిది. ప్రభుత్వ అనుమతు లందు ఆలస్యం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరిగి, సామాన్య ఆదాయముంటుంది. అవసరాలకు ఋణాలు చేస్తారు. శుభకార్య నిర్ణయాలు జరగవచ్చు. దూరప్రయాణాలుంటాయి. అనుకున్న పనులను లౌక్యంగా జరుపుకోవాలి.

 

11Aquariusకుంభం

అనుకున్న పనులు సరిగా జరుగక టెన్షన్‌ పడు తుంటారు. బంధువర్గంతో విభేదాలు చోటుచేసికొం టాయి. వ్యాపారవర్గాలకు అభివృద్ధి అవకాశాలు తగ్గి, ఆదాయ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ వర్గాలకు పనిభారం, శ్రమ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందిపడతారు. షేర్లమీద లాభాలుంటాయి.

 

12Piscesమీనం

కొత్త ఆర్ధిక ప్రయత్నాలందు అనుకూలత, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. అను కున్న పనులు నెరవేరతాయి. పెట్టుబడులకు అవకాశాలు, స్థిరాస్తుల పైన ఆదాయం, షేర్ల మీద ఆదాయం ఉం టుంది. బిడ్డలకు ఉన్నతవిద్యావకాశాలు దొరకడం, శుభకార్య నిర్ణయాలు జరగడం ఉంటుంది. ఉద్యోగులకు పనులు సాఫీగా జరిగిపోతాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter