Home జిల్లా వార్తలు స్వర్ణాల చెరువును రాజకీయం చేయొద్దు

స్వర్ణాల చెరువును రాజకీయం చేయొద్దు

నెల్లూరులోని స్వర్ణాల చెరువును నెక్లెస్‌ రోడ్డు పేరుతో అభివృద్ధి చేయడం వరకు బాగానే వుంది. కాని ఈ చెరువును కేంద్రంగా చేసుకుని ఓట్ల కోసం కొంత మంది రోత రాజకీ యాలు చేయడం వికారంగా వుంది. ఓట్ల కోసం అధికార పార్టీ నాయకులు ప్రధాన మతాల ప్రజల మధ్య లేని పోని అపోహలు సృష్టిస్తున్నారు. స్వర్ణాల చెరువుకు ఓ పక్క గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వుంది. తూర్పు పక్క బారాషహీద్‌ దర్గా వుంది. ఇంతవరకు సరే… స్వర్ణాల చెరువులో శివ లింగాన్ని ప్రతిష్టించాలని ఆ మధ్య నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శీనయ్య ప్రయత్నాలు చేశాడు. దీనిని వ్యతిరేకిస్తూ ముస్లింలు దర్గా ఆవరణలో జెండాలు నాటారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు చెరువు వద్ద ఓ మతానికి సంబంధించిన ఘాట్‌ కడతారట. ఇప్పటికే జరిగిన రచ్చ చాలు. స్వర్ణాల చెరువు పక్కన గతంలో ఎలా వుందో అలాగే వుంచండి. కావాలంటే టూరిజం పరంగా ఎంతైనా అభివృద్ధి చేయండి. కాని ఓట్ల కోసం వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here