09 June 2017 Written by 

అంబరాన్నంటిన అద్భుతం

gslvఅమెరికావాళ్ళు చంద్రుడి మీదకు మనుషులను పంపించారు... రష్యా వాళ్ళు అంగారకుడి మీదకు ఉప గ్రహాన్ని వదిలారు... చైనా అంతరిక్షం లోకి వ్యోమగాములను పంపింది... ఒకప్పుడు ఈ వార్తలు చదువుతుంటే అంతరిక్షమే కాదు, ఆ దేశాలు కూడా మనకు అందనంత ఎత్తున కనిపిం చేవి. ఆ దేశాల స్థాయికి మనం చేర గలమా అనిపించేది.

కాని, ఇంతవరకు నడిచిన చరిత్ర వేరే! ఇప్పుడు నడుస్తున్న చరిత్ర వేరే! అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాలకే సవాల్‌ విసురుతోంది భారతదేశం. ఉపగ్రహాల ప్రయోగాలలో ప్రపంచ దేశాలనే నివ్వెర పోయేలా చేస్తోంది భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ ఇస్రో. అమెరికా, రష్యా దేశాల అంతరిక్ష ప్రయోగాల గురించి ఇంతవరకు మనం గొప్పగా చెప్పుకున్నాం. భవిష్యత్‌లో భారత్‌ అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రపంచమే గొప్పగా చెప్పుకుం టుందన్న భరోసాను, నమ్మకాన్ని కలిగి స్తోంది మన ఇస్రో!

అంతరిక్ష ప్రయోగాలలో వైఫల్యం మాటను మరచి, గెలుపును తమ వాకిట్లో కట్టేసుకున్న 'ఇస్రో', మరో అనితర విజయాన్ని సాధించింది. ఈమధ్యనే ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను అవ లీలగా కక్ష్యలోకి నెట్టేసి అగ్రదేశాలను ముక్కు మీద వేలేసుకునేలా చేసిన ఇస్రో, ఆ దేశాలు ముక్కు మీద వేసుకున్న వేళ్ళను తిరిగి దించే పని లేకుండా మరో ఘన విజయంతో సత్తా చాటింది.

ఇస్రోకు ఇద్దరు ముద్దుబిడ్డలున్నారు. ఒకరు పిఎస్‌ఎల్‌వి, ఇంకొకరు జిఎస్‌ ఎల్‌వి. పిఎస్‌ఎల్‌వి మొదటి నుండి క్రమ శిక్షణ గల విద్యార్థిగా చెప్పిన మాట బుద్ధిగా వింటున్నాడు. ఇస్రో చెప్పింది చెప్పినట్లు చేస్తూ వరుస విజయాలతో తన మాతృసంస్థకు కీర్తిప్రతిష్టలు తెస్తున్నాడు.

ఇక రెండోవాడు జిఎస్‌ఎల్‌వి. కొంచెం మొండోడు. కాకపోతే పిఎస్‌ఎల్‌వి కంటే బలిష్టుడు. అప్పుడప్పుడు దారి తప్పేవాడు. నింగిలోకి దూసుకుపొమ్మని నిప్పు పెడితే, నీటిలో దూకి తుస్సుమనేవాడు. అయితే మెరుగు పెడితేనే రాయి అయినా వజ్రంగా మారుతుందనే పెద్దలు చెప్పిన సూక్తి మన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలియంది కాదు. ఆ సూక్తితోనే ఎన్నో ఏళ్ళుగా శ్రమించారు. జిఎస్‌ఎల్‌వికి పదును పెట్టారు. లోపాలను కనిపెట్టి సరిచేసారు. సరికొత్త మెరుగులు దిద్దారు. జిఎస్‌ఎల్‌విని ఇప్పుడొక ఆణి ముత్యంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు జిఎస్‌ ఎల్‌వి కూడా దారికి వచ్చింది. క్రమ శిక్షణతో అప్పగించిన బాధ్యతను సమర్ధ వంతంగా నెరవేర్చి తన మీద ఆశలు పెట్టుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, నూటపాతిక కోట్ల భారతీయుల నమ్మకాన్ని అంత రిక్షంలో నిలబెట్టింది.

అంతరిక్ష ప్రయోగాలలో భారత్‌ మరో ముందడుగు వేసింది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.58గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌ సెంటర్‌) లోని రెండో ప్రయోగ వేదిక నుండి ప్రయో గించిన భారీ వాహక నౌక జిఎస్‌ఎల్‌వి మార్క్‌3-డి1 విజయవంతమైంది. ఈ భారీ రాకెట్‌ ద్వారా 3136 కిలోల భారీ బరువున్న జీశాట్‌-19 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం 'ఇస్రో'కు ఒక శుభ సంకేతం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్‌ ఇది. క్రయోజనిక్‌ ఇంజన్‌ సాంకేతికపై ఇస్రో పూర్తి పట్టును సాధించిందనడానికి సంకేతమిది. ఇప్పటి వరకు 2500 కిలోల బరువు దాటిన

ఉపగ్రహాలను ప్రయోగించడానికి మనం అగ్రదేశాల మీద ఆధారపడుతూ వచ్చాం. ఇప్పుడు జిఎస్‌ఎల్‌వి ఇచ్చిన నమ్మకంతో ఇక 5వేల కిలోల బరువుగల ఉపగ్రహాల నైనా ప్రయోగించగలమనే ధైర్యం ఏర్ప డింది. అంతేకాదు, భవిష్యత్‌లో ఇస్రో చేపట్టదలచిన అనేక అంతరిక్ష సాహసో పేత ప్రయోగాలకు ఈ ప్రయోగమే అంకు రార్పణగా మారింది.

జిఎస్‌ఎల్‌వి మార్క్‌3-డి1 ప్రయోగం విజయవంతం కావడంతో దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత రాష్ట్రపతి, ప్రధానిలు ఇస్రో శాస్త్ర వేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌, వారి శాస్త్రవేత్తల బృందాన్ని ప్రతి భారతీయుడు అభినందిస్తున్నాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter