23 June 2017 Written by 

23-06-2017 రాశిఫలాలు

rasi 23

1Ariesమేషం

సోదర వర్గానికి మేలు జరుగుతుంది. ఉద్యోగులకు పని భారం ఉంటుంది. అధికారులకు స్థానమార్పులు, నిరుద్యోగులకు అవకాశాలు బాగుంటాయి. శుభవార్తలు వింటారు. విదేశీయానానికి అవకాశాలు, కొత్త పెట్టు బడులు, కొత్త వ్యాపారాల ప్రయత్నాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. తొందరపాటు నిర్ణయాలు, ప్రవర్తన తగ్గించుకొనండి.

 

2Taurusవృషభం

స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశమున్నది. విద్యార్థులు కొత్త నేర్పులందు ఇముడుతారు. ఉద్యోగులకు పని భారం స్థాన మార్పులుంటాయి. మీ సొంత విషయాలలో ఇతరులను తల దూర్చనీయకండి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఒక మోస్తరుగా జరిగి ఆదాయం కూడా అట్టే ఉంటుంది.

 

3Geminiమిధునం

వ్యవహారాలను సొంతంగా జరపండి, మధ్య దళారులు వద్దు. రావలసిన బాకీలు కొంతమేరకు అందు తాయి. వస్తు వాహన గృహ రిపేర్లుంటాయి. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. యజమానులకు వర్కర్లతో చిన్న ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదనంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం ఉంటుంది. శుభకార్య నిర్ణయాలు జరుగగలవు.

 

4Cancerకర్కాటకం

శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. దూర ప్రయాణాలుంటాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బం దులుంటాయి సర్దుకొని పోవాలి. చెల్లింపులు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కొద్దిపాటి అవకాశాలుంటాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆర్ధికంగా మందకొడి పరిస్థితులుంటాయి. ఆదాయం, వ్యాపారావకాశాలు తగ్గుతాయి.

 

5Leoసింహం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. అప్పుడప్పుడు టెన్షన్‌ ఉంటుంది. ఇతరులకు సహాయపడడం, ఇతరుల పనులపై ప్రయాణాలు జరపడం ఉంటుంది. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. విద్యార్థులకు కలిసివచ్చే కాలం. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు అప్రయత్నంగానే సాగుతాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరుగగలవు.

 

6Virgoకన్య

దూరప్రయాణాలు నిర్ణయం కాగలవు. తగాదాలు, విభేదాలు సర్దుబాటు కాగలవు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత, ఉద్యోగులకు ప్రమోషన్లు పనిభారం ఉం టుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తిని ఇవ్వగలవు. కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అవకాశాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది.

 

7Libraతుల

ఉద్యోగులకు స్థానమార్పు, ఉన్నతి ఉంటుంది. నలుగుతున్న సమస్యల నుండి బయటపడతారు. మీ సలహాలు సహకారం ఇతరులకు ఉపయోగపడతాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. సొంత పనులపై ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని అదనపు ఆదాయం స్వల్పంగా ఉంటుంది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఆరోగ్యం విషయంలోనూ, ముఖ్యపత్రాలు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు తమ పైఅధికారులతోనూ పబ్లిక్‌తోనూ జాగ్రత్తగా వ్యవహ రించవలెను. అనుకున్న ప్రయాణాలు రద్దు కావచ్చును. చేసే పనులకు ఆటంకాలుంటాయి. ప్రభుత్వ అను మతులు, సహకారం ఆలస్యం కాగలదు. వృత్తి వ్యాపా రాలు ఆశించిన రీతిలో అనుకూలించగలవు.

 

9Sagittariusధనుస్సు

విదేశ ప్రయాణాలు దూర ప్రాంతాలకు ప్రయా ణాలు నిర్ణయం కాగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది. పని భారం ఉండి ఉద్యోగులు సమర్ధతను ప్రదర్శిస్తారు. సేవా కార్యక్రమాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, పెట్టు బడులకు అవకాశాలుండడం, శారీరక ఆరోగ్య బాధ లుంటాయి. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు రాకుండా చూచుకొనాలి. ఆదాయం సామాన్యం.

 

10Capricornమకరం

ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడాలి. అధికారులకు ఉద్యోగులకు పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. శాస్త్ర సాంకేతిక క్రీడా కళారంగాల వారికి అవకాశాలు అభివృద్ధి బాగుంటుంది. చెల్లింపులు సకాలంలో చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి. ముఖ్యులను కలుసు కొనలేకపోవచ్చును. చేపట్టిన పనులకు ఆటంకాలు కలిగి ఇబ్బంది పెడతాయి. ఇతరులకు సహాయం చేస్తారు.

 

11Aquariusకుంభం

చేపట్టిన పనులు సక్రమంగా జరుగుతున్నా టెన్షన్‌గా ఉంటుంది. ఉద్యోగార్ధులకు అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగులకు అధికారులకు పనుల వత్తిడి పెరిగినా సమర్ధత గుర్తింపు బాగుంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలుంటాయి. ఉన్నత విద్యావృద్ధిలో కృషి ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. షేర్ల మీద లాభాలుంటాయి.

 

12Piscesమీనం

కొత్త ప్రాంతాలను సందర్శిస్తారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందించగలరు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారానికి రాగలవు. కొత్త పెట్టుబడులు, క్రయ విక్రయాలను ఆపుకొనడం మంచిది. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. వృత్తి వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. బిడ్డల విద్యా, శుభకార్యాలపై దృష్టి పెట్టి కృషి చేస్తారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter