Home అంతర్జాతీయ వార్తలు సేవా రుషికి ‘నాటా’ సత్కారం

సేవా రుషికి ‘నాటా’ సత్కారం

ఇది అపురూప ఘట్టం. అరుదైన సన్నివేశం, అపూర్వమైన దృశ్యం, నెల్లూరు జిల్లాలోనే కాకుండా, దేశంలో పలుచోట్ల తన సేవా పరిమళాలను వెదజల్లుతున్న ప్రముఖ దాత, రాజ్యసభ సభ్యుడు, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్మెన్‌, విపిఆర్‌ సంస్థల అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ”నాటా” నాల్గవ ద్వైవార్షిక వేడుకలలో ”జీవిత సాఫల్య పురస్కారాన్ని” అందుకున్న ఆనందకర సంఘటన.

నిత్యం సేవ కోసం తపిస్తూ, ఆథ్యాత్మి కతతో తపిస్తూ సమాజసేవలో తరిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలను ”నాటా” గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ ఘనమైన పురస్కారంతో సత్కరించారు. జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకూ 3రోజుల పాటు జరిగిన ”నాటా” సంబరాలలో చివరిరోజైన జూలై 8వ తేదీ జరిగిన ముగింపు సభలో అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అక్క డకు వచ్చిన వేలాదిమంది తెలుగువారిని అబ్బురపరచాయి. సాంస్కృతిక సంబరా లతో పాటు ప్రతియేటా అందించే నాటా ప్రతిష్టాత్మక ”లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు” ఈ వేడుకలలో ప్రదానం చేయడం ఆనవాయితీ.

నాటా అడ్వయిజరి కౌన్సిల్‌ ఛైర్మెన్‌ డా|| ప్రేమ్‌రెడ్డి, నాటా ప్రస్తుత అధ్యక్షుడు గంగసాని రాజేశ్వరరెడ్డి, ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, రాజంపేట మాజీ పార్లమెంటుసభ్యుడు మిధున్‌రెడ్డి, శ్రీసిటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి, నాటా భవిష్యత్‌ అధ్య క్షుడు గోశాల రాఘవరెడ్డి, కార్యనిర్వా హక ఉపాధ్యక్షులు కోర్శపాటి శ్రీధర్‌రెడ్డి, నాటా సలహామండలి సభ్యులు ఎ.వి.యన్‌. రెడ్డి, ఆదిశేషారెడ్డి, జితేందర్‌రెడ్డి, డా|| స్టాన్లిరెడ్డి, తుంగా శివప్రభాత్‌రెడ్డిల సమ క్షంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డిలను డా|| ప్రేమ్‌రెడ్డి, గంగసాని రాజేశ్వరరెడ్డిలు ”జీవిత సాఫల్య పుర స్కారం”తో సత్కరించారు. డా|| ప్రేమ్‌రెడ్డి తదితరులు విపిఆర్‌ దంపతులను అభి నందించారు.

ఈ సందర్భంగా సేవాతత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సామాజిక, ఆథ్యా త్మిక సేవలను ప్రతిభింబిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శిం చారు. ప్రఖ్యాత గాయకుడు యస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానంతో, ఆయన గాన మాధుర్యంతో 6నిమిషాల పాటు ప్రదర్శిత మైన ఈ లఘుచిత్రం అందరినీ ఆకట్టుకుంది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కార ప్రదానోత్సవంలో కోర్శపాటి మాట్లాడుతూ డా|| వై.యస్‌.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ఓ మహా సేవకుడిని సత్కరించు కునే అవకాశం నాటాకి దక్కడం అదృష్ట మని అన్నారు.

అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ”నాటా” లాంటి అంతర్జా తీయ సేవా సంస్థ నుండి అవార్డు అందు కోవడం ఆనందంగా వుందని, భారత దేశంలో నాటా చేపట్టే సేవా కార్యక్రమా లలో తమ విపిఆర్‌ ఫౌండేషన్‌ కూడా భాగస్వామ్యమౌతుందని హామీ ఇచ్చారు. తమ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే తామం దిస్తున్న ఉచిత విద్య, ఉచిత వైద్యం, అమృతధార పథకాల ద్వారా తాను సంతృప్తి చెందుతున్నానని, నాటా ద్వారా తన సేవలను ఇంకా విస్తరించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఇక ప్రతి ద్వైవార్షిక సభకూ తాను హాజరవు తానని, నాటా చేస్తున్న కార్యక్రమాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన డా|| ప్రేమ్‌ రెడ్డికి ఇతర కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన త్వరలోనే ముఖ్య మంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. అక్కడున్న వేలాదిమంది తెలుగు వాళ్ళు వందలాదిమంది నెల్లూరీయులు తమ హర్షధ్వానాలతో విపిఆర్‌ దంపతు లకు అభినందనలు తెలియజేశారు.

ఇంతై, అంతై, అంతంతై… అన్నట్లుగా తన సేవా కార్యక్రమాల ద్వారా అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి, ఆయనకు స్ఫూర్తిదాతగా నిలుస్తూ సహకరిస్తున్న ఆయన ధర్మపత్ని ప్రశాంతి రెడ్డికి అభినందనలు తెలుపుతోంది ‘లాయర్‌’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here