Home జిల్లా వార్తలు సూళ్ళూరుపేట… ఎవరికో ఈ పీట

సూళ్ళూరుపేట… ఎవరికో ఈ పీట

జిల్లాలో వున్న రెండు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలలో ఇదొకటి! ఈ నియోజకవర్గంలో పెత్తనం రెడ్లదే అయినా, వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు. ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తుంటారంతే!

2019 ఎన్నికలకు సంబంధించి గత అభ్యర్థులే మళ్ళీ తెరమీదకు వచ్చారు. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీమంత్రి పరసా రత్నం, వైసిపి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోటీపడుతున్నారు. 1994 నుండి పరసా రత్నమే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. 1994, 1999, 2009 ఎన్నికల్లో గెలిచాడు. 2004, 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈసారి నియోజకవర్గంలో పలువురు పార్టీ నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ అంతకంటే మెరుగైన అభ్యర్థి లేక పరసానే దించారు.

ఇక వైసిపి అభ్యర్థి కిలివేటి సంజీవయ్య 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపిలో చేరాడు. 2014లో సూళ్లూరుపేట నుండి వైసిపి అభ్యర్థిగా విజయం సాధించాడు. ఈ ఐదేళ్ళు ప్రజల మధ్యనే వున్నాడు. వ్యక్తిగా మంచి పేరుంది. ఇటీవల నియోజకవర్గంలో సంబంధించిన పరిణామాలన్నీ సంజీవయ్యకు కలిసొచ్చేవే! నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ కేడర్‌ను నిర్వీర్యం చేయగా, సంజీవయ్య సమర్ధ నాయకత్వం వైసిపిలో ఉత్సాహాన్ని తెచ్చింది. నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, డి.వి.సత్రం, తడ, పెళ్లకూరు, నాయుడుపేట మండలాలలోనూ ఇటీవల వైసిపిలోకి భారీగా వలసలు జరిగాయి. కొత్త నాయకులు చేరారు. టిడిపి కంటే ఇక్కడ వైసిపియే హుషారుగా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here