Home జిల్లా వార్తలు సీనియారిటీకి ప్రయారిటి

సీనియారిటీకి ప్రయారిటి

ఇంకో ఇరవైరోజుల్లో ఎన్నికల కోడ్‌ కూయనుంది. ఇంకో రెండు నెలల్లో ఎన్ని కల ముంగిట వుంటాం… మూడు నెలల తర్వాత ఏ ప్రభుత్వముంటుందో తెలి యదు. ఈ సమయంలో పార్టీలో సీని యార్టీకి, సిన్సియార్టీకి పెద్దపీట వేయాలనే ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకి. ఈ నేపథ్యంలోనే జిల్లా నుండి ముగ్గురికి నామినేటెడ్‌ పదవులు కేటాయించారు. ఏపి వైద్య ఆరోగ్య మౌలిక వనరుల కల్పనా సంస్థ ఛైర్మెన్‌గా టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ను, రాష్ట్ర మహిళా ఆర్ధిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్ళపాక అనూరాధను, ఐసిడిఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌గా కావలికి చెందిన గుంటుపల్లి శ్రీదేవిచౌదరిని నియమించారు.

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది మొదలు… ఈ ముగ్గురి పేర్లు కూడా నామినేటెడ్‌ పదవుల జాబితాలో షికారు చేశాయి. నాలుగేళ్లుగా వాళ్ళు పదవుల కోసం ఎదురు చూసి, ఇటీవలే ఇక ఎదురుచూడడం దండగని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికలను ముంగిట్లో పెట్టుకుని పదవులు ఇవ్వడం వెనుక చంద్రబాబు ఉద్దేశ్యం వేరే చెప్పనక్కరలేదు.

ఇక పదవులు పొందిన ముగ్గురు కూడా తెలుగుదేశం అంటే చొక్కాలు చించుకునే వాళ్ళే! కోస్తే మా బ్లడ్‌ పసుపురంగులో వుంటుంది అనే రకం. డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ వృత్తిపరంగా వైద్యుడైనా ప్రవృత్తిపరంగా తెలుగుదేశం సేవకుడు. పార్టీ వైద్య విభాగంలో కీలకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ ప్రతి పక్షంలో వున్నప్పుడే పార్టీ ద్వారా అనేక ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి, పార్టీకి పేరు తెచ్చాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆయన, పరోక్ష ఎన్నికలతో నెల్లూరులో వైసిపి హవా వల్ల కార్పొరేటర్‌గానే పరిమితమ య్యాడు. పదవులున్నా లేకున్నా నిరంతరం పార్టీ కోసం తపించిన జడ్‌.యస్‌.కు ఇన్నాళ్ళకు పార్టీ సముచిత గౌరవమిచ్చింది.

అలాగే మహిళా ఆర్ధిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన టి.అనూరాధ గురించి అందరికీ తెలుసు. మాజీమంత్రి టి.రమేష్‌ రెడ్డి అర్ధాంగిగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఆమె 2000 సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా విజయం సాధించింది. 2005 ఎన్నికల్లో మళ్ళీ కౌన్సిలర్‌గా గెలుపొందారు. అప్పటి నుండి కూడా ఆమె పార్టీలోనే వుంటూ పార్టీ కార్యక్ర మాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.

ఐసిడిఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌గా నియమితులైన శ్రీదేవి చౌదరి కావలిలో సీనియర్‌ నాయకురాలు. పార్టీకి విధేయురాలు.

వీరికే కాకుండా నెల్లూరుకు చెందిన మాజీకౌన్సిలర్‌ మండవ రామయ్యను సమాచారహక్కు చట్టం సభ్యుడిగాను, కావలికి చెందిన మైనంపాటి ఏసురత్నంను క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌గానూ నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here