Friday, 23 June 2017 07:58

ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం

Written by 
Rate this item
(0 votes)

rtcనెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం బస్టాండ్‌లో ప్లాట్‌ఫారాలు చాలావరకు ఖాళీగా వుం డేవి. ఇప్పుడు మాత్రం ప్లాట్‌ఫారం మీద ఒక బస్సు వుంటే దానివెనుక ఇంకో రెండు బస్సులు వెయిటింగ్‌లో వుండే పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్‌లో 19ప్లాట్‌ఫారా లున్నాయి. అయితే పెరిగిన బస్సులకు ఈ ప్లాట్‌ఫారాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇటీవల తిరుమల బస్సులకు, నెల్లూరురూరల్‌ గ్రామాలకు వెళ్లే బస్సులకు ప్రత్యేక ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. అయినా కూడా బస్టాండ్‌ బస్సులతో, ప్రయాణీకులతో ఇరుకుగానే వుంటోంది. మొత్తం ఆర్టీసీ ప్రాంగణం 12ఎకరాలు. ఇందులోనే ఒకటి, రెండు డిపోలున్నాయి. ఒకప్పుడు విశాలంగా అనిపించిన బస్టాండ్‌ ఇప్పటి అవసరాలకు సరిపోవడం లేదు. బస్టాండ్‌కు వచ్చే బస్సుల సంఖ్య బాగా పెరిగింది. నైట్‌హాల్ట్‌ బస్సులు పెరి గాయి. కాబట్టి ఆర్టీసీ బస్టాండ్‌ను ఇక్కడ నుండి నగర శివారు ప్రాంతాలకు తర లించి దాదాపు 40ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనను గతంలోనే 'లాయర్‌' ప్రస్తా వించింది. దీనిమీద గతంలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్లు స్పందించి ప్రతిపాదనలు కూడా తయారుచేయడం జరిగింది. అయితే గతంలో వున్న ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా అది ఆచరణరూపం దాల్చలేదు.

కాని, నగరంలో సగం ట్రాఫిక్‌ సమస్యకు కారణం ఆర్టీసీ బస్టాండే! ఆర్టీసీ బస్టాండ్‌కు అనుసంధానంగానే వేల సంఖ్యలో ఆటోలు, వందల సంఖ్యలో టౌన్‌ బాస్సులు నడుస్తున్నాయి. అయ్యప్పగుడి, బోసుబొమ్మల మధ్య ట్రంకురోడ్డు చాలా ఇరుకుగా మారింది. రోడ్డు మీద ఎప్పుడు చూసినా ఆటోల ర్యాలీ జరుగుతున్నట్లుగా వుంటుంది. ఆర్టీసీ బస్టాండ్‌ను ఇక్కడ నుండి మినీబైపాస్‌, జాతీయ రహదారిల మధ్యకు నగరానికి ఓ వైపు ఉండేలా మారిస్తే ట్రంకురోడ్డులో ట్రాఫిక్‌ సమస్య సగానికిపైగా తగ్గిపోతుంది.

కాని, ఇప్పుడున్న బస్టాండ్‌నే ఆధునీక రించనున్నట్లు, ఇందుకోసం 175కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. బస్టాండ్‌లో అదనంగా 21 ప్లాట్‌ఫారాలను నిర్మించడంతో పాటు ఆర్టీసీ ప్రాంగణంలో కళ్యాణ మండపం, కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, మినీ థియేటర్‌ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 175కోట్లు పెట్టి ఆధునీకరిస్తారు, ఇంకో పదేళ్ల తర్వా తయినా మళ్ళీ ఈ బస్టాండ్‌ ఇరుకనిపి స్తుంది. అప్పుడేం చేయాలి. దీనిబదులు ఇప్పుడే బస్టాండ్‌ను నగర శివారుకు తరలించడం మంచిది.

మినీబైపాస్‌, జాతీయ రహదారికి అనుసంధానంగా మధ్యలో ప్రభుత్వానికి సంబంధించిన భూములున్నాయి. వాటిని గుర్తించి ఆర్టీసీ అక్కడకు మార్చే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతమున్న ఆర్టీసీ ప్రాంగణాన్ని సంస్థ వాళ్ళు కమర్షియల్‌ కేంద్రంగా అభి వృద్ధి చేసుకుని ఆదాయం గడించవచ్చు. ఇప్పుడున్న చోట నుండి ఆర్టీసీని తరలించ డమే నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు మంచి పరిష్కారం.

Read 1152 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter