Home గల్పిక స్వర్గంలో స్పృహ తప్పిన ఎన్టీఆర్‌

స్వర్గంలో స్పృహ తప్పిన ఎన్టీఆర్‌

అది దేవేంద్ర లోక రాజధాని అమరావతి నగరం. భూ లోకం నుండి స్వర్గానికి విచ్చేసిన నందమూరి హరి కృష్ణకు స్వాగతం పలుకుతూ ఇంద్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేశారు. దేవేంద్రుడితో పాటు నారదమహర్షి కూడా ఆ వేడుకలకు విచ్చేసారు. మొదట నందమూరి తారక రామారావుతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెట్టారు. ‘వేటగాడు’ సినిమాలో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి… కోకెత్తుకెళ్లింది కొండగాలి’ అనే పాటకు రంభతో కలిసి ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేసాడు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వంతు వచ్చింది. ఆయన శ్రీదేవితో కలిసి ‘ప్రేమాభిషేకం’ సినిమాలోని ‘దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా… నీకై తపించు జపించు భక్తునిపై మౌనమా’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి అలరించాడు. వెంటనే ఎస్వీ రంగారావు లేచాడు… గదను భుజాలపై పెట్టుకుని ‘వివాహ భోజనంబు… వింతైన వంటకంబు… వియ్యాలవారి విందు… అహహహ నాకె ముందు’ అనే పాటకు అభినయించాడు. సరిగ్గా అప్పుడు లేచాడు స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66)… ఎహే ఆపండహే… మీ పాత చింతకాయ పాటలు మీరూనూ… మీరింకా అప్‌డేట్‌ కావాలి… ”ఓ అప్పారావు, ఓ సుబ్బా రావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా” అనే పాటల కాలం పోయింది అని.. రేయ్‌… మంచి ఫాస్ట్‌ బీట్‌ పెట్టండ్రా అంటూ అరిచాడు. ఆయన చెప్పినట్లే ‘రంగస్థలం’ సినిమా లోని ”రంగమ్మా మంగమ్మా’ అనే పాట పెట్టగా వివేకా రంభ, ఊర్వశి, మేనకల నడుములు గిరగిరా తిప్పుతూ డ్యాన్స్‌ ఇరగదీసాడు.

సాంస్కృతిక కార్యక్రమాలు అయి పోయాక అందరూ భోజనాలకు లేచారు. భోజనాలు చేస్తున్న సమయంలో హరికృష్ణ వద్దకు ఎన్టీఆర్‌ వచ్చాడు. గట్టిగా కౌగి లించుకుని నాకిక్కడ చైతన్యరథం తోల డానికి సరైన డ్రైవర్‌ లేడని నా కోసం నువ్వొచ్చావా నాయనా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నాకు ఎన్ని జన్మల అవకాశం వుంటే అన్ని జన్మల్లోనూ మీ బిడ్డగా కాకపోయినా మీ రథంతోలే డ్రైవర్‌గా అవకాశమివ్వమని ఆ భగవం తుని కోరుకుంటాను తండ్రి గారు అని హరికృష్ణ చెప్పాడు. హరికృష్ణ ప్రేమకు ఎన్టీఆర్‌ మరింతగా చలించిపోయాడు. అంతలో నారద మహర్షి, వివేకా అక్కడకు వచ్చారు. హరికృష్ణతో నారదుడు… నాయనా, భూలోకమున అందరూ కుశలమేనా? అని ప్రశ్నించాడు. అందరూ బాగానే వున్నారని హరికృష్ణ చెప్పాడు. ఇంతకీ తెలుగు ప్రజలు ఎలా వున్నారని నారదుడు అడిగాడు. ఆయన ప్రశ్నలకు హరికృష్ణకు మనసులో ఏదో సందేహం కలగసాగింది. ఈ అగ్గిపుల్ల స్వామి నన్నే గుచ్చి గుచ్చి అడుగుతున్నాడంటే ఏదో మంట పెట్టడానికే లాగుందనుకుంటూ తెలుగు ప్రజలు బాగానే వున్నారు స్వామి అని చెప్పాడు. మీ నాన్న గారు అమలు చేసిన మద్యపాన నిషేధ చట్టం తెలుగు రాష్ట్రాలలో ఇంకా అమలులోనే వుందా? ప్రజలు మద్యానికి దూరంగా సుఖశాంతు లతో బ్రతుకుతున్నారా? అని నారదుడు ప్రశ్నించాడు. అక్కడ ఎన్టీఆర్‌ కలుగ జేసుకుని… ఏం మాట్లాడుతున్నావు నారదా, నా అల్లుడు చంద్రబాబు నాకు వెన్నుపోటు పొడిచి వుండొచ్చు, నా ఆశయాలకు కాదు. మద్యపాన నిషేధం మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం… ప్రజలకు మేమిచ్చిన వాగ్ధానం. దానిని మా అల్లుడు గారు పాటించాల్సిందే! అదీగాక మా అల్లుడికి మద్యపాన వ్యసనం లేదు. అలాగే సిగరెట్‌, గుట్కా, మట్కా, ఖైనీ, కిళ్లీ, పాన్‌మసాల, పేకాట, ఇతర జూదాలేవీ అలవాటు లేవు అని చెప్పాడు. అందుకు నారదుడు… ఏమయ్యా హరికృష్ణ మీ తండ్రి గారు చెప్పిందంతా నిజమేనా? మద్యపాన నిషేధం అంత చక్కగా అమలు చేస్తున్నారా మీ బావగారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్ప లేక హరికృష్ణ నీళ్ళు నమలసాగాడు. నారదుడు ఆయనకు ఇంకో ప్రశ్న సంధిస్తూ… ఇంతకీ మీ తెలుగుదేశం పార్టీ ఎలా వున్నది? తెలుగువారి ఆత్మ గౌరవం నుండి పుట్టిన పార్టీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మీ నాన్నగారు స్థాపించిన పార్టీ… అదే పోరాట పంథాలో పయ నిస్తుందా? అని అడిగాడు. హరికృష్ణ మనసులో… పెట్టాడ్రా నారదుడు నిప్పు… ఇప్పుడు అబద్ధం చెబితే తండ్రినే మోసగించిన తనయుడినవుతాను, అలా గని నిజం చెబితే ఆయన తట్టుకోలేడు… ఆయన గుండె మరోసారి బద్ధలవుతుంది. ఇక్కడ సమయానికి ఆసుపత్రికి తీసు కెళ్లడానికి 108 అంబులెన్స్‌లు కూడా వుండిచావవు అనుకుంటుండగా… అప్పుడు వివేకా కలుగజేసుకున్నాడు. నారదా, ఇన్ని ప్రశ్నలెందుకు? మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీ దగ్గర ఎన్నో మాయోపాయాలున్నాయి కదా! మంత్ర శక్తితో ఏం జరుగుతుందో మీరే ప్రత్యక్షంగా చూడండి, మా పెద్దా యన ఎన్టీఆర్‌కు చూపించండి అని సలహా ఇచ్చాడు. అటులనే అంటూ నారదుడు ‘ఓం హ్రీం ఏపి డాట్‌కామాయనమః’ అని మంత్రం చదివాడు. వెంటనే అక్కడ పెద్ద స్క్రీన్‌ ప్రత్యక్షమైంది. నారదుడు మళ్ళీ ధూమ్‌ ధూమ్‌ సీన్‌ స్క్రీనాయనమః అని మంత్రం చదివాడు. స్క్రీన్‌ మీద సీన్‌లు ప్రసారం కాసాగాయి.

్య్య్య్య్య

అది నెల్లూరుజిల్లాలోని ఓ మారు మూల పల్లెటూరు. మిట్ట మధ్యాహ్నం… ఒకావిడ బిందె పట్టుకుని బావి వద్ద కెళ్లింది. దాంట్లో నీళ్లు లేవు… తర్వాత వూరి మధ్యలో వుండే బోరు వద్దకొచ్చి పంప్‌ కొట్టింది. చుక్క నీళ్ళు రాలేదు. దాదాపు మూడు మైళ్లు నడిచి వెళ్లి పొలాల్లోని మోటారు వద్ద నీళ్ళు పట్టుకుని వచ్చింది. అదే సమయంలో గ్రామం మధ్యలోని ఓ షాపు వద్ద పెద్ద గుంపుగా మగాళ్లున్నారు. అందరి చేతుల్లోనూ బ్రాందీ, విస్కీ, బీరు సీసాలు, వాటర్‌ బాటిళ్లు వున్నాయి. అందరూ తప్పతాగి తూలుతున్నారు. ఆ సీన్‌లు చూసి ఎన్టీఆర్‌ బిత్తరపోయాడు. ఏంటి వివేకా… ఇదంతా ఏంటి అని ఎన్టీఆర్‌ అడిగాడు. దానికి వివేకా… ఇది ఓన్లీ శాంపిలే సార్‌, రాష్ట్రంలోని ప్రతి పల్లెటూర్లో ఇలాంటి సీన్‌లు నిత్యకృత్యం… ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెల్లో వీళ్లంతా మందు కొడితేనే ఏపిలో ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పాడు. ఆ సీన్‌కే ఎన్టీఆర్‌ మనసు బాధతో మెలికలు తిరగసాగింది. ఆ తర్వాత ఇసుక దోపిడీ, అమరావతి నిర్మాణాలు, పంట పొలా లను దున్నేయడం, అధికారులను ఎమ్మె ల్యేలు కొట్టడం వంటి సీన్‌లు చూసి ఆయన మనసు ఇంకా చలించిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీలో 126మంది ఎమ్మెల్యేలు పసుపు కండువాలు వేసుకున్న సీన్‌ను చూసి ఎన్టీఆర్‌… అదేంటి వివేకా… 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 103 మందే కదా… మరి 126మందిపై పసుపు కండువాలున్నాయేంటి అని అడిగాడు. అప్పుడు హరికృష్ణ కలుగజేసుకుని… నాన్నగారు, మీరు అంతలోతుగా వెళ్లొద్దు, అవన్నీ తెలుసుకుని మీరు తట్టుకోలేరు, మీ కాలం రాజకీయాలు వేరు, ఈ కాలం రాజకీయాలు వేరు అని సర్ది చెప్పబోతుం డగా ఎన్టీఆర్‌ ఆవేశంగా… హరి నువ్వు ఆపు… వివేకా నువ్వు చెప్పు అని గద్దిం చాడు. అప్పుడు వివేకా… సార్‌, మీ పార్టీ తరపున గెలిచింది 103 మందే… వైసిపి నుండి కొన్న 23మందితో కలిసి 126మంది అయ్యారు. ఇప్పుడు ఇండి యన్‌ పొలిటికల్‌ మార్కెట్‌లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మంచి డిమాండ్‌ వుంది సార్‌ అని చెప్పాడు. ఎన్టీఆర్‌ రెండు చెవులు మూసుకుని హత విధి… రాజ కీయాలు ఇంత దిగజారిపోయాయా అని దిగులుపడ్డాడు. ఈ సీన్‌కే ఇలా అయ్యావు… ఇక అసలు సీన్‌ చూస్తే ఏమైపోతావో అని వివేకా గొణిగాడు. అది ఎన్టీఆర్‌ చెవికి వినపడడంతో ఏంటా అసలు సీన్‌ అని అడిగాడు. ఇదిగో చూడండి వస్తుంది అంటూ వివేకా స్క్రీన్‌వైపు చూపించాడు.

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసమది. ఆ ఇంట్లోకి కాంగ్రెస్‌ నాయ కులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, రేవంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలు వెళ్తున్నారు. ఆ సీన్‌ చూసి ఎన్టీఆర్‌… ఈరోజు బాబు ఇంట్లో ఏదన్నా ఫంక్షన్‌ వుందా అని అడిగాడు. లేదు అని హరికృష్ణ చెప్పాడు. మరి ఈ కాంగ్రెస్‌ నేతలంతా ఎందుకు వెళుతున్నట్లు అని ఎన్టీఆర్‌ ప్రశ్నించాడు. తినబోతూ రుచి అడగడమెందుకు, మీరే చూడండి అని వివేకా అన్నాడు. బాబు ఇంట్లోని ఓ హాల్‌లో అందరూ కూర్చున్నారు. చంద్ర బాబు వుండి… మాకు పాతిక అసెంబ్లీ, 5 లోక్‌సభ ఇవ్వండి అని అడిగాడు. అందుకు ఉత్తమ్‌… మీకు అవి చాలా ఎక్కువ, 15అసెంబ్లీ, 2 లోక్‌సభ ఇస్తాం తీసుకోండి అని చెప్పాడు. అట్లాకాదు… ఒక్కో అసెంబ్లీ రేటెంతో చెప్పండి… కొన్నింటిని కొనుక్కుంటానని చంద్రబాబు ఆఫర్‌ ప్రకటించాడు. ఇదంతా స్క్రీన్‌పై చూస్తున్న ఎన్టీఆర్‌… ఏం జరుగుతుం దక్కడ అని అడిగాడు. దానికి వివేకా… ఇంకా అర్ధం కాలేదా సార్‌… తెలుగు దేశం – కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాడు. ఆ మాట వినడంతోటే ఎన్టీఆర్‌… నేను స్థాపించిన పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమా… ఇంత దుర్మార్గమా అంటూ ఆవేశంగా లేచాడు. ఆ ఆవేశం లోనే పడిపోయాడు… హరికృష్ణ అలర్టై పెద్దగా ‘అంబులెన్స్‌’ అంటూ అరిచాడు.

(ఇంకా వుంది…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here