Home జిల్లా వార్తలు ఛీ… ఛీ… జర్నలిజాన్ని దిగజార్చిన పాతపేపరు

ఛీ… ఛీ… జర్నలిజాన్ని దిగజార్చిన పాతపేపరు

‘లాయర్‌’ పత్రిక వ్యవస్థాపకులు కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారి సిద్ధాంతాలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ గత 37 సంవత్సరాలుగా పాఠకుల అభిమానాన్ని అపారంగా చూరగొని, నీతి నిజాయితీలకు వేదికగా నిలిచిన మా(మీ) ‘లాయర్‌’ వారపత్రిక మరోసారి తన నైతికతను చాటుకుంది. ఎందరు ఎన్ని రకాలుగా ఒత్తిడులు తీసుకొచ్చినా ఎక్కడా తలవంచక, మడమ తిప్పక ఎలాంటి ప్రలోభాలకు లొంగ కుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తన నిబద్ధతను నిరూపించుకుని, కూలీ రాత లకు, గాలి వార్తలకు ‘లాయర్‌’ ఎప్పుడూ దూరంగానే వుంటుందని ఋజువు చేసుకుంది.

అయితే, ఈ ఎన్నికలను తన స్వార్ధం కోసం పూర్తిగా వాడుకుని సంపాదనే ధ్యేయంగా కూలీ రాతలే లక్ష్యంగా తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించింది పాత పేపరు. బీద మస్తాన్‌ రావు, మంత్రి నారాయణ, సోమి రెడ్డి, కురుగొండ్ల, బొల్లినేని రామారావు, బొల్లినేని కృష్ణయ్య, అబ్దుల్‌ అజీజ్‌, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలకు తన పత్రికను తాకట్టుపెట్టి పత్రికా రంగం పరువును బజారుకీడ్చింది ఆ పాత పేపరు.

కస్తూరిదేవి విద్యాలయ సంక్షేమమే ధ్యేయంగా నిభద్దతతో నిజాయితీగా వార్తలు రాసిన తరుణంలో కూలిరాతలు రాస్తున్నారంటూ ‘లాయర్‌’ పై విషం కక్కిన ఆ పాత పేపరు ఇప్పుడు తన నైజాన్ని తానే బయట పెట్టుకుంది. ప్రధానంగా ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారి గత నాలుగువారాలుగా పూర్తిగా కూలి రాతలకే అంకితమై పత్రికను కరపత్ర స్థాయికి దిగజార్చింది.

ధనమే ధ్యేయంగా సంపాదనే లక్ష్యంగా నీచాతి నీచంగా పత్రికా విలువలను మంటగలిపింది. పత్రిక వెలువడాల్సిన తేదికంటే మూడు రోజుల ముందే ప్రచురించి రద్దీ ప్రాంతాలలో ఉచితంగా పంచిపెట్టి పాత్రికేయ విలువలకు వలువలు వూడదీసింది.

విజ్ఞులు, విజ్ఞానవంతులు విచక్షణాపరులైన నెల్లూరీయులకు ఏ పత్రిక నైతికత ఏపాటిదో తెలిసిపోయింది. మాది దశాబ్దాల చరిత్ర అని గొప్పలు చెప్పుకుంటున్న ఆ పాత పేపరు చంటోడి ముడ్డి తుడవడానికి కూడా పనికిరాదని అందరికీ అర్ధమైపోయింది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, ఎదుటి వారిని విమర్శించే ముందు ఒక్కసారి గురివింద గింజ సామెత గుర్తుచేసుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here