ఈ నెల 8వ తేదీన నవ నిర్మాణ దీక్ష ముగింపు సభ కోసం నాయుడుపేటకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు వారాలు తిరక్కముందే మళ్ళీ నెల్లూరొస్తు న్నారు. ‘దళిత తేజం – తెలుగుదేశం’ ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 30న నెల్లూరులో జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. దీనికి విఆర్సి గ్రౌండ్, ఏ.సి స్టేడియంలను కాదని బాలాజీనగర్ శివారులో వున్న శ్రీ వేణుగోపాలస్వామి కాలేజీ మైదానాన్ని ఎంపిక చేసుకున్నారు. అదయితే హైవే ఆనుకుని వుంటుంది కాబట్టి ట్రాఫిక్కు ఇబ్బంది వుండదు. ఈ ముగింపు సభను లక్షమందితో జరపాలనుకుంటున్నారు. మరి నాయకులు ఎన్ని అగచాట్లు పడాలో ఇంతమంది జనాన్ని సమీకరించాలంటే!
