Home జిల్లా వార్తలు సేవకు వేళాయెరా…!

సేవకు వేళాయెరా…!

ఎన్నికలు దగ్గరకొస్తున్నాయంటే చాలు… రాజకీయ నాయకులకు సేవా కార్యక్రమాలు గుర్తొచ్చేస్తుంటాయి. ఎవరికి వాళ్ళు మదర్‌థెరిస్సా, వినోబాబావే, అన్నాహజారే, డొక్కా సీతమ్మలకు సేవా వారసులమంటూ బయలు దేరుతారు. సొంత డబ్బులు బయ టకు తీస్తారు. సొంత పేర్లతో ఛారిటబుల్‌ ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, అన్నదానాలు, ఉపాధి శిక్షణా కేంద్రాలు, మంచినీళ్ళ సరఫరా, వికలాంగులకు ట్రైసైకిల్స్‌, వీల్‌ఛైర్‌ల పంపిణీ, వృద్ధులకు ఆపరేషన్లు, పేదవిద్యార్థులకు ఆర్ధిక సాయం, తాగునీటి ఎద్దడి వున్న ప్రాంతాలలో బోర్లు వేయించడం, చీపుర్లు పట్టి రోడ్లు ఊడవడం… ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలతో నాయకులు ప్రజల ముందుకు వస్తుంటారు. వెరైటీ ఏంటంటే నాయకులు కులాలు మతాల వారీగానే కాక వయస్సుల వారీగా కూడా సేవా కార్యక్రమాలను డిజైన్‌ చేయడం. ఏ వర్గం వాళ్ళకు ఏమి అవసరమో అదిచేయడం ఈ సేవా కార్యక్రమాలలో ప్రధాన ఉద్దేశ్యం.

ఇప్పుడు నాయకులు యువతను ఆకర్షించడం కోసం సేవా నిరతిని క్రీడారంగం వరకు విస్తృత పరిచారు. ఇటీవల సీఎం కప్‌ అని, ఛైర్మెన్‌కప్‌ అని, మేయర్‌ కప్‌ అని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తుండడం చూస్తున్నాం. ఇవన్నీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా నాయకులు తమను తాము ప్రజల్లో ఫోకస్‌ చేసుకునేందుకు మొదలు పెడుతున్నవే! ఇక ఎన్నికలు అయిపోయే దాకా ప్రజలు రాజకీయ నాయకులు చేసుకునే సేవలను ఆస్వాదించక తప్పదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here