Friday, 30 June 2017 08:52

పందులను పట్టుకోరా? పట్టించుకోరా?

Written by 
Rate this item
(0 votes)

pigsఇరుకు సందులు... మురికి పందులు... నెల్లూరుకు ఇవే ల్యాండ్‌మార్క్‌. నెల్లూరురోడ్ల మీద జనం కంటే పందుల మందలు ఎక్కువుగా తిరుగుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ వుండే రోడ్ల మీద, వీధుల్లో సైతం పందులు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా తయారయ్యాయి. పందులు మేపేవాళ్లు జనావాసాల మధ్య నుండి కదలకుండా, వాటిని ఇళ్లమీదకు వదిలేస్తున్నారు. పందులతో ఆయా కాలనీ లలో జనానికి పెద్ద చీకాకు అయ్యింది.

మే22వ తేదీన తన ఛాంబర్‌లో కార్పొరేషన్‌ శానిటరీ అధికారులతో సమా వేశం నిర్వహించిన కమిషనర్‌ ఢిల్లీరావు 45రోజుల్లోపు నగరంలో పంది అనేది కనిపించకుండా ఏరివేయాలని, ఆలోపు పని పూర్తికాకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించాడు కూడా! అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు నగరంలో పందులు ఏరివేతకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నగరంలో ఒక్క పందిని పట్టిన దాఖలాలు లేవు. కమిషనర్‌ పెట్టిన 45రోజుల గడువేమో దగ్గరకొచ్చింది. ఆయన వార్నింగ్‌ రోజు కంటే ఈరోజు రోడ్ల మీద ఇంకా ఎక్కువ పందులు తిరుగుతున్నాయి. మరి గడువు దాటిన తర్వాత 'బాహుబలి' సినిమాలో దేవసేన(అనుష్క), కుమారవర్మ(సుబ్బ రాజు)ల మాదిరిగా కమిషనరే స్వయంగా పందుల వేటకు బయల్దేరుతాడేమో చూడాలి! ఆయన ఆ పని చేయకముందే కార్పొరేషన్‌ సిబ్బందే ఆ పని చేస్తే బాగుంటుంది.

Read 101 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter