Home గ్రామ సమాచారం 18 నుంచి గొలగమూడిలో శ్రీ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు

18 నుంచి గొలగమూడిలో శ్రీ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు

గొలగమూడిలో కొలువైవున్న భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామివారి 36వ ఆరాధనా మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేది వరకు వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు, ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో ఎంతో వేడుకగా వాహనసేవలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా, 18వ తేది ఉదయం నిత్య పూజల అనంతరం అంకురార్పణ, కలశస్థాపన, శిఖర కలశ సంప్రోక్షణలతో స్వామివారి ఆరాధనా మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు ఉదయం 10 గంటలకు సర్వభూపాల వాహనసేవ, రాత్రి 9 గంటలకు కల్పవృక్ష వాహనసేవలు నిర్వహిస్తారు. 19న

ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనసేవలుంటాయి. 20న ఉదయం హనుమంతసేవ, రాత్రి 9గంటలకు హంసవాహనసేవ, 21న ఉదయం చినశేష వాహనం, రాత్రి 9గంటలకు గజవాహనసేవ, 22వ తేది ఉదయం 10గంటలకు అశ్వవాహనసేవ, రాత్రి 9 గంటలకు పెదశేషవాహనసేవ నిర్వహిస్తారు. 23న

ఉదయం10గంటలకు సింహవాహన సేవ, అనంతరం రాత్రి 9గంటలకు కన్నుల పండువగా గరుడవాహన సేవ నిర్వహిస్తారు. స్వామివారి ఆరాధనలో ప్రధానమైన 24వ తేది జరిగే వేడుకలో ఉదయం 10 గంటలకు అంగరంగవైభవంగా రథోత్సవం ఉంటుంది. రాత్రి 8గంటల నుంచి వైభవోపేతంగా స్వామివారికి తెప్పమహోత్సవం జరుగుతుంది. భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఆరాధనోత్సవాలకు తరలివస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొలగమూడిలోని భగవాన్‌ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమకమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here