Home జిల్లా వార్తలు 2019… రేస్‌ గురాల్రు వీళ్ళే!

2019… రేస్‌ గురాల్రు వీళ్ళే!

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణలు తప్పితే జిల్లాలో ఎన్నికైన మిగతా 8మంది ఎమ్మెల్యేలు శాసనసభలోకి కొత్తగా అడుగుపెట్టినవాళ్ళే! 2014 అసెంబ్లీకి నెల్లూరుజిల్లా నుండి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలు కొత్తగా అడుగుపెట్టారు.

మరి 2019 అసెంబ్లీకి ఎంతమంది పాతవాళ్ళు పోబోతున్నారు, ఎంతమంది కొత్త

వాళ్ళు రంగంలోకి దిగబోతున్నారన్నది ప్రశ్న? ముఖ్యంగా ఒకప్పుడు ఎన్నికలు వరల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల మాదిరిగా వుండేవి. ఏ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి అన్నది ముందుగానే ఫిక్స్‌ అయ్యుండేది. ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా పార్టీ మీద అభిమానముండే పోటీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ఐపిఎల్‌ మ్యాచ్‌లు మాదిరిగా తయారయ్యాయి. ఎలక్షన్‌ ముందే గెలుపు గుర్రాలను కొనుక్కోవడమన్న మాట. ఇక్కడ పార్టీ ఫీలింగ్‌, సిద్ధాంతం, అభిమానం అన్నవి చివరి స్థానంలో వుంటాయి. గెలవగలిగే సామర్ధ్యమే ప్రధానంగా వుంటుంది. ఐపిఎల్‌లాగానే ఎలక్షన్‌ ముందు ఈపిఎల్‌(ఎలక్షన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వుంటుంది. ఈ కోణంలో చూస్తే కొందరు నాయకులను తెరమీదకు తీసుకురావచ్చు.

వైసిపి నుండి చూస్తే… సిటింగ్‌ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు ఎలాగూ రంగంలో వుంటారు. వీళ్ళు కాకుండా ఆయా స్థానాలకు సంబంధించి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీధర్‌, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బత్తిని విజయ్‌కుమార్‌ వంటి నాయకులు టిక్కెట్ల రేస్‌లో వున్నారు.

తెలుగుదేశం నుండి చూస్తే… సిటింగ్‌ ఎమ్మెల్యేలుగా బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఎలాగూ రేస్‌లో వున్నారు. వీళ్ళు కాకుండా టీడీపీ తరఫునే ఆయా స్థానాల నుండి బీద మస్తాన్‌రావు, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, బొల్లినేని హజరత్తయ్యనాయుడు, గూటూరు కన్నబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, జ్యోత్స్నలత, పరసారత్నం, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పి.నారాయణ, అబ్దుల్‌ అజీజ్‌, తాళ్ళపాక అనూరాధ వంటివారి పేర్లు రేస్‌లో వున్నాయి.

ఇక ప్రస్తుతానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలలో వున్నప్పటికీ టీడీపీ లేదా వైసిపి టిక్కెట్ల రేసులో ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పనబాక కృష్ణయ్యలు ఉండడం విశేషం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here