Home జిల్లా వార్తలు 2019 ‘మిస్‌’ అయ్యిందెవరు?

2019 ‘మిస్‌’ అయ్యిందెవరు?

2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు చాలా దగ్గరి సంబంధముంది. 2014 ఎన్నికల్లో అటు తెలుగుదేశం, ఇటు వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరు కూడా దాదాపు మళ్ళీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీకి దూరమైన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు.

2014 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ప్రస్తుతం వైసిపిలో కూడా లేడు. ఇటీవలే తెలుగుదేశంకు దగ్గరయ్యాడు. చేస్తే ఆత్మకూరులో తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయొచ్చు. ఇక 2014లో గూడూరు అసెంబ్లీ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ బి.జ్యోత్స్నలతకు ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ రాలేదు. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశంలో దూరిన పాశం సునీల్‌కుమార్‌కే గూడూరు సీటిచ్చారు. గత ఎన్నికల్లో నెల్లూరు నగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డికి కూడా ఈ ఎన్నికల్లో సీటు లేదు. ఆయన బదులు మంత్రి పి.నారాయణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు.

అలాగే 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన గూటూరు కన్నబాబుకు కూడా ఈ ఎన్నికల్లో సీటు లేదు. ఆయన బదులు మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను ఇక్కడ రంగంలోకి దించారు.

2014 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళలో చాలా తక్కువమందే మళ్ళీ టిక్కెట్లు పొందలేకపోగా వారిలో ముగ్గురు నాయ కులు తెలుగుదేశం వాళ్ళే ఉండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here