Home జిల్లా వార్తలు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన కొమ్మి

సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన కొమ్మి

తెలుగు సినిమాలలో యాక్టర్స్‌కు పలు ఇన్నింగ్స్‌ వుంటాయి. మొదట హీరో, హీరోయిన్‌లుగా వెలుగుతారు. వెలుగు తగ్గాక తెరపై కొంతకాలం కనుమరుగవుతారు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యక్షమవుతారు. అయితే ఈసారి హీరో, హీరోయిన్‌లుగా కాదు… హీరోలకు తండ్రులుగా, హీరోయిన్‌లకు తల్లులుగా, అత్త, మామలుగా… దీనిని సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటారు. మూడో ఇన్నింగ్స్‌ అన్నది తాత, అవ్వల రూపంలో వుంటుంది. ప్రస్తుతం జయసుధ వంటి నటీమణి చేస్తున్న క్యారెక్టర్లన్న మాట…

సినిమాలలో వున్నట్లే రాజకీయాల లోనూ అనేక ఇన్నింగ్స్‌లు వుంటాయి. నెల్లూరు జిల్లాలో వున్న ప్రస్తుత రాజకీయ నాయకులలో కొందరు ముప్ఫైనలభై ఏళ్ళ నుండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడుతుంటే కొం దరు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ఇంకొందరు మూడో ఇన్నింగ్స్‌ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు ఆ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆడడానికి రెడీ అయిన నాయకుడే మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు. ఒక ప్పుడు ప్రజలే చందాలు ఇచ్చి గెలిపించు కున్న ప్రజానాయకుడు.

జిల్లా రాజకీయాలలో అందరికీ సుపరి చితుడు కొమ్మి లక్ష్మయ్య. చేజర్ల మండలా ధ్యక్షుడు స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. 1994లో ఆత్మకూరు అసెంబ్లీ నుండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1999లో మాత్రం పంతంపట్టి తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రాజకీయాలలోకి వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య చేతిలో ఓడిపోయాడు. 2004లో టిడిపి టిక్కెట్‌ రాక ఇండి పెండెంట్‌గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి, తన ప్రత్యర్థి అయిన కృష్ణయ్యపై గెలు పొందాడు. అయితే 2009 ఎన్నికలకు మళ్ళీ తెలుగుదేశంలో దూరిపోయి ఆత్మకూరు నుండి ఆ పార్టీ అభ్యర్థిగా నిల బడ్డాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనం రామ నారాయణరెడ్డి చేతిలో ఓటమిపాల య్యారు. తదనంతరకాలంలో జగన్‌ స్థాపించిన వైసిపిలో చేరి 2014 ఎన్నికల్లో వెంకటగిరి నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు.

2014లో వెంకటగిరిలో ఓడిపో యింది మొదలు… ఇప్పటివరకు ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. అటు వైసిపికి దూరమయ్యారు. తెలుగు దేశానికీ దగ్గర కాలేదు.

అయితే ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల తెలుగుదేశం నుండి వైసిపిలో చేరాక, తెలుగుదేశం నాయకులకు మళ్ళీ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యలు గుర్తొచ్చారు. ఆత్మకూరును కనిపెట్టుకుని వున్న గూటూరు కన్నబాబును పక్కకు తోసేసి ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్యను బ్రతిమలాడి ప్రచారంలోకి తెచ్చారు. ఇక బొల్లినేని బలమైన మద్దతుదారులు కూడా కావాలి కదా… అందుకే కొమ్మి లక్ష్మయ్యను కూడా ట్రాక్‌లోకి తెచ్చారు. ఆత్మకూరులో తెలుగు దేశం అభ్యర్థి కోసం పనిచేసేలా ఆయనను ఒప్పించారు. ఇటీవల జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారా యణ, పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవి చంద్ర, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డిలు కొమ్మి లక్ష్మయ్యను తీసుకెళ్ళి సీఎం చంద్రబాబుతో మాట్లాడించారు. చంద్ర బాబుతో మాట్లాడాక కొమ్మి హుషారుగానే కనిపిస్తున్నాడు. ఉత్సాహంగానే సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు. కృష్ణయ్య గెలుపు కోసం రేపు ఆత్మకూరు నియోజక వర్గంలో కొమ్మి లక్ష్మయ్య పని చెయ్యాలి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయో లేదో రేపు చూద్దాం…! రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కాబట్టి ఇమిడినా ఇమడొచ్చు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here