23 June 2017 Written by 

మారనున్న రహదారుల పేర్లు... కొలువుదీరనున్న బార్లు!

barsమన ప్రభుత్వాల పనితనం ఎలా ఉంటుందన్నదానికి ఓ చిన్న ఉదాహరణ... రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పందులను కాల్చి పారేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనుకుందాం... అప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పంది పేరును నందిగా మారుస్తూ జి.ఓ తెస్తుంది. అప్పుడు రాష్ట్రంలో పందులుండవు నందులు తప్పితే! ఇక వాటిని చంపలేరు.

ప్రస్తుతం మద్యం వ్యాపారం విషయం లోనూ మన రాష్ట్ర ప్రభుత్వం అదేపని చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును తిరగ రాసేలా కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల ఇవతల మద్యం షాపులు పెట్టకూడదని రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జులై 1వ తేదీ నుండి సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం టెండర్లువేసి, లాటరీ తీసి షాపులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తే నెల్లూరులో మినీబైపాస్‌రోడ్డుతో పాటు జిల్లాలోని పలు పట్టణాలలో ప్రధాన రోడ్లపై వైన్‌షాపులు, బార్లు మూసేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎక్కువ మద్యం వ్యాపారం జరుగు తున్నది ఈ రోడ్ల మీదే! కాబట్టి ఈ రోడ్ల పేర్లు మార్చడానికే ప్రయత్నాలు జరుగు తున్నాయి. నెల్లూరులోని మినీబైపాస్‌రోడ్డు 2013లో ఆర్‌ అండ్‌ బి పరిధిలో నుండి నేషనల్‌ హైవే పరిధిలోకి వెళ్లింది. దాదాపు 12కిలోమీటర్లున్న ఈ రోడ్డు ఇరువైపులా 11వైన్‌షాపులు, 8బార్లు వున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తే ఒక్క వైన్‌షాపుగాని, ఒక్క బార్‌ కాని వుండదు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ ఇదే పరిస్థితి. కాబట్టి ఈ మినీబైపాస్‌ను మేజర్‌ జిల్లారోడ్డుగా మార్చాలని చూస్తు న్నారు. అయితే ఇది నేషనల్‌ హైవే అథా రిటీ పరిధిలో వుండడంతో ముందు దీనిని ఆర్‌ అండ్‌ బి పరిధిలోకి తీసుకొచ్చి, ఆ తర్వాత మేజర్‌ జిల్లారోడ్డుగా మార్పు చేసు కోవాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారుల శ్రేయస్సు కోసం మద్యంషాపులుండే రాష్ట్ర రహదారులను మేజర్‌ జిల్లా రహదారులుగా మార్చి కార్పొ రేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయితీలకు అప్పగించాలని భావిస్తోంది. నెల్లూరు మినీబైపాస్‌ను తిరిగి ఆర్‌ అండ్‌ బి పరిధి లోకి తెస్తేగాని ఆ తర్వాత మేజర్‌ జిల్లా రోడ్డుగా మార్చుకోలేరు.

తాగుబోతులు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునే జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద 500మీటర్ల లోపు వైన్‌షాపులుండ కూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాళ్ల ఉద్దేశ్యం వాహనాల రద్దీవున్న రోడ్లపై మద్యం వ్యాపారం వద్దని! మన ప్రభుత్వం మాత్రం రద్దీవున్న రోడ్లపై కాకుంటే అడవుల్లో వైన్‌షాపులు పెట్టుకుని నడపాలా? అన్నట్లు అసలు రోడ్ల పేర్లే మార్చేయబోతోంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • అమ్మో... దొంగల ముఠా
    కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter