Home జిల్లా వార్తలు సిద్ధమవుతున్న.. గేట్లు లేని రైల్వే మార్గం

సిద్ధమవుతున్న.. గేట్లు లేని రైల్వే మార్గం

కృష్ణపట్నం – ఓబుళవారి పల్లి రైల్వేట్రాక్‌ ప్రారంభానికి సిద్ధం కాబోతోంది. బహుశా సకాలంలో అన్ని పనులు పూర్త యితే ఈ ప్రభుత్వంలోనే ప్రారంభం కూడా వుండొచ్చు.

కృష్ణపట్నం పోర్టు నుండి సరుకు రవాణాను వేగవంతం చేసే ప్రణాళికలో భాగంగా కృష్ణపట్నం నుండి కడప జిల్లాలోని ఓబుళవారిపల్లి వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం తెలిసిందే! మొత్తం 95కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వేలైన్‌కు కేంద్రం 1800 కోట్లు మంజూరు చేసింది. రైల్వేట్రాక్‌ పనులు చకచక జరిగాయి. 16మీటర్ల ఎత్తుతో మట్టి కట్ట పోసి దానిపై ట్రాక్‌ ఏర్పాటు చేశారు. ఈ రైల్వేలైన్‌ విశేషమేంటంటే వెంకటాచలం నుండి ఓబుళవారిపల్లి వరకు ఎక్కడా రైల్వేగేట్‌ అనేదే వుండదు. ప్రతిరోడ్డు క్రాసింగ్‌ వద్ద రైల్వే వంతెనలు ఏర్పాటు చేశారు. రైల్వే క్రాసింగ్‌ లేని తొలి రైల్వేలైన్‌గా ఇది చరిత్రకెక్కబోతోంది. అలాగే 95కిలోమీటర్ల దూరం గల ఈ లైన్‌లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సొరంగమార్గాన్ని ఏర్పరిచారు. వెలుగొండలను తొలచి రైల్వేట్రాక్‌లు ఏర్పాటు చేశారు. వెంకటాచలం – ఓబుళవారిపల్లి మధ్యలో ఆరు రైల్వేస్టేషన్లు కూడా రూపుదిద్దుకున్నాయి.

ఈ రైల్వేలైన్‌ ప్రారంభమైతే కృష్ణపట్నం నుండి కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు కనెక్టివిటి పెరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా గూడ్స్‌ రవాణాతో పాటు ప్రజా రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ రైల్వేలైన్‌ వల్ల వెంకటాచలం, పొదలకూరు, డక్కిలి, రాపూరు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here