Home రాష్ట్రీయ వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న… చందబ్రాబు డూప్‌

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న… చందబ్రాబు డూప్‌

రాముడు – భీముడు, అపూర్వ సహోదరులు, హలోబ్రదర్‌, జీన్స్‌, అదుర్స్‌ వంటి తెలుగు సినిమాలలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా వుండే సన్నివేశాలు చూసాం. అయితే ఆ సినిమాలో ముందు ట్విన్స్‌గా కనిపించే హీరోలిద్దరినీ వేర్వేరుగా పరిచయం చేసినా, సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి వారికి రక్తసంబంధం కలిసిపో తుంది. సినిమాలు కాబట్టి పాత్రలను మన ఇష్టం వచ్చినట్లు క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ పాత్రల సంబం ధాలను ఎక్కడో చోట ముడిపెట్టవచ్చు. కాని, నిజ జీవితంలో కూడా మనిషిని పోలిన మనిషి తారస పడితే… వారి మధ్య ఎలాంటి రక్తసంబంధాలు లేకపోతే ఆశ్చర్యం వేయక మానదు.

భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుమంది దాకా వుంటారంటారు. ఒకే రూపంలో ఏడుమందిని చూడడం అసాధ్యంగాని, కాని మనిషిని పోలిన మనిషిని అప్పుడప్పుడు చూస్తుంటాం. డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌, నరేంద్ర మోడీ వంటి నాయకులను పోలిన వ్యక్తులు వున్నట్లు సోషల్‌ మీడియాలో చూసాం. అయితే ఈ ప్రపంచంలో ఎవరిని పోలిన మనిషైనా వుండొచ్చేమోగాని చంద్రబాబును పోలిన మనిషి వుండడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఎత్తు, ఒత్తయిన జుట్టు, తెల్లగడ్డం… ఆయన ఫేస్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. అలాంటి డిఫెరంట్‌ చంద్ర బాబును పోలిన మనిషిని కూడా పట్టేసారు కొందరు. గత కొన్నిరోజులుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఓ టిఫిన్‌ సెంటర్‌లో అచ్చం చంద్రబాబులాగే వున్న ఓ వ్యక్తి కేవలం నిక్కరు, బనియన్‌ మాత్రమే వేసుకుని చట్నీ వడ్డిస్తున్న దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇలాంటి వీడియోలు ఈనాటి కుర్రోళ్ళ చేతుల్లో పడితే దానికి ఇంకెంత క్రియేటివిటి జోడిస్తారో వేరే చెప్పాలా? పలు సినిమాలలోని ‘డబుల్‌ ఫోటో’ కామెడీ సన్నివేశాలను ఈ వీడియోకు జత చేసి చంద్రబాబును ఆడుకుంటున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో వివాదాలను వెల్‌కం బోర్డు పెట్టి ఆహ్వానించే సినీ దర్శకుడు రామ్‌గోపాలవర్మ చంద్రబాబును అచ్చు గుద్దినట్లు వున్న ఆ వ్యక్తి ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. తాను తీయబోయే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో ఆ వ్యక్తిని పెట్టుకుంటానంటున్నాడు.

మొత్తానికి ఈ చంద్రబాబు డూప్‌ ఎవరో గాని సోషల్‌ మీడియాలో పెద్ద సబ్జెక్ట్‌ అయ్యాడు. ఆయన ఏదన్నా ప్రొఫెషన్‌లో వుండుంటే అది వేరే సంగతి, కాకా హోటల్‌లో సర్వర్‌గా వుండే సరికి కామెడీ స్టోరీలు తయారవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here