Home Blog
తన స్వార్థంకోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారతాడనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ . మీడియాలో తనమీద వ్యతిరేక వార్తలు రాగానే వాటిని మరుగుపర్చటం కోసం సొంత పచ్చ ఛానెల్స్ ని ఉపయోగించి బురదచల్లటం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య . భారతి సిమెంట్స్ మీద కేసు వేసింది 2011 ఆగష్టు 10 న ....
రాజకీయాలలో సమర్ధమైన నాయకత్వం, నీతివంతమైన పాలన, సుస్థిర అభివృద్ధి, పేద, బడుగుల సంక్షేమం అనే అంశాల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. గతంలో వీటి ఆధారంగానే ఎన్నికలలో రాజకీయ పార్టీల గెలుపోటములు వుండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని కులం, ధనం ఆక్రమించాయి. ఈ రెండింటి ప్రభావం ఎన్నికలపై ఎక్కువవుతుండడంతో అవినీతి పార్టీలు సైతం తిరిగి అధికారంలోకి...
చంద్రబాబు అవినీతిపరుడు... పోలవరం ప్రాజెక్టులో అన్నీ అక్ర మాలే! అంచనాలు కావాలనే పెంచారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌లో 400కోట్ల అవినీతి జరిగింది. తెలుగుదేశం నాయకులు గనులను దోచేస్తున్నారు. సెజ్‌లు, రాజధాని పేరుతో భూ దోపిడీకి పాల్పడుతున్నారు... ఏపి బీజేపీ నాయకుల స్కోత్కర్ష ఇది. మా నుండి విడిపోయినా తెలుగుదేశం మా మిత్రపక్షమే! చంద్రబాబునాయుడు మా మిత్రుడే......
దేశంలో అత్యంత కాలుష్యమైన నగరాలు 14 ఉంటే, అందులో నెల్లూరు కూడా ఒకటని తాజాగా నిపుణుల హెచ్చరిక చూస్తే..నెల్లూరెంతగా కాలుష్యంలో కూరుకుపోతోందో..అనారోగ్యకర వాతావరణంలో పడి ఈ సుందర నగరం ఎంతగా విలవిలలాడిపోతోందో తేటతెల్లమవుతుంది. చూడచక్కని పచ్చని ప్రకృతి వాతావరణంతో, చల్లని గాలులతో గతంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న నెల్లూరు..ఇప్పుడు సెగలు పొగలతో నిండిపోతోంది. ఎటుచూసినా...
వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో జగన్‌ ఆత్మాహుతి దళం అన్నట్లుగా ఓ టీమ్‌ వుంది. ఈ టీమ్‌ సభ్యులు గెలిచినా, ఓడినా చివరకు చచ్చినా జగనన్నతోనే మా ప్రయాణం అన్నట్లుంటారు. అలాంటి టీమ్‌లో ఒక సభ్యుడే నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌. 2014 ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ నుండి భారీమెజార్టీతో గెలిచిన అనిల్‌, ఈ నాలుగేళ్ళ...
కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అధికార గర్వం ఏ స్థాయిలో తలకెక్కిందో అక్కడక్కడా చూస్తూనే వున్నాం. అధికారులను ఇసుకలో జుట్టుపట్టి ఈడ్చి కొట్టడం, సభలు సమావేశాలలో పబ్లిక్‌గా బూతులు తిట్టడం, ఎయిర్‌పోర్టులలో సిబ్బందిపై వీరంగం చేయడం... ఇలా ఎన్నో సంఘటనలున్నాయి. ఎమ్మెల్యేలంటే ప్రజలకు తాము సర్వెంట్లం అనుకోవడం లేదు. తాము దేవలోకం నుండి డైరెక్ట్‌గా ఊడిపడ్డామన్నట్లుగా...
జాతీయ రాజకీయాలలో ఎన్డీఏ వ్యతిరేక కూట మికి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీని నిలువరించి ఏకతాటిపై నిలిచిన విపక్షాలన్నీ కూడా బీజేపీని రెండో దెబ్బ కొట్టడానికి సిద్ధపడ్డాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడం ద్వారా తమ సత్తాను చాటాలనుకున్నాయి. ఎన్డీఏకు ప్రమాద సంకేతాలను అందించాలనుకున్నాయి. కాని...
గొలగమూడిలో కొలువైవున్న భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామివారి 36వ ఆరాధనా మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేది వరకు వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు, ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో ఎంతో వేడుకగా వాహనసేవలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా, 18వ తేది ఉదయం నిత్య...
ఢిల్లీలోని టెన్‌జనపథ్‌.... సోనియా గాంధీ ఆహ్వానం మేరకు మమతా బెనర్జీ, ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి, శరద్‌పవార్‌, చంద్రబాబునాయుడులు అక్కడకు వచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు అహ్మద్‌పటేల్‌, మల్లిఖార్జునఖర్గే, అంబికా సోని, గులాంనబీ ఆజాద్‌, పనబాక లక్ష్మిలు కూడా అక్కడే వుండి వారిని ఆహ్వానించి ఒక హాల్‌లో కూర్చోబెట్టారు. అంతలో కాషాయపంచె ధరించి భుజా లపై కాషాయ...
జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడ్‌ నియో జకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఎన్ని కల్లో నిలబడే అభ్యర్థులు, గెలిచే ఎమ్మెల్యేలు దళితులైనప్పటికీ, నడిపించేది మాత్రం అగ్రవర్ణాల నాయకులే! ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పరోక్ష పెత్తనం మాత్రం వారిదే! 1994 నుండి 2014వరకు పరసారత్నం సూళ్ళూరుపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పర్మినెంట్‌ అభ్యర్థిగా ఉంటున్నాడు. ఈ నియోజకవర్గం...

ePaper

epaper 10.08.2018

3,560FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
overcast clouds
32.2 ° C
32.2 °
32.2 °
51 %
9.7kmh
92 %
Tue
33 °
Wed
34 °
Thu
36 °
Fri
37 °
Sat
37 °