23 June 2017 Written by 

నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు

deepamఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌ సింగ్‌, రాబిన్‌, పన్నీరు సెల్వం, హరికృష్ణ ప్రసాద్‌, విశ్వనాథ్‌, హరిహరన్‌, కార్తీక్‌, కృష్ణపట్నం సిఇఓ సుబ్బారావు, పోర్టు పిఆర్‌ హెడ్‌ జి.వేణుగోపాల్‌, ఇహెచ్‌ఎస్‌ అధికారి వేణుగోపాలరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్టు వారు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం లోని తీరప్రాంతవాసులకు ఉచితంగా గ్యాస్‌ స్టౌలు అందిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 1500స్టౌలను అందిం చారు. మత్స్యకారులు వంటచెరుకు కోసం చెట్లను కొట్టకుండా వాటిని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తీరును అధికారులు అభినందించారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter