30 June 2017 Written by 

ఆత్మకూరు ఇచ్చినా... 'ఆనం'దం అంతంతే!

ramnarఆనం రామనారాయణరెడ్డి తెలుగు దేశంపార్టీలో చేరాక ఆత్మకూరు నియో జకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు ముందు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గూటూరు కన్నబాబును పక్కనపెట్టడం తెలిసిందే! ఆనం ఇన్‌ఛార్జ్‌ అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో పెను రాజ కీయ మార్పులు చోటుచేసుకుంటాయని, వైకాపా నుండి పెద్దఎత్తున వలసలుంటా యని, వైసిపికి ఇక్కడ బలమైన ఎదురుదెబ్బ తగులుతుందని వూహించారు. అయితే ఇక్కడ అలాంటి అనూహ్య పరిణామాలేవీ సంభవించలేదు. రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరాడని చెప్పి అంతకు ముందు ఆయనతో వున్నోళ్లెవరూ ఎగేసుకు పోలేదు. వీళ్లంతా ఆచితూచి వ్యవహరిస్తూ స్థబ్దుగా వున్నారు.

ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డికి ఏమంత అనుకూల వాతావరణం కూడా లేదు. పార్టీలోనే అసమ్మతి వుంది. గూటూరు కన్నబాబు ప్రత్యేకవర్గాన్ని మెయింటేన్‌ చేస్తున్నాడు. రేపు ఆనంకు అతను సహకరిస్తాడన్న ఆశలు కూడా లేవు. ఆనం కాంగ్రెస్‌లో మంత్రిగా వున్న సమయంలో ఆయన వర్గం ఇక్కడ బాగానే బలంగా వుండింది. ఆఖరకు మేకపాటి సొంత మండలమైన మర్రిపాడు మండ లంలో కూడా ఆనంకు బలమైన అనుచరు లుండినారు. మేకపాటి సొంత పంచా యితీ బ్రాహ్మణపల్లిలో ఆనం అనుచరులు సర్పంచ్‌గా గెలిచారు. కాని, ఆనం రామ నారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో గట్టిగా పోరాడలేకపోవడంతో ఈ అనుచరగణ మంతా కూడా చెల్లాచెదురైంది. సొంత మండలమైన మర్రిపాడుపై మేకపాటి

వాళ్ళు మునుపటి పట్టును సాధించుకో గలిగారు. కాని కాంగ్రెస్‌లో నుండి తెలుగు దేశంలో చేరిన ఆనం మాత్రం గతంలో తన వెన్నంటి నడిచిన అనుచరులను తిరిగి తెచ్చుకోలేకపోతున్నాడు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఇమడ లేకపోవడమే! వాళ్ళంతా కాంగ్రెస్‌లో ఉండగలిగారు, తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి పోగలిగారు. కాని, టిడిపి అంటే వీళ్లకు సరిపడడం లేదు. అందుకే ఆనం వెంట అనుచరులు పెద్దగా తెలుగు దేశంలో చేరలేదు. దీనికితోడు ఆత్మ కూరులో 'రెడ్డి' సామాజిక వర్గీయుల ఓట్లు 40వేల దాకా వున్నాయి. ఇది ఖచ్చితంగా వైకాపాకు సానుకూల అంశమే!

ఆత్మకూరులో తెలుగుదేశంకు అంత అనుకూలమైన వాతావరణమేదీ లేదు. ఆనం ఇక్కడ పాత బలాన్ని తెచ్చుకోవా లంటే బాగానే కసరత్తు చేయాల్సి వుంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter