Home జిల్లా వార్తలు 19న నెల్లూరులో సమరశంఖారావ సభ

19న నెల్లూరులో సమరశంఖారావ సభ

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన నెల్లూరుకు రానున్నారు. ఆరోజు నెల్లూరు మినీబైపాస్‌రోడ్డులోని సిపిఆర్‌ కళ్యాణ మండపం ఎదురుగా గల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం స్థలంలో ఏర్పాటు చేయనున్న ‘సమర శంఖారావ’ సభలో పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్రంలోని ముఖ్య నాయకులం దరూ తరలి రానున్నారు. వైసిపి జిల్లా ఇన్‌ఛార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా వైసిపి నాయకులు గురువారం ఈ స్థలం ప్రాంగణాన్ని సందర్శించి ఇక్కడే సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here