Home జాతీయ వార్తలు హోదా పాపంలో మొదటి ముద్దాయి బిజెపినే – విజయ సాయి రెడ్డి

హోదా పాపంలో మొదటి ముద్దాయి బిజెపినే – విజయ సాయి రెడ్డి

ప్రత్యేక హోదా పై ఈ రోజు రాజ్య సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ లో వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకు పడ్డారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కేసులో మొదటి ముద్దాయి బిజేపినేనని , రెండవ ముద్దాయి తెలుగుదేశం అయితే ఇక మూడవ ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. ఈ కేసు ఇప్పుడు ప్రజా కోర్ట్ లో వున్నదని , 2019 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా తగిన బుద్ధి  చెప్తారన్నారు. గ‌త నాలుగేళ్లుగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కేవ‌లం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే జీవ‌నాడి, అదే సంజీవ‌ని కూడా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదని సభలో స్పష్టం చేసారు.

ఇప్పటికి తెలుగు దేశం పై మాట పడకుండా కాపాడుతున్న వెంకయ్య

రాజ్య సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి బిజెపి ని విమర్శితున్నంతసేపు గమ్మునుండి ఇక రెండవ ముద్దాయి అని ఎత్తుకోగానే విజయ సాయి రెడ్డి సమయాన్ని ముగించేశారు.  రెండవ ముద్దాయిగా తెలుగు దేశం పై విమర్శలు మొదలవుతాయని విజయసాయి రెడ్డి ఎంత మొత్తుకున్నా , రాజా వంటి ఇతర పక్షాలు మద్దతుఇచ్చినా , ఆఖరికి మీరు మా రాష్ట్రానికి చెందిన వారు మీరు ఇలాచెయ్యొద్దు అని అడిగినా కూడా వెంకయ్య సమయం ఇవ్వలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here