Home జిల్లా వార్తలు సేవామూర్తికి సేవాభిషేకం

సేవామూర్తికి సేవాభిషేకం

ప్రముఖ దాత, మహో న్నత సేవామూర్తి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఎంతో విశిష్టమైన ‘సేవాభూషణ్‌’ బిరుదును ప్రదానం చేయనున్నారు. భారతీయ సినిమా గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మకమైన బిరుదును అందుకోనున్నారు. నెల్లూరు పురమందిరంలో నవంబర్‌ 1వ తేది సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఈ బిరుదు ప్రదానం జరుగనుంది. మానవీయ హృదయంతో అటు సమాజానికి, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన చేస్తున్న బృహత్తరమైన సేవలకు గుర్తింపుగా ఈ బిరుదును ప్రదానం చేయనున్నారు. నెల్లూరులోని కళాంజలి సాంస్కృతిక సంస్థ రజతోత్సవ వేడుకల్లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు సమాజ సేవామూర్తులకు సత్కారాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు, నెల్లూరు ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, విద్యానగర్‌లోని ఎన్‌బికెఆర్‌ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మురళీకృష్ణ70 ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు, ‘లాయర్‌’ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని కళాంజలి అనంత్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా ‘పాడుతా తీయగా’ గాయనీ గాయకులచే ‘స్వరఝరి’ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here