Home జిల్లా వార్తలు హడలెత్తిస్తున్న ట్రాక్టర్లు

హడలెత్తిస్తున్న ట్రాక్టర్లు

నెల్లూరు-జొన్నవాడ రోడ్డులో ఇసుక ట్రాక్టర్లు హడలెత్తిస్తున్నాయి. వాటి వేగానికి ఆ రోడ్డులో వెళ్ళే ఇతర వాహనాల వాళ్ళు, ద్విచక్రవాహనదారులు బెంబేలెత్తుతున్నారు. పొట్టేపాలెం ఇసుక రీచ్‌ నుండి నెల్లూరు నగరంలోకి రోజూ వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు వస్తుంటాయి. నిర్ణీత వేళల్లో మాత్రమే పోలీసులు ఈ ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించడం జరుగుతుంది. ఈ తక్కువ వ్యవధిలోనే వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తోలాలనే ఆత్రుతతో డ్రైవర్లు ట్రాక్టర్లను అత్యంత వేగంగా తోలుతుంటారు. ఈ ట్రాక్టర్లకు బ్రేకులు సరిగా పడవు. దీనికితోడు అడ్డదిడ్డంగా దూరుతుంటారు. దాంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ట్రాక్టర్ల వేగానికి కళ్లెం వేయాల్సి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here